Varanasi Business: రిలీజ్‌కు ముందే వారణాసి బడ్జెట్లో 850 కోట్లు రికవరీ- ఓటీటీ, శాటిలైట్, ఆడియో రైట్స్ వివరాలు ఇవే!
Varanasi OTT Rights And Non Theatrical Business Details: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్‌స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్లో వస్తున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ 'వారణాసి'. ఇంకా షూటింగ్ పూర్తికాకముందే ఈ సినిమా నాన్-థియేట్రికల్ బిజినెస్ రికార్డు స్థాయిలో దాదాపు రూ.850 కోట్లకు చేరుకున్నట్లు టాక్ నడుస్తోంది.
Varanasi OTT Rights And Non Theatrical Business Details: తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ వేదికపైకి తీసుకెళ్లిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కలసి చేస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి'. సుమారు రూ. 1000 కోట్లకుపైగా బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

టైమ్ ట్రావెల్, రామాయణ బ్యాక్‌డ్రాప్
టైమ్ ట్రావెల్, రామాయణ నేపథ్యంతో రూపొందుతున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ రిలీజ్‌కు ముందే సినీ ఇండస్ట్రీలో సంచలనాలు సృష్టిస్తోంది. భారతీయ చలనచిత్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అత్యధిక బడ్జెట్‌తో నిర్మిస్తున్న వారణాసి ఓటీటీ వ్యాపారంలో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుడుతోంది.
వారణాసి ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్
సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం వారణాసి ఓటీటీ స్ట్రీమింగ్ హక్కుల కోసం ప్రముఖ డిజిటల్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ.650 కోట్లు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. కేవలం ఓటీటీ హక్కుల రూపంలోనే సినిమా నిర్మాణ వ్యయంలో దాదాపు 80 శాతానికి పైగా వారణాసి సినిమాకు వెనక్కి రావడం విశేషం.
దీనికితోడు టీ-సిరీస్ సంస్థ ఆడియో హక్కులను రూ.50 కోట్లకు దక్కించుకోగా, శాటిలైట్ హక్కులు కూడా రూ.150 కోట్ల వరకు పలికే అవకాశం ఉంది. ఈ లెక్కన నాన్-థియేట్రికల్ వ్యాపారం రూపంలోనే సుమారు రూ.850 కోట్లు ఇప్పటికే ఖరారైనట్లు ఇండస్ట్రీ టాక్.
థియేట్రికల్ బిజినెస్.. ఓవర్సీస్లో భారీ ప్లాన్
వారణాసి సినిమా లాభాల్లోకి రావాలంటే థియేటర్ల ద్వారా రూ.450 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంటుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.800 కోట్ల నుంచి రూ.900 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధిస్తే సరిపోతుంది. రాజమౌళి గత చిత్రాలైన 'బాహుబలి 2', 'ఆర్ఆర్ఆర్' సాధించిన వసూళ్లతో పోలిస్తే, తొలి నాలుగైదు రోజుల్లోనే ఈ మార్కును దాటడం ఏమాత్రం కష్టం కాదని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇక అంతర్జాతీయ స్థాయిలో వారణాసి సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు గట్టి ప్రణాళికలు రచిస్తున్నారు. అమెరికా, కెనడా ప్రాంతాల్లో ప్రముఖ లైట్‌స్టార్మ్ సంస్థ ద్వారా ఒక పెద్ద పంపిణీ సంస్థతో కలసి చిత్రాన్ని ప్రదర్శించబోతున్నారు. హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ కావడంతో గ్లోబల్ ఆడియన్స్‌ను ఈ చిత్రం విశేషంగా ఆకట్టుకుంటుందని అంచనా వేస్తున్నారు.
నెట్‌ఫ్లిక్స్ డీల్ ఆలస్యం వెనుక కారణాలు
ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా తన అంతర్గత నిర్వహణలో కొన్ని మార్పులు చేపడుతోంది. ఉద్యోగుల కోత, ఉన్నతాధికారుల మార్పుల వల్ల కొత్త ప్రాజెక్ట్‌ల కొనుగోలు ప్రక్రియలో కొంత ఆలస్యం జరుగుతోంది.
'వారణాసి' నిర్మాతలు ఆరంభంలోనే రూ.500 కోట్లకు పైగా ఓటీటీ ఆఫర్ ఆశించినప్పటికీ, ప్రస్తుతం చర్చలు చివరి దశకు చేరి ఒప్పందం ఖరారు కావాల్సి ఉంది. ఈ అంతర్గత పునర్వ్యవస్థీకరణ కారణంగా ఓటీటీ అధికారిక ప్రకటనలో కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
షూటింగ్ అప్డేట్.. ఏప్రిల్ 2027న గ్రాండ్ రిలీజ్
ఈ భారీ ప్రాజెక్ట్‌లో మహేశ్ బాబుకు జోడీగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తుండగా, పవర్ఫుల్ విలన్ పాత్రలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపిస్తున్నారు. మహేశ్ బాబు తన భాగానికి సంబంధించిన చిత్రీకరణను ఇప్పటికే పూర్తి చేశారు.
ప్రస్తుతం మిగిలిన కీలక సన్నివేశాలను రాజమౌళి అత్యంత శ్రద్ధతో చిత్రీకరిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి, ఈ దృశ్యకావ్యాన్ని ఏప్రిల్ 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


