Mrunal Thakur: అందంతో మెస్మ‌రైజ్ చేస్తున్న మృణాల్ ఠాకూర్‌- హిందీలో బిజీ అయిన సీతారామం బ్యూటీ- రాకాపై ఆశలు- వైర‌ల్ ఫొటోలు

Mrunal Thakur: సీతారామం సినిమాతో  తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన మృణాల్ ఠాకూర్‌ ఇప్పడు హిందీలో బిజీగా మారిపోయింది. బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్న ఈ భామ.. ఇన్ స్టాలో హాట్ పోజులతో రెచ్చిపోయింది. అల్లు అర్జున్ రాకా మూవీపై ఆశలు పెట్టుకున్న మృణాల్ ఫొటోలు వైరల్ గా మారాయి.

Published on: May 30, 2026, 19:05:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Mrunal Thakur: హిందీ నుంచి తెలుగులోకి వచ్చిన మృణాల్ ఠాకూర్ ఇప్పుడు మళ్లీ బాలీవుడ్ లో బిజీ అయిపోయింది. హిందీలో వరుసగా మూవీస్ చేస్తోంది. ఆమె లేటెస్ట్ హిందీ మూవీ ‘హే జవానీ తో ఇష్క్ హోనా హై’ త్వరలోనే రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ఇన్ స్టాగ్రామ్ లో ఇవాళ హాట్ పోజులో పోస్టు చేసింది మృణాల్ ఠాకూర్‌.

అందంతో మెస్మరైజ్ చేస్తున్న మృణాల్ ఠాకూర్‌ (instagram-Mrunal Thakur)
అందంతో మెస్మరైజ్ చేస్తున్న మృణాల్ ఠాకూర్‌ (instagram-Mrunal Thakur)

వైరల్ గా మృణాల్ ఠాకూర్‌ ఫొటోలు

యాక్టింగ్ తో పాటు అందంతోనూ అలరించే మృణాల్ ఠాకూర్‌ ఇవాళ (మే 30) ఇన్ స్టాలో లేటెస్ట్ పిక్స్ షేర్ చేసింది. బ్లాక్ ఔట్ ఫిట్ లో అ భామ పోజులు అదిరిపోయాయి. ఈ ఫొటోలు ఇన్ స్టంట్ గా వైరల్ అవుతున్నాయి. ఈ పోస్టుకు ‘హే జవానీ తో ఇష్క్ హోనా హై’ మూవీ మరో హీరోయిన్ పూజ హెగ్డే కామెంట్ పెట్టింది. ‘గార్జియస్’ అంటూ మృణాల్ ఠాకూర్‌ అందాన్ని పొగిడేసింది.

హిందీలో బిజీ

మహారాష్ట్ర భామ మృణాల్ ఠాకూర్‌ హిందీలో బిజీ అయిపోయింది. బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తోంది. వరుణ్ ధావన్ హీరోగా నటించిన ‘హే జవానీ తో ఇష్క్ హోనా హై’ మూవీలో మృణాల్ ఠాకూర్‌ హీరోయిన్. ఈ చిత్రం జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. మరోవైపు ‘పూజ మేరీ జాన్’ సినిమాలోనూ మృణాల్ ఠాకూర్‌ నటిస్తోంది.

రాకాపై ఆశలు

తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘రాకా’. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్‌ ఓ కీలక పాత్ర పోషిస్తుందని సమాచారం. ఈ నేపథ్యంలో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి తిరిగి రాకాతో గట్టిగా కమ్ బ్యాక్ ఇవ్వాలని ఈ భామ చూస్తుందనే టాక్ వినిపిస్తోంది. రాకా మూవీలో అల్లు అర్జున్ సరసన దీపికా పదుకొణె నటిస్తుందనే సంగతి ఇప్పటికే తెలిసిందే.

సీతారామంతో

మరాఠీ సినిమాలతో మృణాల్ ఠాకూర్‌ తన కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత హిందీలో అడుగుపెట్టింది. సీతారామంతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ లో హాయ్ నాన్న, ది ఫ్యామిలీ స్టార్, డెకాయిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి 2898 ఏడీ మూవీలో క్యామియోలో మెరిసింది.

రీసెంట్ గా అడవి శేష్, మృణాల్ ఠాకూర్‌ కాంబినేషన్లో వచ్చిన డెకాయిట్ సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో శేష్, మృణాల్ కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More