Netflix OTT: 68 ఏళ్ల వయసులో ఓటీటీ ఎంట్రీ ఎంటీ? నెట్‌ఫ్లిక్స్ ఆఫర్‌పై నవ్వేసిన స్టార్ హీరో-కానీ టాప్ 1గా ఓటీటీ ట్రెండింగ్
Sunny Deol About Netflix OTT Debut: 40 ఏళ్లపాటు పవర్‌ఫుల్ యాక్షన్ హీరోగా వెండితెరను ఏలిన సన్నీ డియోల్ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చి రికార్డులు సృష్టిస్తున్నారు. ఫైట్లు లేకుండా కేవలం కోర్టురూమ్ డ్రామాతో ఓటీటీ టాప్ 1 ట్రెండింగ్‌లోకి వచ్చిన ఈ సినిమా వెనుక ఉన్న ఆసక్తికర విశేషాలను చూద్దాం.
Sunny Deol About Netflix OTT Debut: బాక్సాఫీస్ దగ్గర 'గదర్ 2', 'బోర్డర్ 2', 'జాట్' సినిమాలతో భారీ యాక్షన్ సునామీ సృష్టించిన బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ ఓటీటీ ప్రపంచంలోనూ తన మార్కు చూపిస్తున్నారు.

ఓటీటీలోకి గ్రాండ్ ఎంట్రీ
నాలుగు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో రికార్డు హిట్లు ఇచ్చిన సన్నీ డియోల్.. డైరెక్టర్ సిద్ధార్థ్ పి మల్హోత్రా దర్శకత్వంలో తెరకెక్కిన 'ఇక్కా' చిత్రంతో నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. అక్షయ్ ఖన్నా కీలక పాత్ర పోషించిన ఈ కోర్ట్ లీగల్ డ్రామా, ఓటీటీ స్ట్రీమింగ్ ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది.
అయితే, ఇక్కా సినిమా ఒప్పుకునే క్రమంలో సన్నీ డియోల్ మనసులో ఎన్నో సందేహాలు ఉన్నాయని నెట్‌ఫ్లిక్స్ ఇండియా ఒరిజినల్ ఫిల్మ్స్ డైరెక్టర్ రుచికా కపూర్ షేక్ ఇటీవల వెల్లడించారు.
యాక్షన్ సీన్లు లేకపోతే జనం చూస్తారా?
సినీ కెరీర్ ప్రారంభం నుంచి సన్నీ డియోల్ అంటేనే భారీ డైలాగులు, పవర్‌ఫుల్ ఫైట్లు, శత్రువులను అల్లకల్లోలం చేసే సీన్లు గుర్తుకొస్తాయి. 'గదర్' సినిమాలో హ్యాండ్ పంప్ పీకే సన్నివేశం నుంచి ఇటీవలి మాస్ చిత్రాల వరకు ఆయన ఇమేజ్ అదే. అలాంటిది అసలు ఒక్క యాక్షన్ సీన్ కూడా లేని కోర్టురూమ్ డ్రామాలో నటించడానికి సన్నీ మొదట జంకారని రుచికా గుర్తు చేసుకున్నారు రుచికా.
"సన్నీ సర్ 'ఇక్కా' కథ విన్నప్పుడు ఇందులో ఒక్క యాక్షన్ సీన్ కూడా లేదు కదా అని ఆందోళన చెందారు" అని రుచికా తెలిపారు. "ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఇచ్చే గొప్ప అవకాశమే అది. ప్రేక్షకులు ఇష్టపడే కోర్టురూమ్ డ్రామాలో మిమ్మల్ని కొత్తగా చూపిస్తే ఫలితం అద్భుతంగా ఉంటుందని ధైర్యం చెప్పాను" అని ఆమె వివరించారు. ఈ ప్రయోగం సక్సెస్ అవుతుందో లేదో రెండు నెలల తర్వాత తేలిపోతుందని ఆయనకు నచ్చజెప్పినట్లు రుచికా కపూర్ షేక్ చెప్పారు.
68 ఏళ్ల వయసులో 'డెబ్యూ' ఏంటి?
వెండితెరపై దశాబ్దాలుగా తిరుగులేని స్టార్‌గా వెలిగిన హీరో ఓటీటీలోకి అడుగుపెట్టడం సాధారణ విషయమేమీ కాదు. సన్నీ డియోల్‌ను డిజిటల్ ఎంట్రీకి ఒప్పించడం వెనుక పెద్ద కసరత్తే జరిగింది.
"మేము ఆయనతో ఓటీటీ 'డెబ్యూ' గురించి మాట్లాడినప్పుడల్లా ఆయన బిగ్గరగా నవ్వేసేవారు. నాకు దాదాపు 60 ఏళ్లకు పైగా వయసొచ్చింది, ఇప్పుడు డెబ్యూ అంటారేంటి అని సరదాగా వ్యాఖ్యానించేవారు" అని రుచికా కపూర్ షేక్ పేర్కొన్నారు.
'బోర్డర్ 2' వంటి భారీ చిత్రాలు థియేటర్లలో సందడి చేస్తున్న సమయంలో ఓటీటీ సినిమా అవసరమా అని సన్నీ డియోల్ తొలుత అనుమానించినా, చివరికి బృందం నమ్మకాన్ని గౌరవించి తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. "మీ నమ్మకానికే నా ఓటు, ఈ సినిమా కోసం నా వంద శాతం కష్టపడతాను" అని సన్నీ డియోల్ తమతో చెప్పినట్లు రుచికా వెల్లడించారు.
కొత్తదనానికే పట్టంగట్టిన ప్రేక్షకులు
సినిమా అంటే కేవలం రొటీన్ మాస్ ఎలిమెంట్లే కాకుండా, సరికొత్త తరహాలో కథను చెబితే ఆదరిస్తారని 'ఇక్కా' నిరూపించింది. జులై 10న నెట్‌ఫ్లిక్స్‌లో ఇక్కా ఓటీటీ రిలీజ్ కాగా అప్పటి నుంచి ఇప్పటివరకు విశేషంగా ఆకట్టుకుంటోంది. స్టార్ హీరోలను వారి రెగ్యులర్ ఇమేజ్‌కు భిన్నంగా చూపిస్తూనే, సస్పెన్స్ డ్రామాతో ముందుకు తీసుకెళ్లడమే ఈ సినిమా విజయానికి కారణమని చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేస్తోంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


