Radhika Apte: కీర్తి సురేష్ ఓటీటీ సిరీస్ రిలీజ్-ఆ నరమేధం చూస్తూ పాప్‌కార్న్ ఎలా తింటారు- హీరోయిన్ రాధికా ఆప్టే కామెంట్స్

Radhika Apte On Violence Trend: సినిమాల్లో విపరీతమైన హింసను చూపించే నేటి ట్రెండ్‌పై హీరోయిన్ రాధికా ఆప్టే షాకింగ్ కామెంట్స్ చేశారు. బాక్సాఫీస్ వద్ద మాస్ యాక్షన్ చిత్రాలు వందల కోట్లు కొల్లగొడుతున్నప్పటికీ, అలాంటి సినిమాల్లో తాను నటించనని, అసలు చూడనని తెగేసి చెప్పారు. ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Published on: Oct 25, 2026, 10:57:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Radhika Apte On Violence Trend Over Akka OTT Release: బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బోల్డ్ హీరోయిన్ రాధికా ఆప్టే. నందమూరి బాలకృష్ణ సరసన 'లెజెండ్', 'లయన్' చిత్రాలతో పాటు రామ్ గోపాల్ వర్మ 'రక్తచరిత్ర'లో మెరిసిన ఈ భామ, రొటీన్ ఫార్ములా సినిమాలకు ఎప్పుడూ దూరంగా ఉంటారు.

కీర్తి సురేష్ ఓటీటీ సిరీస్ రిలీజ్-ఆ నరమేధం చూస్తూ పాప్‌కార్న్ ఎలా తింటారు- హీరోయిన్ రాధికా ఆప్టే కామెంట్స్
కీర్తి సురేష్ ఓటీటీ సిరీస్ రిలీజ్-ఆ నరమేధం చూస్తూ పాప్‌కార్న్ ఎలా తింటారు- హీరోయిన్ రాధికా ఆప్టే కామెంట్స్

అక్క ఓటీటీ స్ట్రీమింగ్

కెరీర్ ప్రారంభం నుంచి భిన్నమైన కథాంశాలను ఎంచుకుంటున్న ఈ హీరోయిన్ తాజాగా వెండితెరపై పెరుగుతున్న హింసపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాధికా ఆప్టే నటించిన నయా వెబ్ సిరీస్ అక్క ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఈ ఓటీటీ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన రాధిక ఆప్టే నేటి సినిమా ట్రెండ్‌ను తీవ్రంగా తప్పుపట్టారు.

ఆ నరమేధం చూస్తూ పాప్‌కార్న్ ఎలా తింటారు?

"ప్రస్తుతం థియేటర్లలో ఏది వర్కవుట్ అవుతోందో చూస్తే అంతా విపరీతమైన హింసే కనిపిస్తోంది. కానీ, అలాంటి చిత్రాలకు నేను పూర్తిగా వ్యతిరేకం. స్క్రీన్‌పై 50 మంది మనుషులను దారుణంగా కొడుతుంటే ఆ నరమేధం చూస్తూ హాయిగా పాప్‌కార్న్ ఎలా తింటారో నాకు అర్థం కాదు" అని రాధికా ఆప్టే చెప్పారు.

"గత సినిమాలో విలన్ తలను వాష్‌బేసిన్‌పై బాదారు కదా, ఈసారి మరో రాయిపై బాదుదాం అని కొత్తగా ప్లాన్ చేయడమే క్రియేటివిటీ అయిపోయింది. ఇదంతా నాకు చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. అందుకే అలాంటి చిత్రాల్లో నేను భాగం కాకూడదని నిర్ణయించుకున్నాను" అని రాధికా ఆప్టే స్పష్టం చేశారు.

బాక్సాఫీస్ ట్రెండ్.. రాధికా సిద్ధాంతం

ప్రస్తుతం భారతీయ చిత్రసీమలో 'కేజీఎఫ్', 'యానిమల్', 'సలార్' వంటి హై-వోల్టేజ్ మాస్ యాక్షన్ డ్రామాలు భారీ వసూళ్లు సాధిస్తున్నాయి. ప్రేక్షకులు కూడా ఈ తరహా వయోలెన్స్‌ను ఆదరిస్తున్నారు. అయితే బాక్సాఫీస్ రికార్డులు తెచ్చిపెడుతున్నా సరే, తన మనస్సాక్షికి నచ్చని పాత్రలను చేయనని రాధిక తేల్చిచెప్పారు.

దాదాపు రెండు పదుల సినీ ప్రయాణంలో ఒకే తరహా పాత్రలకే పరిమితం కాకుండా వైవిధ్యం ప్రదర్శించిన రాధికా ఆప్టే కేవలం ట్రెండ్ కోసం తన విధానాలను మార్చుకోనని వెల్లడించారు. అయితే, 2024లో రాధిక ఒక పాపకు జన్మనిచ్చారు.

మారిన ప్రాధాన్యతలు.. కుమార్తెతో సమయం

తల్లిగా మారిన తర్వాత తన జీవితంలో ప్రాధాన్యతలు పూర్తిగా మారిపోయాయని రాధిక ఆప్టే పేర్కొన్నారు. రోజుకు 16 గంటలు షూటింగ్‌లు చేయడం తన వల్ల కాదని, గరిష్టంగా 12 గంటల పనివేళలు మాత్రమే కోరుకుంటున్నానని చెప్పారు.

"నాకు నటన మాత్రమే జీవితం కాదు, అదొక భాగం మాత్రమే. నా ప్రాధాన్యతలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. పాప చాలా చిన్నది కావడం వల్ల వీలైనంత ఎక్కువ సమయం కూతురితోనే గడపాలనుకుంటున్నాను. నా పని కంటే నా కుటుంబమే నాకు ముఖ్యం" అని రాధిక ఆప్టే వ్యాఖ్యానించారు.

కీర్తీ సురేష్‌తో కలసి 'అక్క'

రాధికా ఆప్టే ప్రధాన పాత్రలో నటించిన పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ డ్రామా సిరీస్ 'అక్క' అక్టోబర్ 30న నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ రిలీజ్ అవనుంది. 1980ల నేపథ్యంతో ఇద్దరు గ్యాంగ్‌స్టర్ల మధ్య సాగే ఈ క్రైమ్ డ్రామాలో సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తీ సురేష్ మరో ప్రధాన పాత్ర పోషించారు.

వైఆర్‌ఎఫ్ ఎంటర్‌టైన్‌మెంట్, నెట్‌ఫ్లిక్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ ఓటీటీ సిరీస్‌లో తన్వీ అజ్మీ, మహేష్ మంజ్రేకర్‌ల వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More