Priyanka Chopra Sridevi: శ్రీదేవి బయోపిక్ బుక్ కవర్ పేజ్ విడుదల చేసిన ప్రియాంక చోప్రా.. బ్రహ్మానందం కామెంట్స్ ఏంటంటే?

Priyanka Chopra Released Sridevi Biography Book Cover Page: భారతీయ సినీ రంగాన్ని దశాబ్దాల పాటు ఏలిన దివంగత నటి శ్రీదేవి జీవిత కథతో 'ఎంప్రెస్' పేరుతో బయోగ్రఫీ బుక్ రానుంది. శ్రీదేవి జయంతి సందర్భంగా ఈ పుస్తకం కవర్ పేజీని వారణాసి హీరోయిన్ ప్రియాంక చోప్రా సోషల్ మీడియా వేదికగా ఆవిష్కరించారు.

Published on: Aug 14, 2026, 14:03:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Priyanka Chopra Released Sridevi Biography Book Cover Page: భారతీయ చిత్రసీమలో చెరగని ముద్ర వేసిన స్టార్ హీరోయిన్, దివంగత నటి శ్రీదేవి ఐదు దశాబ్దాల సినీ ప్రయాణం, ఆమె నటనా వైభవంపై రూపుదిద్దుకుంటున్న జీవిత చరిత్ర 'ఎంప్రెస్: ది డెఫినిటివ్ బయోగ్రఫీ ఆఫ్ శ్రీదేవి' (Empress: The Definitive Biography of Sridevi) పుస్తక కవర్ పేజీని గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఆవిష్కరించారు.

శ్రీదేవి బయోపిక్ బుక్ కవర్ పేజ్ విడుదల చేసిన ప్రియాంక చోప్రా.. బ్రహ్మానందం కామెంట్స్ ఏంటంటే?
శ్రీదేవి బయోపిక్ బుక్ కవర్ పేజ్ విడుదల చేసిన ప్రియాంక చోప్రా.. బ్రహ్మానందం కామెంట్స్ ఏంటంటే?

ఎంప్రెస్: ది డెఫినిటివ్ బయోగ్రఫీ ఆఫ్ శ్రీదేవి పుస్తకం

శ్రీదేవి జయంతిని పురస్కరించుకుని ఈ ప్రత్యేక కవర్ పేజీని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. "సాటిలేని ఏకైక నటి శ్రీదేవి. మీ లోటు ఎప్పటికీ తీర్చలేనిది. శ్రీదేవికి స్వర్గీయ జయంతి శుభాకాంక్షలు. 'ఎంప్రెస్' పుస్తకం త్వరలోనే రాబోతోంది" అని ప్రియాంక చోప్రా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా భావోద్వేగంగా పోస్ట్ చేశారు.

ఐదు భాషలు.. 300కు పైగా చిత్రాలు..

ప్రముఖ రచయిత ధీరజ్ కుమార్ రాసిన ఈ పుస్తకాన్ని 'వెస్ట్‌లాండ్ బుక్స్' ప్రచురిస్తోంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన శ్రీదేవి, తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో 300కి పైగా సినిమాల్లో నటించి, పురుషాధిక్యత కలిగిన సినీ రంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన హీరోయిన్‌గా ఎదిగిన తీరును ఈ పుస్తకంలో వివరంగా పొందుపరిచారు.

తెరపై ఆమె చూపించిన అద్భుత నటనతో పాటు తెర వెనుక ఆమె జీవితం, ఇండియన్ సినిమా పరిణామ క్రమాన్ని ఈ బయోగ్రఫీ ఆవిష్కరిస్తుంది. ఈ పుస్తకానికి భారతీయ చిత్రసీమకు చెందిన ఏడుగురు దిగ్గజాలు పీఠికలు (Forewords) అందించడం విశేషం. బిగ్ బి అమితాబ్ బచ్చన్, ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ ప్రత్యేక జ్ఞాపకాలతో పాటు, శ్రీదేవికి సంబంధించిన 150కి పైగా అరుదైన ఫోటోలను ఇందులో ప్రచురిస్తున్నారు.

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు.. అగ్ర నటుల నివాళులు

శ్రీదేవి వ్యక్తిగతంగా తనకు ఎంతో సుపరిచితురాలని రచయిత ధీరజ్ కుమార్ తెలిపారు. "ఐదు భాషలు, ఐదు దశాబ్దాలు, 300కి పైగా చిత్రాల్లో శ్రీదేవి ప్రయాణాన్ని రికార్డు చేయడం నాకు దక్కిన గౌరవం. ప్రపంచ సినిమాలో అత్యుత్తమ నటీమణులలో ఆమె ఒకరు. తన నటనతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారు," అని ధీరజ్ కుమార్ పేర్కొన్నారు.

ఈ పుస్తక రూపకల్పనలో సహకరించిన ఆమె భర్త, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ సహా దక్షిణాది, ఉత్తరాది సినీ ప్రముఖులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ పుస్తకంలో శ్రీదేవి గురించి అమితాబ్ బచ్చన్ స్పందిస్తూ.. ఆమెను "అపారమైన ప్రతిభకు పరాకాష్ఠ" అని కొనియాడారు.

ఆమె ముఖకవళికలు, కామిక్ టైమింగ్, డ్యాన్స్ స్కిల్స్ మరెవరికీ సాధ్యం కావని శబానా అజ్మీ గుర్తుచేసుకున్నారు. టాలీవుడ్ హాస్యబ్రహ్మ బ్రహ్మానందం శ్రీదేవిని "అత్యంత అరుదైన నటి.. భూమికి దక్కిన వరం" అని ప్రశంసించగా, "తన సినిమాలకు ఆమే అసలైన హీరో, నడిపించే శక్తి" అని రచయిత-దర్శకుడు అనీస్ బాజ్మీ అభివర్ణించారు.

దక్షిణాదిలో పుట్టి.. దేశాన్నే ఏలిన నటి

బాలనటిగా ప్రస్థానం ప్రారంభించిన శ్రీదేవి తెలుగులో 'పదహారేళ్ల వయసు', 'జగదేకవీరుడు అతిలోకసుందరి', 'క్షణ క్షణం', 'దేవత' వంటి ఎన్నో చిరస్మరణీయమైన చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత హిందీలో 'హిమ్మత్‌వాలా', 'మిస్టర్ ఇండియా', 'చాందిని', 'చాల్‌బాజ్', 'లమ్హే', 'ఖుదా గవా', 'జుదాయి' చిత్రాలతో బాలీవుడ్ ఏకైక లేడీ సూపర్‌స్టార్‌గా మారారు.

సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ 'ఇంగ్లీష్ వింగ్లీష్', 'మామ్' చిత్రాలతో తన నటనా విశ్వరూపాన్ని చూపించారు. 2018లో 54 ఏళ్ల వయసులో శ్రీదేవి అకస్మాత్తుగా కన్నుమూయడం భారతీయ సినీ రంగానికి తీరని లోటుగా మిగిలిపోయింది.

2026 చివరి నాటికి విడుదల

ప్రస్తుతం రూపుదిద్దుకుంటున్న 'ఎంప్రెస్: ది డెఫినిటివ్ బయోగ్రఫీ ఆఫ్ శ్రీదేవి' పుస్తకాన్ని 2026 చివరి నాటికి పాన్-ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి ప్రచురణకర్తలు సిద్ధం చేస్తున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More