King: 175 కోట్లకు షారుఖ్ ఖాన్ కింగ్ ఓవర్సీస్ రైట్స్- తొలి ఇండియన్ మూవీ ఇదే- కానీ అన్ని కోట్ల కలెక్షన్స్ వస్తేనే లాభం?
Shah Rukh Khan King Overseas Rights: బాక్సాఫీస్ వద్ద పాన్ ఇండియా సినిమాలు హవా సాగిస్తున్న తరుణంలో విదేశీ మార్కెట్‌లో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు. ఆయన నటిస్తున్న కొత్త సినిమా కింగ్ ఓవర్సీస్ థియేట్రికల్ హక్కులు ఏకంగా రూ. 175 కోట్లకు అమ్ముడై ఆల్‌టైమ్ రికార్డు సృష్టించాయి.
Shah Rukh Khan King Overseas Rights Record: భారతీయ సినిమా మార్కెట్‌ను దక్షిణాది పాన్ ఇండియా చిత్రాలు ఏలుతున్నప్పటికీ.. విదేశీ గడ్డపై మాత్రం తనదే పైచేయి అని బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ మరోసారి నిరూపించారు. షారుఖ్ కథానాయకుడిగా నటిస్తున్న 'కింగ్' చిత్రం విడుదలకు ముందే ఓవర్సీస్ మార్కెట్‌లో ప్రభంజనం సృష్టిస్తోంది.

కింగ్ ఓవర్సీస్ రైట్స్
కింగ్ సినిమా ఓవర్సీస్ థియేట్రికల్ హక్కులు ఏకంగా రూ.175 కోట్లకు (సుమారు 18 మిలియన్ డాలర్లు) అమ్ముడైనట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. భారతీయ చలనచిత్ర చరిత్రలోనే ఒక సినిమా ఓవర్సీస్ రైట్స్‌కు ఈ స్థాయి ధరకు క్లోజ్ అవ్వడం ఇదే తొలిసారి.
ఫార్స్ ఫిలిమ్స్ చేతికి 'కింగ్' హక్కులు
సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘కింగ్’ ఓవర్సీస్ పంపిణీ బాధ్యతలను ప్రముఖ అంతర్జాతీయ సంస్థ 'ఫార్స్ ఫిలిమ్స్' (Phars Films) దక్కించుకుంది. రూ.175 కోట్ల మినిమమ్ గ్యారంటీ (MG) ప్రాతిపదికన ఈ భారీ ఒప్పందం కుదిరినట్లు పింక్‌విల్లా కథనం తెలిపింది.
సాధారణంగా షారుఖ్ ఖాన్ చిత్రాల విదేశీ హక్కులను యశ్ రాజ్ ఫిల్మ్స్ పంపిణీ చేస్తుంటుంది. 2023లో వచ్చిన 'పఠాన్', 'జవాన్' సినిమాలను ఆ సంస్థే విదేశాల్లో గ్రాండ్ రిలీజ్ చేసింది. అయితే, గతంలో వైఆర్‌ఎఫ్‌తో కలిసి పనిచేసిన అనుభవంతో పాటు ప్రభాస్ నటించిన 'సాహో' చిత్రాన్ని విదేశాల్లో సొంతంగా పంపిణీ చేసిన ట్రాక్ రికార్డ్ ఫార్స్ ఫిలిమ్స్‌కు ఉంది.
మన దేశంలో ఇప్పటివరకు ఏ సినిమా ఓవర్సీస్ మినిమమ్ గ్యారంటీ రూ.100 కోట్ల మార్కును దాటలేదు. అలాంటిది ఏకంగా రూ.175 కోట్లు కేటాయించడం సినీ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
బాక్సాఫీస్ వద్ద నెగ్గాలంటే ఎంత రాబట్టాలి?
ఓవర్సీస్ పంపిణీదారులు ఒక సినిమాపై ఇంత భారీ మొత్తాన్ని వెచ్చించారంటే బాక్సాఫీస్ వద్ద ఆ చిత్రం సాధించే వసూళ్లపై వారికి ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తుంది. విదేశీ మార్కెట్‌లో పంపిణీదారులకు వచ్చే రాబడి సాధారణంగా బాక్సాఫీస్ గ్రాస్‌లో 50 శాతం మాత్రమే ఉంటుంది.
అంటే, ఫార్స్ ఫిలిమ్స్ పెట్టిన రూ.175 కోట్ల పెట్టుబడి క్లియర్ అయి బ్రేక్ ఈవెన్ సాధించాలంటే 'కింగ్' మూవీ విదేశాల్లో కనీసం 37-40 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 350 నుంచి 375 కోట్లు గ్రాస్) రాబట్టాల్సి ఉంటుంది.
ధురంధర్ 2, ఆర్ఆర్ఆర్ సరసన నిలిస్తేనే
గతంలో షారుఖ్ ఖాన్ నటించిన 'పఠాన్', 'జవాన్' చిత్రాలు అంతర్జాతీయంగా దాదాపు రూ.400 కోట్ల చొప్పున వసూలు చేశాయి. పంపిణీదారులు లాభాల బాట పట్టాలంటే 'కింగ్' సినిమా కూడా అదే స్థాయిలో వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది.
విదేశీ మార్కెట్‌లో ఆల్‌టైమ్ బిగ్గెస్ట్ హిట్లుగా నిలిచిన 'ధురంధర్ 2' (రూ. 460 కోట్లు), 'ఆర్ఆర్ఆర్' (రూ. 430 కోట్లు) చిత్రాల సరసన 'కింగ్' నిలిస్తేనే ఈ డీల్ పూర్తిస్థాయిలో లాభసాటిగా మారుతుంది.
తండ్రీకూతుళ్ల క్రేజీ కాంబినేషన్.. డిసెంబర్ 24న రిలీజ్
'పఠాన్'తో షారుఖ్‌కి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన సిద్ధార్థ్ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు మరొక ప్రత్యేకత ఉంది. ఈ సినిమాలో షారుఖ్ కుమార్తే సుహానా ఖాన్ కూడా నటిస్తోంది. షారుఖ్ ఖాన్, సుహానా ఖాన్ కలిసి తొలిసారి వెండితెరను పంచుకుంటున్నారు. సుహానా గతేడాది 'ది ఆర్చీస్'తో ఓటీటీలోకి అడుగుపెట్టినప్పటికీ, థియేట్రికల్ రిలీజ్‌గా ఆమెకు ఇదే మొదటి చిత్రం.
ఈ భారీ యాక్షన్ డ్రామాలో దీపికా పదుకొణె, అభిషేక్ బచ్చన్, రాణీ ముఖర్జీ, జైదీప్ అహ్లావత్, రాఘవ్ జుయల్, సౌరభ్ శుక్లా కీలక పాత్రల్లో కనిపిస్తారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న కింగ్ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


