Janhvi Kapoor: శ్రీదేవి ఆస్తి కోసం కోర్టుకెక్కిన జాన్వీ కపూర్, బోనీ కపూర్.. మద్రాస్ హైకోర్టులో పిటిషన్
Janhvi Kapoor:
దివంగత నటి శ్రీదేవికి చెందిన చెన్నై ప్రాపర్టీని కాపాడుకునేందుకు ప్రొడ్యూసర్ బోనీ కపూర్, అతని కూతుళ్లు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈస్ట్ కోస్ట్ రోడ్ దగ్గర ఉన్న శ్రీదేవి ఆస్తికి సంబంధించి దాఖలైన ఒక పిటిషన్‌ను కొట్టివేయడానికి చెంగల్పట్టు అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి నిరాకరించారు. ఈ ఆర్డర్‌కు వ్యతిరేకంగా ఈ ముగ్గురూ ఇప్పుడు లీగల్ రూట్ తీసుకున్నారని 'లైవ్ లా' రిపోర్ట్ తెలిపింది.

తదుపరి విచారణ ఎప్పుడంటే?
సోమవారం (మార్చి 16న) జాన్వీ కపూర్, బోనీ కపూర్ వేసిన ఈ పిటిషన్ జస్టిస్ టీవీ తమిళసెల్వి ముందుకు వచ్చినట్లు ఆ రిపోర్ట్ పేర్కొంది. కపూర్ ఫ్యామిలీ జాయింట్‌గా వేసిన ఈ సివిల్ రివిజన్ పిటిషన్‌ను మార్చి 26, 2026న విచారించాలని జడ్జి నిర్ణయించారు. అప్పటివరకు డిస్ట్రిక్ట్ కోర్టులో జరిగే తదుపరి ప్రొసీడింగ్స్ అన్నింటిపైనా స్టే విధించారు.
అసలు వాళ్ల వాదన ఏంటి?
చంద్రభాను అనే మహిళ, ఆమె ఇద్దరు పిల్లలు (ఎం.సి. శివగామి, ఎం.సి. నటరాజన్) ఈ చెన్నై ప్రాపర్టీలో తమకు వాటా ఉందంటూ కోర్టులో కేసు వేశారు. శ్రీదేవి, ఆమె సోదరి కలిసి ఈ 4.7 ఎకరాల ఆస్తిని దక్కించుకున్న 4 సేల్ డీడ్స్ చెల్లవని ప్రకటించాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. ఆ సేల్ డీడ్స్ అన్నీ ఫేక్ అని, ఆ ప్రాపర్టీ తమ తాతకు చెందినది కాబట్టి అందులో తమకు కూడా వాటా ఉందని వాళ్లు క్లెయిమ్ చేస్తున్నారు.
బోనీ కపూర్ వేసిన కౌంటర్ ఏంటి?
ఈ ముగ్గురూ కలిసి చేస్తున్న ఈ పనిని ఒక "ఫ్రాడ్" (మోసం) గా అభివర్ణిస్తూ గతేడాది బోనీ కపూర్ ఒక లీగల్ పిటిషన్ ఫైల్ చేశారని వార్తలు వచ్చాయి. సీపీసీలోని ఆర్డర్ 7 రూల్ 11 (ఎ), (బి), సెక్షన్ 151 కింద అతడు అప్లికేషన్ వేశాడు. వాళ్లు చేస్తున్న క్లెయిమ్ చట్టపరంగా నిలబడదని వాదించాడు. మొదటి పెళ్లి ఇంకా ఫోర్స్‌లో ఉన్నప్పుడే చంద్రభాను చేసుకున్న పెళ్లి చట్టం దృష్టిలో చెల్లదని, ఇది బహుభార్యత్వం కిందకు వస్తుందని బోనీ వాదించాడు. చట్టపరంగా అత్యంత కీలకమైన ఈ నిజాన్ని దాచిపెట్టడం అంటే కోర్టును ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించడమే అని బోనీ తన పిటిషన్‌లో చెప్పాడు.
1988 నాటి డాక్యుమెంట్లను ఛాలెంజ్ చేస్తూ ఏకంగా 37 ఏళ్ల తర్వాత ఇప్పుడు కేసు వేయడం ఏంటని అతడు ప్రశ్నించాడు. ఈ కేసు కాలదోషం పట్టిందని వాదించాడు. అయితే ఇంకా విభజించని స్థిరాస్తికి సంబంధించిన పార్టిషన్ కేసు వేయడానికి ఎలాంటి టైమ్ లిమిట్ ఉండదని ఆ మహిళ తరపు లాయర్లు వాదించారు.
బోనీ, శ్రీదేవి పెళ్లి
బోనీ కపూర్ జూన్ 1996లో శ్రీదేవిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వీళ్లిద్దరూ ఇప్పుడు బాలీవుడ్‌లో హీరోయిన్లుగా రాణిస్తున్నారు. ఫిబ్రవరి 24, 2018న దుబాయ్‌లో శ్రీదేవి చాలా విషాదకరంగా కన్నుమూశారు. ఆమె అకాల మరణం యావత్ దేశాన్ని షాక్‌కు గురిచేసింది, ఇండియన్ సినిమాలో ఎప్పటికీ పూడ్చలేని లోటును మిగిల్చింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


