Radhika Apte: 40 ఏళ్లలోనే మహిళలకు సెక్స్ కోరికలు ఎక్కువ, లైంగికతపై పిల్లలతో ఓపెన్‌గా ఉండండి.. రాధికా ఆప్టే కామెంట్స్

Radhika Apte On Taboo Ageing And Sexuality At 40: వయసు పెరిగే కొద్దీ మహిళల్లో కోరికలు తగ్గుతాయనే సమాజ ఆలోచనను హీరోయిన్ రాధికా ఆప్టే తీవ్రంగా ఖండించింది. 41 ఏళ్ల వయసులోనే తన శరీరం, శారీరక అవసరాలపై పూర్తి అవగాహన వచ్చిందని లస్ట్ స్టోరీస్ 3 ఓటీటీ సిరీస్ హీరోయిన్ స్పష్టం చేసింది.

Published on: Sep 28, 2026, 11:50:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Radhika Apte About Female Sex Desires At 40: బాలీవుడ్, సౌత్ సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రాధికా ఆప్టే మరోసారి తన బోల్డ్ వ్యాఖ్యలతో చర్చనీయాంశమైంది. విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూనే, సమాజంలో ఉండే మూస ధోరణులపై నిర్భయంగా మాట్లాడటం ఈ భామ నైజం అని తెలిసిందే.

40 ఏళ్లలోనే మహిళలకు సెక్స్ కోరికలు ఎక్కువ, లైంగికతపై పిల్లలతో ఓపెన్‌గా ఉండండి.. రాధికా ఆప్టే కామెంట్స్ (Photo: Instagram)
40 ఏళ్లలోనే మహిళలకు సెక్స్ కోరికలు ఎక్కువ, లైంగికతపై పిల్లలతో ఓపెన్‌గా ఉండండి.. రాధికా ఆప్టే కామెంట్స్ (Photo: Instagram)

లస్ట్ స్టోరీస్ 3 ప్రమోషన్స్

తాజాగా 41వ ఏటకి అడుగుపెట్టిన రాధికా ఆప్టే లస్ట్ స్టోరీస్ 3 ఓటీటీ సిరీస్‌లో నలభై ఏళ్ల మహిళల ఆలోచనలు, కోరికల నేపథ్యంలో నటించి మెప్పించింది. లస్ట్ స్టోరీస్ 3 ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో లైంగికత, నిషేధిత సెక్స్, వయసు పెరగడం, మాతృత్వంపై రాధికా ఆప్టే చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

20, 30ల కంటే 40లోనే అసలైన స్పృహ!

భారతీయ సమాజంలో మహిళలకు వయసు పెరిగే కొద్దీ అందం, కోరికలు తగ్గిపోతాయనే ఒక తప్పుడు నమ్మకం బలంగా ఉండిపోయింది. అయితే దీనిపై రాధికా ఆప్టే పూర్తిగా భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. వయసు మళ్లడం అనేది ఏదో క్షీణతగా భావించే సమాజంలో మనం జీవిస్తున్నామని ఆమె అసహనం వ్యక్తం చేసింది.

"నాకు ఇప్పుడు 41 ఏళ్లు. 20లు, 30ల వయసుతో పోలిస్తే ఇప్పుడు నా శరీరం, నా ఆలోచనలు, నా శారీరక అవసరాలపై నాకు మరింత స్పష్టమైన అవగాహన వచ్చింది" అని రాధిక తెలిపింది.

20లలో తల్లిదండ్రులు వద్దన్న పనులు చేయడంలోనే సమయం సరిపోతుందని, 30లలోకి వచ్చేసరికి ఆ మాటల్లో నిజం ఉందేమోనని భయపడతామని ఆమె చెప్పుకొచ్చింది. కానీ, 40 ఏళ్ల వయసులోనే మనిషి తన సొంత అస్తిత్వాన్ని, స్థానాన్ని వెతుక్కుంటాడని రాధికా ఆప్టే తెలిపింది.

మాతృత్వం తెచ్చిన మార్పు.. సమాజం మారాలి!

వయసుతో పాటు మాతృత్వం కూడా మహిళల్లో శరీరక, మానసిక మార్పులను తీసుకొస్తుందని రాధిక అభిప్రాయపడింది. "ఈ 40 ఏళ్ల వయసే కోరికలు, అవగాహన, శారీరక అవసరాలు ఎక్కువగా ఉండే సమయం. ప్రస్తుతం నా జీవితంలో అత్యంత ఆరోగ్యంగా, ఉత్సాహంగా భావిస్తున్నాను. ప్రత్యేకించి మాతృత్వం పొందిన తర్వాత శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. అది మన అవసరాలను మనం అర్థం చేసుకోవడానికి తోడ్పడుతుంది" అని రాధిక వివరించింది.

చాలామంది ఈ విషయాన్ని గ్రహించలేక ఇతరులను నియంత్రించేందుకు ప్రయత్నిస్తూ జీవితంలో ఎంతో కోల్పోతున్నారని ఆమె విమర్శించింది. మన దేశంలో లైంగిక కోరికల గురించి మాట్లాడటమే ఒక పెద్ద నేరంగా, నిషేధ అంశంగా చూసే మూస పద్ధతిపై కూడా రాధిక తీవ్రంగా స్పందించింది.

"సెక్స్, కోరికల సంగతి పక్కన పెడితే అసలు ప్రాథమిక సమానత్వం, స్వేచ్ఛగా ఆలోచించి మాట్లాడే హక్కు నుంచే ఈ వివక్ష మొదలవుతుంది. చిన్నప్పుడు సెక్స్ అంటే ఏదో అసహ్యమైన పని అనే భావనతోనే నేను పెరిగాను. అది చాలా బాధాకరం" అని రాధికా ఆప్టే ఆవేదన వ్యక్తం చేసింది.

నా కూతురికి ఆ భయం రాకూడదు!

పురుషులు, మహిళల కోరికలను వేర్వేరుగా చూడాల్సిన అవసరం లేదని, అదొక సహజమైన ప్రక్రియ అని రాధిక తెలిపింది. తల్లిగా మారిన తర్వాత తన ఆలోచనా విధానంలో మార్పు వచ్చిందని, తన కుమార్తె పెంపకంలో లైంగిక అవగాహనపై ఎలాంటి భయాలు, అపరాధ భావనలు లేకుండా చూసుకుంటానని రాధిక స్పష్టం చేసింది.

చిన్నతనంలో లైంగిక ఆసక్తిని గమనించిన తండ్రి గద్దించడంతో ఒక రచయిత జీవితాంతం అపరాధ భావనతో రగిలిపోయిన ఉదంతాన్ని ఆమె గుర్తు చేసుకుంది. "నా కూతురు తన శారీరక మార్పులను, కోరికలను అర్థం చేసుకునే క్రమంలో నేను ఎప్పటికీ ఆమెను భయపెట్టను. లైంగికతపై ఓపెన్ హార్ట్‌తో చర్చించకపోవడం వల్ల మహిళలే కాకుండా పురుషులు కూడా తమ అంతరంగాన్ని అణచివేసుకుని జీవిస్తున్నారు" అని రాధికా ఆప్టే తేల్చి చెప్పేసింది.

ఆఫ్ స్క్రీన్‌లో కూడా

ఆన్-స్క్రీన్ మీద మాత్రమే కాకుండా ఆఫ్-స్క్రీన్ లోనూ నటిగా తనలోని పరిణితిని చాటుకుంటూ రాధిక ఆప్టే చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సెక్స్‌పై అవగాహన చాలా ముఖ్యమనే చర్చకు మరింత బలాన్ని చేకూర్చాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More