Kiara Advani Bikini: మనసులో ఉన్నదే చెప్పాను.. నేను మారను.. శ్రీదేవి విషయంలోనూ అలాగే..: కియారా బికినీ ట్వీట్‌పై ఆర్జీవీ

Kiara Advani Bikini: కియారా అద్వానీ బికినీ సీన్ పై తాను చేసిన వివాదాస్పద ట్వీట్ ను రామ్ గోపాల్ వర్మ సమర్థించుకున్నాడు. మనసులో ఉన్నదే చెప్పానని అనడం గమనార్హం. మరి ఆ ట్వీట్ ఎందుకు డిలీట్ చేశారని అడిగితే మాత్రం అందులో అసలు ఏం రాశానో గుర్తు లేదని అన్నాడు.

Mar 6, 2026, 15:09:54 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) మరోసారి వార్తల్లో నిలిచాడు. 'వార్ 2' టీజర్‌లో కియారా అద్వానీ బికినీ ఫోటోలపై అతడు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. నెటిజన్ల నుండి ఎదురైన భారీ వ్యతిరేకత నేపథ్యంలో.. ఆ ట్వీట్‌ను డిలీట్ చేసిన వర్మ.. తాజాగా తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చాడు.

Kiara Advani Bikini: మనసులో ఉన్నదే చెప్పాను.. నేను మారను.. శ్రీదేవి విషయంలోనూ అలాగే..: కియారా బికినీ ట్వీట్‌పై ఆర్జీవీ
Kiara Advani Bikini: మనసులో ఉన్నదే చెప్పాను.. నేను మారను.. శ్రీదేవి విషయంలోనూ అలాగే..: కియారా బికినీ ట్వీట్‌పై ఆర్జీవీ

నా మనసులో ఉన్నదే చెప్పాను: వర్మ సమర్థన

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో విక్కీ లల్వానీతో మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ.. తన వ్యాఖ్యలను సమర్థించుకున్నాడు. "నేను ఆ ట్వీట్‌లో ఖచ్చితంగా ఏం రాశానో నాకు గుర్తులేదు. ఎందుకంటే నేను చాలా ట్వీట్లు పెడుతుంటాను. కానీ నా పాయింట్ ఒక్కటే.. ఒక అందమైన అమ్మాయిని బికినీలో ట్రైలర్‌లో చూపించినప్పుడు, అది ప్రేక్షకుల్లో ఏదో ఒక భావాన్ని ప్రేరేపించడానికే కదా?" అని అతడు ప్రశ్నించాడు.

అవి ప్రశంసలు: ఆర్జీవీ

అందమైన మహిళల గురించి తాను చేసే వ్యాఖ్యలను ‘పరోక్ష ప్రశంసలు’గా భావిస్తానని వర్మ పేర్కొన్నాడు. "రంగీలా రోజుల నుండి నేను అందమైన మహిళల పట్ల నా అభిప్రాయాలను దాచుకోలేదు. శ్రీదేవి విషయంలో కూడా నేను ఎప్పుడూ బహిరంగంగానే మాట్లాడాను. నా ఆలోచనలను వ్యక్తం చేసే విధానంలో నేను మారను, కానీ నా సినిమాలు మాత్రం భిన్నంగా ఉంటాయి" అని స్పష్టం చేశాడు. అయితే ఆ ట్వీట్‌ను ఎందుకు డిలీట్ చేశారనే ప్రశ్నకు మాత్రం తనకు గుర్తులేదని సమాధానమిచ్చాడు.

అసలు వివాదం ఏమిటి?

'వార్ 2' టీజర్‌లో కియారా అద్వానీ గ్లామరస్‌గా కనిపించిన సీన్లపై వర్మ గతంలో ఒక ట్వీట్ చేశాడు. "దేశాల మధ్య లేదా సమాజాల మధ్య యుద్ధం కంటే.. ఆమె పి..లను ఎవరు దక్కించుకుంటారు అనే దానిపై హృతిక్, ఎన్టీఆర్ మధ్య యుద్ధం జరిగితే, ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అయ్యేది" అనే అర్థం వచ్చేలా అసభ్యకర పదజాలంతో ట్వీట్ చేశాడు. ఒక నటి పట్ల ఇంత గౌరవం లేకుండా మాట్లాడటంపై సోషల్ మీడియాలో నెటిజన్లు అతనిపై విరుచుకుపడ్డారు.

బాక్సాఫీస్ వద్ద చతికిలబడ్డ 'వార్ 2'

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా వచ్చిన 'వార్ 2' ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ పవర్ ఉన్నప్పటికీ, బలహీనమైన కథనం, నాసిరకం వీఎఫ్ఎక్స్ (VFX) కారణంగా విమర్శల పాలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కూడా ఆశించిన వసూళ్లను రాబట్టలేకపోయింది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More