Divyendu: ఆ తెలుగు మూవీ చూసి షాక్ అయిన దివ్యేందు శర్మ.. ఎస్ఎస్ రాజమౌళిపై షాకింగ్ కామెంట్లు.. వీడియో వైరల్
Divyendu: పెద్ది మూవీతో ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసేందుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రెడీ అవుతున్నాడు. ఈ సినిమాపై క్రేజీ బజ్ నెలకొంది. అయితే ఈ చిత్రంలో నటించిన దివ్యేందు శర్మ పేరు కూడా వైరల్ గా మారింది. తాజాగా ఓ తెలుగు మూవీ చూసి షాక్ అయ్యానని దివ్యేందు చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.
Divyendu: ఇండియాలో మోస్ట్ అవేటెడ్ మూవీస్ లో రామ్ చరణ్ ‘పెద్ది’ ఒకటి. ఈ మూవీతో బాక్సాఫీస్ బద్దలు కొట్టేందుకు గ్లోబల్ స్టార్ చరణ్ బరిలో దిగబోతున్నాడు. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ జూన్ 4న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో పెద్ది నటుడు దివ్యేందు శర్మ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.

పెద్దితో టాలీవుడ్ లో
పెద్ది సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెడుతున్నాడు దివ్యేందు శర్మ. మీర్జాపూర్ సిరీస్ లో మున్నాభాయ్ గా సినీ లవర్స్ కు దివ్యేందు సుపరిచితమే. ఇప్పుడు పెద్దిలో విలనిజం పండించనున్నాడు. పెద్ది రిలీజ్ దగ్గర పడుతుండటంతో మూవీ టీమ్ ప్రమోషన్లలో వేగం పెంచింది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో దివ్యేందు ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు.
ఈగ చూసి షాక్
‘‘పెద్ది మూవీ షూటింగ్ స్టార్ట్ చేయకముందు సౌత్ ఇండియా సినిమాలపై మీ అభిప్రాయం ఏంటీ’’ అని ఇంటర్వ్యూలో దివ్యేందును అడిగారు.
‘‘సౌత్ ఇండియా మూవీస్ ను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నా. నేను ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ నుంచి వచ్చా. అక్కడ సౌత్ ఇండియా స్టార్లు, సినిమాల గురించి తెలుసుకున్నా. ముఖ్యంగా ఈగ మూవీ చూసి షాక్ అయిపోయా. రాజమౌళి ఈ కథను అనుకోవడం, దాన్ని తెరపైకి తీసుకురావడం గొప్ప విషయం. అసలు ఎలా తీశారోనని అనుకున్నా. అలాగే బాహుబలి, ఆర్ఆర్ఆర్ మూవీస్ నూ చూశా’’ అని దివ్యేందు చెప్పాడు.
సూపర్ హిట్
దిగ్గజ దర్శకుడు రాజమౌళి కెరీర్ లో మరుపురాని మూవీస్ లో ఈగ ఒకటి. ఈగను పెట్టి సినిమా తీయొచ్చనే ఆలోచన రావడమే కాదు, దాన్ని తెరపైకి అద్భుతంగా తీసుకొచ్చాడు. ఈ మూవీలో సమంత, నాని ప్రధాన పాత్రలు పోషించారు. కానీ హీరో మాత్రం ఈగనే. తనను చంపిన, తన లవర్ ను హింసిస్తున్న విలన్ పై ఈగ ప్రతీకారం తీర్చుకునే తీరు హైలైట్. ఈ మూవీ థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచింది.
పెద్ది గురించి
రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన పెద్ది మూవీ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇందులో జగపతి బాబు, శివ రాజ్ కుమార్, దివ్యేందు శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు. ఇందులో ఓ గ్రామీణ క్రీడాకారుడిగా చరణ్ నటించాడు. పెద్ది మూవీ ప్రీమియర్ షోలకు, టికెట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసేందుకు ఫ్యాన్స తెగ ఎగ్జైటింగ్ తో వెయిట్ చేస్తున్నారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


