నాజీ నియంత హిట్లర్​కి ‘కాల్​మన్​ సిండ్రోమ్​’- చిన్న పురుషాంగం వల్లే మహిళలకు దూరంగా..!

హిట్లర్ రక్తంపై డీఎన్​ఏ పరీక్షలు నిర్వహించగా, కొన్ని సంచలన విషయాలు బయటకి వచ్చాయి. నాజీ నియంతకు 'కాల్‌మన్ సిండ్రోమ్' ఉండొచ్చని పరీక్షల్లో తేలింది. అసలేంటి ఈ కాల్​మన్​ సిండ్రోమ్​? లక్షణాలు ఏంటి?

Published on: Nov 14, 2025 7:30 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నాజీ నియంత అడాల్ఫ్ హిట్లర్ ఒక జన్యుపరమైన రుగ్మత ‘కాల్‌మన్ సిండ్రోమ్’తో బాధపడినట్టు తెలుస్తోంది. ఈ మేరకు హిట్లర్ రక్తంపై నిర్వహించిన డీఎన్‌ఏ పరీక్షల ద్వారా పరిశోధకులు ఈ నిర్ధారణకు వచ్చారు. ఈ సిండ్రోమ్ కారణంగా మైక్రోపీనిస్ వంటి లక్షణాలు కనిపించవచ్చు.

నాజీ నియంత ఆడాల్ఫ్​ హిట్లర్​.. (X/@krassenstein)
నాజీ నియంత ఆడాల్ఫ్​ హిట్లర్​.. (X/@krassenstein)

హిట్లర్​ లైంగిక జీవితంపై పరిశోధకుల అభిప్రాయం..

పోట్స్‌డామ్ యూనివర్శిటీకి చెందిన అలెక్స్ కే ఈ పరిశోధనపై స్పందిస్తూ.. "హిట్లర్ జీవితాంతం మహిళలతో ఎందుకు అంత ఇబ్బందికరంగా ఉండేవాడు, లేదా మహిళలతో ఎందుకు సన్నిహిత సంబంధాలు పెట్టుకోలేకపోయాడు అనే దానికి ఇప్పటివరకు ఎవరూ సరైన వివరణ ఇవ్వలేకపోయారు. కానీ, ఇప్పుడు ఆయనకు కాల్‌మన్ సిండ్రోమ్ ఉందని మనకు తెలుసు కాబట్టి, మనం వెతుకుతున్న సమాధానం ఇదే కావచ్చు!" అని అన్నారు.

వాస్తవానికి.. హిట్లర్ లైంగిక అవయవాన్ని అపహాస్యం చేస్తూ గతంలో కొన్ని ప్రసిద్ధ ప్రపంచ యుద్ధం-II పాటలు వచ్చాయి. కానీ వాటికి ఇప్పటివరకు ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదు. ఈ పరిశోధనా ఫలితాలను ఈ శనివారం ప్రసారం కానున్న కొత్త డాక్యుమెంటరీ – ‘హిట్లర్స్ డీఎన్‌ఏ: బ్లూప్రింట్ ఆఫ్ ఎ డిక్టేటర్’లో చూపించనున్నారు.

హిట్లర్ డీఎన్​ఏ పరీక్షల ఫలితాలు ఏంటి?

పరీక్షల్లో హిట్లర్‌కు కాల్‌మన్ సిండ్రోమ్ ఉండే అవకాశం 'ఎక్కువ'గా ఉందని తేలింది.

అంతేకాకుండా, ఆటిజం, స్కిజోఫ్రెనియా, బైపోలార్ డిజార్డర్ వంటి మానసిక సమస్యలకు దారితీసే లక్షణాలు అతడిలో 'చాలా ఎక్కువ' స్థాయిలో, వాస్తవానికి, టాప్ వన్ పర్సెంట్​లో ఉన్నట్లు కూడా ఈ పరీక్షలు చూపించాయని కార్యక్రమ నిర్మాత సంస్థ బ్లింక్ ఫిల్మ్స్ తెలిపింది.

మరోవైపు ఈ పరీక్షలు.. హిట్లర్‌కు యూదుల పూర్వీకులతో సంబంధం ఉందన్న పుకార్లను కూడా ఖండించాయి. "డీఎన్‌ఏ విశ్లేషణలో వై క్రోమోజోమ్ డేటా హిట్లర్ మేల్​లైన్​ డీఎన్‌ఏతో సరిపోలింది. ఆయనకు యూదుల పూర్వీకులు ఉంటే (బయటి సంబంధాల ద్వారా), ఈ సరిపోలిక ఉండేది కాదు," అని నిర్మాణ సంస్థ పేర్కొంది.

హిట్లర్ తనను తాను కాల్చుకున్న సోఫా నుంచి తీసుకున్న వస్తువుల భాగం నుంచి పరిశోధకులు పొందిన రక్తం నమూనా ద్వారా ఈ పరీక్షలు చేయడం సాధ్యమైంది!

కాల్‌మన్ సిండ్రోమ్ అంటే ఏమిటి?

కాల్‌మన్ సిండ్రోమ్ గురించి క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ ఇచ్చిన వివరాలు..

లక్షణాలు: కాల్‌మన్ సిండ్రోమ్ ప్రధానంగా లైంగిక అభివృద్ధికి తోడ్పడే హార్మోన్ల ఉత్పత్తిని, అలాగే వాసన జ్ఞానాన్ని ప్రభావితం చేస్తుంది.

ఇది ఆలస్యంగా యవ్వనం రావడానికి లేదా యవ్వనం అస్సలు రాకుండా నిరోధించడానికి కూడా కారణం కావచ్చు!

కారణం: పిండం అభివృద్ధి చెందేటప్పుడు కొన్ని జన్యువులు మారినప్పుడు ఈ సిండ్రోమ్ సంభవిస్తుందని నివేదికలు సూచిస్తున్నాయి. తల్లిదండ్రుల నుంచి పిల్లలకు ఇది సంక్రమించవచ్చు.

ఈ పరిస్థితి మహిళల కంటే పురుషులలో ఎక్కువగా కనిపిస్తుంది.

పురుషుల్లో ప్రభావం: అబ్బాయిలకు చిన్న పురుషాంగం- వృషణాలు ఉండటానికి, అలాగే వంధ్యత్వానికి కూడా ఈ సిండ్రోమ్ దారి తీయవచ్చు.

మహిళల్లో ప్రభావం: అమ్మాయిలలో రొమ్ముల అభివృద్ధి లోపించడం, రుతుస్రావం అస్సలు రాకపోవడం లేదా గణనీయంగా ఆలస్యం కావడం వంటి సమస్యలు ఏర్పడవచ్చు.

ఇతర సాధారణ లక్షణాలు: ఇద్దరిలోనూ శరీర సమతుల్యత సమస్యలు, పంటి లోపాలు (దంతాలు లేకపోవడం లేదా చిన్నవిగా ఉండటం), కంటి కదలికల రుగ్మతలు, అలసట, తక్కువ సెక్స్ డ్రైవ్, మానసిక మార్పులు, వెన్నెముక వంకర, బరువు పెరగడం వంటివి ఉండవచ్చు. కొన్ని సందర్భాల్లో కిడ్నీ లోపం కూడా ఉండవచ్చు.

ఈ సిండ్రోమ్‌కు చికిత్స చేయడానికి హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ సాధారణ మార్గం అని క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ తెలిపింది.

హిట్లర్, కాల్‌మన్ సిండ్రోమ్ గురించి మాట్లాడుతూ, బ్లింక్ ఫిల్మ్స్ సంస్థ.. ఈ సిండ్రోమ్ తరచుగా "తక్కువ టెస్టోస్టెరాన్ స్థాయిలు, వృషణాలు కిందికి దిగకపోవడం, మైక్రోపెనిస్" కు దారి తీస్తుందని పేర్కొంది!