OTT Top 6: ఓటీటీలో ఈ వారం తెలుగులో చూడాల్సిన టాప్ 6 సినిమాలు-దేనికదే స్పెషల్- హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, సోనీ లివ్‌లలో!

OTT Release Movies This Week: నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, సోనీ లివ్ ఓటీటీలోకి ఈ వారం కచ్చితంగా చూడాల్సిన టాప్ 6 సినిమాలు రానున్నాయి. అందులో కీర్తి సురేష్ గ్యాంగ్‌స్టర్ క్రైమ్ థ్రిల్లర్ నుంచి కయాదు లోహర్ రొమాంటిక్ హారర్, విజయ్ సేతుపతి డ్రామా సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి అవేంటో చూద్దాం.

Published on: Oct 26, 2026, 05:32:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Top 6 OTT Releases To Watch This Week: ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు పండగే అని చెప్పాలి. క్రైమ్ థ్రిల్లర్స్, హిస్టారికల్ డ్రామాలు, టైమ్ ట్రావెల్ లవ్ స్టోరీల నుంచి మైండ్ బ్లోయింగ్ హీస్ట్ థ్రిల్లర్స్ వరకు విభిన్న కథాంశాలతో రూపొందిన సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి.

ఓటీటీలో ఈ వారం తెలుగులో చూడాల్సిన టాప్ 6 సినిమాలు-దేనికదే స్పెషల్- హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, సోనీ లివ్‌లలో!
ఓటీటీలో ఈ వారం తెలుగులో చూడాల్సిన టాప్ 6 సినిమాలు-దేనికదే స్పెషల్- హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, సోనీ లివ్‌లలో!

ఈ వారం ఓటీటీ టాప్ 6 సినిమాలు

విజయ్ సేతుపతి, కీర్తి సురేష్, సందీప్ కిషన్, ఆది సాయికుమార్, జయసుధ వంటి స్టార్ యాక్టర్ల సినిమాలు ఈ వారం ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. వీకెండ్‌లో ఏ సినిమా చూడాలో అని ఆలోచిస్తున్నారా? అయితే, అలాంటి వారికోసం ఈ వారం ఓటీటీలోకి తెలుగులో అడుగుపెడుతున్న టాప్ 6 మస్ట్ వాచ్ సినిమాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

1. బత్తా (Baththa) – నెట్‌ఫ్లిక్స్ (అక్టోబర్ 29)

కోలీవుడ్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ డ్రామా 'బత్తా'. బాలాజీ తరణీధరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కథ 1986 నాటి మద్రాస్ (చెన్నై) నేపథ్యంలో సాగుతుంది. ఇందులో 'బచ్చలమ్‌' అనే భయంకరమైన స్థానిక గ్యాంగ్‌స్టర్ పాత్రలో విజయ్ సేతుపతి కనిపించనున్నారు. ఊరంతా భయపడే ఈ గ్యాంగ్‌స్టర్, అనుకోకుండా ఒక ఎనిమిదేళ్ల బడి పిల్లాడి వల్ల పాడుబడిన స్కూల్ టాయిలెట్‌లో లాక్ అయిపోతాడు.

ఆకలి, ఒంటరితనం, బయటకు రాలేని పరిస్థితి ఆయనను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆ సమయంలో ఆ చిన్నారికి, గ్యాంగ్‌స్టర్‌కి మధ్య ఏర్పడే విచిత్రమైన బంధం కథకు ప్రధాన ఆకర్షణగా మారుతుంది. గ్యాంగ్‌స్టర్ల అనవసర రక్తపాతం లేకుండా, ఒక కరడుగట్టిన నేరస్థుడిలోని మానవీయ కోణాన్ని ఆవిష్కరించిన రీతి ఆకట్టుకుంటుంది.

2. అక్క (Akka) – నెట్‌ఫ్లిక్స్ (అక్టోబర్ 30)

నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటించిన లేడీ ఓరియంటెడ్ గ్యాంగ్‌స్టర్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా 'అక్క'. 1980ల నాటి పెర్నూరు అనే ఊహాజనిత దక్షణాది గ్రామం నేపథ్యంలో ఈ కథ రూపుదిద్దుకుంది. పురుషాధిక్యతకు భిన్నంగా పూర్తిగా మహిళల అదుపులోనే ఉండే సామాజిక, రాజకీయ వ్యవస్థ ఇక్కడ కనిపిస్తుంది.

ఈ ఊరిలోని భూగర్భ బంగారు అక్రమ రవాణాను నియంత్రించే 'అక్కలు' అనే శక్తివంతమైన అక్కాచెల్లెళ్ల వ్యవస్థ చుట్టూ కథ తిరుగుతుంది. ఎవరూ ఊహించని ఒక రహస్య సంఘటన వీరి సామ్రాజ్యాన్ని ఎలా కుదిపేసిందో తెలిపే ఉత్కంఠభరిత కథనమిది. కీర్తి సురేష్, రాధికా ఆప్టే నటన ఈ సినిమాకు ప్రధాన బలం.

3. లవ్ ఆల్వేస్ (Love Always) – జియో హాట్‌స్టార్ (అక్టోబర్ 30)

వయోధికులైన దంపతులకు అనుకోకుండా టైమ్ ట్రావెల్ చేసే అవకాశం వస్తే ఎలా ఉంటుందనే అద్భుతమైన పాయింట్‌తో తెరకెక్కిన సినిమా 'లవ్ ఆల్వేస్'. సీనియర్ హీరోయిన్ జయసుధ, సీనియర్ యాక్టర్ జయప్రకాశ్ ముఖ్య పాత్రలు పోషించగా.. వారి చిన్నప్పటి పాత్రలలో యంగ్ బ్యూటీ గౌరి జి కిషన్, రంజాన్ మహమ్మద్ నటించారు.

గతంలోకి వెళ్లిన ఈ వృద్ధ దంపతులు తమ చిన్ననాటి జ్ఞాపకాలను, ప్రేమను పునరావృతం చేసుకోవడమే కాకుండా, తమ జీవితాన్ని మలుపు తిప్పిన నిర్ణయాలను తిరిగి ఎలా అనుభవించారో ఈ చిత్రంలో ఎమోషనల్‌గా చూపించారు. ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ మంచి ఫీల్ గుడ్ మూవీ ఇది.

4. ఎస్సై యుగంధర్ (Sub-Inspector Yugandhar) – నెట్‌ఫ్లిక్స్ (అక్టోబర్ 30)

యంగ్ హీరో ఆది సాయికుమార్ కథానాయకుడిగా నటించిన ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ 'సబ్-ఇన్‌స్పెక్టర్ యుగంధర్'. రాఘవేంద్ర కటారి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మేఘలేఖ హీరోయిన్. పోలీస్ కస్టడీ నుంచి మాయమైన ఒక శవం చాలా విచిత్రమైన, అనుమానాస్పద పరిస్థితుల్లో లభించడంతో కథ ప్రారంభమవుతుంది.

ఈ కేసును ఛేదించే క్రమంలో ఎస్సై యుగంధర్ ఎలాంటి ఆధారాలు సేకరించాడు? అతడికి ఎదురైన ఆ మిస్టరీ మనిషి ఎవరు? అనే అంశాలు సస్పెన్స్‌ను పెంచుతాయి. రాకెందుమౌళి, పవన్ తేజ్ కొణిదెల, యండమూరి వీరేంద్రనాథ్, జయలలిత ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

5. ఇమ్మోర్టల్ (Immortal) – సోనీ లివ్ (అక్టోబర్ 30)

మ్యూజిక్ డైరెక్టర్ కమ్ హీరో జీవీ ప్రకాష్ కుమార్, బ్యూటిఫుల్ హీరోయిన్ కయాదు లోహర్ జంటగా నటించిన రొమాంటిక్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ 'ఇమ్మోర్టల్'. చెన్నైలో ప్రింటింగ్ ప్రెస్ నడుపుకునే మగీ (జీవీ ప్రకాష్) తక్కువ అద్దెకు వస్తోందని సింధు (కయాదు) అనే అమ్మాయి అపార్ట్‌మెంట్‌లో రూమ్‌ను అద్దెకు తీసుకుంటాడు.

అయితే ఆ అపార్ట్‌మెంట్‌లో చేరిన తర్వాతే సింధు దాచిన ఒక భయంకరమైన రహస్యం బయటపడుతుంది. చూస్తుండగానే అపార్ట్‌మెంట్ నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడి మగీ చిక్కుకుపోతాడు. ఈ సంఘటనలకు వేల ఏళ్ల నాటి ఒక గిరిజన దంపతులకు పుట్టిన దైవిక శక్తి ఉన్న చిన్నారి మిస్టరీకి ఉన్న సంబంధమేంటో తేలాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

6. సిగ్మా (Sigma) – నెట్‌ఫ్లిక్స్ (అక్టోబర్ 30)

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం 'సిగ్మా'. యంగ్ హీరో సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించారు. రేడియో హోస్ట్, ట్రెజర్ హంటర్ అయిన గురు (సుందీప్ కిషన్) సొంతవాళ్ల ద్రోహం వల్ల ఉన్నదంతా కోల్పోతాడు.

తనను మోసం చేసిన వ్యవస్థపై ప్రతీకారం తీర్చుకోవడానికి రూ. 500 కోట్లకు సంబంధించిన ఒక పెద్ద రాకెట్‌ను టార్గెట్ చేస్తాడు. అందుకోసం ఒక గ్యాంగ్‌ను ఏర్పాటు చేసి హై-వోల్టేజ్ హీస్ట్ ప్లాన్ చేస్తాడు. యాక్షన్, అడ్వెంచర్, క్రైమ్, కామెడీ కలగలిపిన ఈ సినిమా థ్రిల్ ఇష్టపడే ప్రేక్షకులకు మంచి ఛాయిస్. సంపత్ రాజ్, రాజు సుందరం ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More