Radhika Apte Nude: ఆ సినిమాల్లో అందుకే న్యూడ్‌గా నటించా.. అలా అని బ్రా వేసుకొని ఫైట్ చెయ్, ముద్దు పెట్టుకో అంటారా: రాధిక
Radhika Apte Nude: రాధికా ఆప్టే సినిమాల్లో బోల్డ్ సీన్లు చేయడమే కాదు.. బయట కూడా అంతే బోల్డ్ గా మాట్లాడుతారన్న పేరుంది. తాజాగా తాను న్యూడ్ సీన్లు చేయాల్సి రావడం, దానివల్ల ఆ తర్వాత ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి మాట్లాడారు.
Radhika Apte Nude: సినిమాల్లో కథ డిమాండ్ చేయకపోయినా బోల్డ్, న్యూడ్ సీన్స్ చేయాలంటూ ఒత్తిడి తెచ్చే తీరుపై బాలీవుడ్ భామ రాధికా ఆప్టే సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కొన్ని సినిమాల్లో కథ కోసం న్యూడ్‌గా నటించినందుకే, ఇండస్ట్రీలోని కొంతమంది తనను 'ఈమె ఎలాంటి సీన్ అయినా చేసేస్తుందిలే' అని చులకనగా చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ యాక్షన్ సీన్ షూటింగ్‌లో షర్ట్ బటన్స్ తీసేసి కేవలం ఇన్నర్‌వేర్‌తోనే ఫైట్ చేయమన్నారంటూ షాకింగ్ నిజాలను బయటపెట్టారు.

'ఈమె ఎలాగైనా చేసేస్తుందిలే' అనే మైండ్‌సెట్
తాజాగా జూమ్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన రాధికా ఆప్టే.. తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన దారుణమైన అనుభవాలను పంచుకున్నారు. ప్రారంభంలో కథ అవసరం మేరకు నాలుగు ఐదు సినిమాల్లో పూర్తి స్థాయిలో న్యూడ్‌గా నటించాల్సి వచ్చిందని చెప్పారు. దాంతో ఇండస్ట్రీలో చాలామంది 'ఈమె ఎలాగైనా నటిస్తుంది కదా' (Yeh toh karlegi na) అనే భావనకు వచ్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
"ఒకసారి న్యూడ్ సీన్ చేశానంటే ప్రతి సినిమాలోనూ కారణం లేకుండా ముద్దు సీన్లు, ఇంటిమేట్ సీన్లు చేయాలా? సీన్‌లో కిస్ ఎందుకు పెట్టాలి అని అడిగితే 'ప్లీజ్ కొద్దిగా అడ్జస్ట్ అయి 15 సెకన్ల పాటు ముద్దు పెట్టొచ్చు కదా' అని సమాధానం ఇచ్చేవాళ్లు. ఇలాంటి అనవసరపు డిమాండ్లు చూసి నేను షాక్ అయ్యాను" అని రాధికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇన్నర్‌వేర్‌తోనే ఫైట్ సీన్ చేయమన్నారు
యాక్షన్ సీన్ షూటింగ్ టైమ్‌లో తనకు ఎదురైన ఒక చేదు సంఘటనను కూడా రాధికా గుర్తుచేసుకున్నారు. "ఒక సెట్‌లో యాక్షన్ సీన్ తీస్తున్నప్పుడు, 'షర్ట్ బటన్స్ విప్పేసి నటిస్తే ఎలా ఉంటుంది?' అని అడిగారు. అది ఫైట్ సీన్ కదా, బేసిక్ ఫిజిక్స్ ప్రకారం షర్ట్ ఊడిపోతుంది అని నేను చెప్పాను. దానికి వాళ్లు 'అయితే కేవలం బ్రా, అండర్‌వేర్‌తోనే ఈ యాక్షన్ సీన్ చేసేయ్' అని అడిగారు. నాతో అసలు ఏం చేయించాలనుకుంటున్నారు అని నేను షాక్ తిన్నాను" అని బయటపెట్టారు.
సినిమా స్క్రిప్ట్‌కు సంబంధం లేని గ్లామర్, అతిగా ఎక్స్‌పోజింగ్ సీన్లను తిరస్కరించడం ఎంత ముఖ్యమో ఈ సంఘటనలు తనకు నేర్పాయని ఆమె చెప్పారు.
'పార్చ్‌డ్' లీక్డ్ సీన్ వివాదంపై తెగేసి చెప్పిన రాధిక
2016లో విడుదలైన 'పార్చ్‌డ్' (Parched) సినిమాలో రాధికా ఆప్టే నటించిన ఒక న్యూడ్ సీన్ సోషల్ మీడియాలో లీకై తీవ్ర దుమారం రేపింది. దానిపై అప్పట్లోనే స్పందించిన రాధిక.. అలాంటి లీకుల గురించి తాను ఎంతమాత్రం భయపడలేదని స్పష్టం చేశారు.
"నా క్యారెక్టర్ డిమాండ్ బట్టే నేను ఆ సీన్ చేశాను. ఆ సినిమా కథ కేవలం ఆ ఒక్క సీన్ మాత్రమే కాదు. సినిమా అంతకంటే చాలా పెద్ద విషయాలను చెబుతుంది. విదేశాల్లో విడుదలైన ఆ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో కూడా అందుబాటులో ఉంది. కేవలం ఆ ఒక్క లీక్డ్ సీన్ గురించే మీడియా అంతగా ఎందుకు మాట్లాడుతుందో నాకు ఇప్పటికీ అర్థం కాదు" అని ఆమె కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.
సౌత్ నుంచి హిందీ దాకా.. డిఫరెంట్ రోల్స్‌తో సంచలనం
రామ్ గోపాల్ వర్మ 'రక్తచరిత్ర' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన రాధికా ఆప్టే.. బాలకృష్ణతో 'లెజెండ్', సూపర్ స్టార్ రజనీకాంత్‌తో 'కబాలి' వంటి భారీ చిత్రాల్లో నటించారు. టాలీవుడ్, కోలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తన నటనతో ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్నారు.
'ప్యాడ్‌మాన్', 'అంధాధున్', 'ఫోబియా', 'సేక్రెడ్ గేమ్స్' వంటి వైవిధ్యమైన ప్రాజెక్ట్‌లతో బాలీవుడ్‌లో తిరుగులేని నటిగా ఎదిగిన రాధికా ఆప్టే.. ప్రస్తుతం ‘లస్ట్ స్టోరీస్ 3’ (Lust Stories 3) ఆంథాలజీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. గ్లామర్‌కు మాత్రమే పరిమితం కాకుండా కంటెంట్ ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తన బోల్డ్ వాయిస్‌తో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


