OTT Crime Thriller: ఓటీటీలోకి డైరెక్ట్ నయా క్రైమ్ థ్రిల్లర్- రియలిస్టిక్ యాక్షన్, ఫొరెన్సిక్ ట్విస్టులు- ఎక్కడ చూడాలంటే?
Mrigaya 1.5 The Hunt Continues OTT Teaser Released: ఓటీటీలోకి సూపర్ హిట్ ఫ్రాంచైజీ నుంచి వస్తున్న మృగయ 1.5: ది హంట్ కంటిన్యూస్ రానుంది. తాజాగా మృగయ 1.5 టీజర్‌ను విడుదల చేశారు. కోల్‌కతా పోలీస్ ఇన్వెస్టిగేషన్, రస్టిక్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన మృగయ 1.5 ఓటీటీ స్ట్రీమింగ్పై లుక్కేద్దాం.
Mrigaya 1.5 The Hunt Continues OTT Teaser Released: బెంగాలీ సినిమా ఇండస్ట్రీలో విలక్షణమైన క్రైమ్ థ్రిల్లర్లతో గుర్తింపు తెచ్చుకున్న 'మృగయ' ఫ్రాంచైజీ నుంచి కొత్త చాప్టర్ సిద్ధమైంది. సస్పెన్స్, మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ఘట్టాలతో తెరకెక్కిన 'మృగయ 1.5: ది హంట్ కంటిన్యూస్' టీజర్‌ను మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు.

పూర్తిస్థాయి రియలిస్టిక్ యాక్షన్ విజువల్స్
ప్రఖ్యాత దర్శకుడు అభిరూప్ ఘోష్ మృగయ 1.5: ది హంట్ కంటిన్యూస్ చిత్రాన్ని పూర్తిస్థాయి రియలిస్టిక్ యాక్షన్ విజువల్స్‌తో తీర్చిదిద్దారు. అక్టోబర్ 30న విడుదలైన మృగయ 1.5: ది హంట్ కంటిన్యూస్ టీజర్ ఇప్పుడు ఆకట్టుకుంటోంది.
నయా నేరాలు.. నగరంలో విధ్వంసం
కోల్‌కతా వీధుల్లో జరిగే దారుణమైన నేరం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. నగరంలో ఒక ఘోరమైన హత్య జరగడంతో ఆ కేసును ఛేదించే బాధ్యతను ఆఫీసర్ డెబాంజన్ దత్తా భుజస్కంధాలపై వేసుకుంటారు. విచారణ ముందుకు సాగుతున్న కొద్దీ తప్పుదోవ పట్టించే ఆధారాలు, ఊహించని మలుపులు పోలీసులకు సవాలుగా మారతాయి.
ఈ నేరం వెనుక ఒక భయంకరమైన గ్యాంగ్ ప్రమేయం ఉందని గ్రహించిన పోలీసు బృందం, వారిని పట్టుకోవడానికి ప్రాణాలకు తెగించి పోరాడుతుంది. ఈ క్రమంలో కోల్‌కతా మహానగరం మొత్తం గ్యాంగ్స్టర్లు, పోలీసుల మధ్య జరుగుతున్న రణరంగంగా మారుతుంది.
గూస్బంప్స్ యాక్షన్ సీక్వెన్స్, నయా స్టార్ కాస్టింగ్
2025లో వచ్చి విశేష ఆదరణ పొందిన 'మృగయ: ది హంట్' చిత్రానికి స్పిన్-ఆఫ్‌గా ఈ 1.5 వెర్షన్ రాబోతోంది. మొదటి భాగంలో సోనాగాచి ప్రాంతంలో జరిగిన హత్య కేసు ఇన్వెస్టిగేషన్‌ను చూపించగా, ఈసారి పరిధిని మరింత పెంచారు.
రిత్విక్ చక్రవర్తి ఆఫీసర్ డెబాంజన్ దత్తాగా తిరిగి వస్తుండగా, ఏసీపీ అగ్నీశ్వర్ ఛటర్జీ పాత్రలో మీర్ అఫ్సర్ అలీ, జయితా సేన్ పాత్రలో కౌషానీ ముఖర్జీ కొత్తగా టీమ్‌లోకి చేరారు. అనన్య భట్టాచార్య, అర్పణ్ ఘోషాల్, అరిత్ర దత్తా బనిక్, సోహిణి గుహ రాయ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఫొరెన్సిక్ ట్విస్టులు
"మొదటి భాగం కంటే ఈ చిత్రంలో విజువల్స్, ఫొరెన్సిక్ ట్విస్టులు, గూస్బంప్స్ తెప్పించే యాక్షన్ సన్నివేశాలు వేగంగా సాగుతాయి" అని మేకర్స్ వెల్లడించారు. కంప్యూటర్ గ్రాఫిక్స్ కంటే ప్రాక్టికల్ యాక్షన్‌కే ఈ చిత్రంలో ప్రాధాన్యతనిచ్చారు.
థియేటర్ కాకుండా నేరుగా ఓటీటీలోకి
ముందుగా మృగయ 1.5: ది హంట్ కంటిన్యూస్ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ, తాజాగా మృగయ 1.5: ది హంట్ కంటిన్యూస్ ఓటీటీలో డైరెక్ట్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజం 'జీ5' (ZEE5) మృగయ 1.5: ది హంట్ కంటిన్యూస్ ఓటీటీ హక్కులను సొంతం చేసుకుంది.
ఈ లెక్కన జీ5లో మృగయ 1.5: ది హంట్ కంటిన్యూస్ ఓటీటీ రిలీజ్ కానుందన్నమాట. నవంబర్ 13 నుంచి నేరుగా జీ5లో మృగయ 1.5: ది హంట్ కంటిన్యూస్ ఓటీటీ స్ట్రీమింగ్ అవనుంది.
జీ5 ఓటీటీలో
అయితే, ఈ కొత్త కథలోకి వెళ్లేముందు మొదటి భాగాన్ని చూడాలనుకునే ప్రేక్షకుల కోసం 2025లో వచ్చిన 'మృగయ: ది హంట్' కూడా ప్రస్తుతం జీ5 ఓటీటీలోనే స్ట్రీమింగ్ అవుతోంది. క్రైమ్, మిస్టరీ థ్రిల్లర్లను ఇష్టపడే ఓటీటీ ప్రియులకు 'మృగయ 1.5' సరికొత్త అనుభూతిని అందించనుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


