Mahesh Babu: నా గడ్డం ఎక్కడో పోయింది- మళ్లీ క్లీన్ షేవ్ లుక్‌లో మహేశ్ బాబు- నమ్రతతో వీడియో- వారణాసి షూటింగ్ పూర్తి?
Mahesh Babu Clean Shave Look Video: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న అడ్వెంచర్ థ్రిల్లర్ ‘వారణాసి’ చిత్రం నుంచి కీలక అప్‌డేట్ బయటికొచ్చింది. గడిచిన కొన్నినెలలుగా గడ్డం, పొడవాటి జుట్టుతో కనిపించిన సూపర్ స్టార్ మహేశ్ బాబు.. తాజాగా క్లీన్ షేవ్ అవతారంలో దర్శనమివ్వడం ఇంట్రెస్టింగ్‌గా మారింది.
Mahesh Babu Clean Shave Look Video: తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ నలుమూలలకూ చాటిచెప్పిన దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్‌స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి'. ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైన క్షణం నుంచే సినీ అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

మహేశ్ బాబు లుక్ వైరల్
ఈ వారణాసి సినిమా కోసం మహేశ్ బాబు పెంచిన జుట్టు, గడ్డం వైల్డ్ లుక్‌కు సంబంధించిన ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాను తెగ ఊపేశాయి. అయితే, తాజాగా మహేశ్ బాబు తిరిగి తన పాత లుక్‌లోకి వచ్చేశాడు. పూర్తిగా క్లీన్ షేవ్ లుక్‌లో కనిపించి మహేశ్ బాబు వీడియో వైరల్ అవుతోంది.
క్లీన్ షేవ్ లుక్‌లో కనిపించిన సూపర్‌స్టార్
హైదరాబాద్ విమానాశ్రయంలో మహేశ్ బాబు క్లీన్ షేవ్ చేసుకుని కనిపించిన తాజా చిత్రాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తెల్లటి టీషర్ట్, లైట్ బ్లూ కలర్ జాకెట్, బ్రౌన్ క్యాప్, కూలింగ్ గ్లాసెస్‌తో ఎంతో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఆ వీడియోలో మహేశ్ బాబు పక్కనే ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్ కూడా ఉన్నారు. ఎయిర్ పోర్టులో కలిసి నడుస్తున్న మహేశ్ బాబు, నమ్రత వీడియో వైరల్ అవుతోంది.
అయితే, ఈ వీడియోలో తన గడ్డం ఎక్కడో పోయింది అన్నట్లుగా మహేశ్ బాబు నవ్వుతూ తన చేతులతో చూపించడం తెగ ఆకట్టుకుంటోంది. ఇన్ని రోజులు గడ్డంతో రగ్గడ్ లుక్‌లో కనిపించిన మహేశ్ బాబు తాజాగా తన గడ్డం తీసేసి ఇదివరకటి లవర్ బాయ్‌లా దర్శనం ఇచ్చాడు.
చిత్రీకరణ ముగిసిందా?
అయితే 'వారణాసి' సినిమా కోసం చాలాకాలంగా కల్ట్ లుక్‌లో దర్శనమిచ్చిన మహేశ్ బాబు ఉన్నపళంగా గడ్డం తీసేసి చాక్లెట్ బాయ్ లుక్‌లోకి మారడం కొత్త చర్చకు దారితీసింది. మహేష్ బాబును ఇలా క్లీన్ షేవ్ రూపంలో చూసిన అభిమానులు.. ఆయనకు సంబంధించిన వారణాసి షూటింగ్ పార్ట్ దాదాపు ముగిసిందని భావిస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే 90 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తయినట్లు ఫిలింనగర్ టాక్. మహేశ్ బాబు పాత్రకు సంబంధించిన ప్రధాన సన్నివేశాల షూటింగ్ ముగిసిందని, కేవలం ఒక కీలకమైన ఇంట్రడక్షన్ సీక్వెన్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉందనే ప్రచారం శరవేగంగా వ్యాపిస్తోంది. దీనిపై నిర్మాణ సంస్థ నుంచి అధికారిక సమాచారం రావాల్సి ఉంది.
'వారణాసి' విశ్వరూపం.. ఆసక్తికర కథాంశం
వేర్వేరు కాలక్రమాలను ఏకం చేస్తూ సాగే ఒక మైథాలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా వారణాసి చిత్రాన్ని రాజమౌళి మలుస్తున్నారు. 'శాంబవి' అనే భారీ గ్రహశకలం వల్ల భూగోళానికి పొంచి ఉన్న విపత్తును నివారించే నేపథ్యంతో కథ సాగనుందని సమాచారం.
ఇందులో మహేశ్ బాబు 'రుద్ర' అనే ఆర్కియాలజిస్ట్, పరిశోధకుడి పాత్రలో కనిపించనున్నారు. త్రేతాయుగం నాటి రాముడు, కుంభకర్ణుడి మధ్య జరిగే యుద్ధ ఘట్టం ఆధారంగా సాగే ఒక ప్రత్యేక సీక్వెన్స్‌లో మహేశ్ శ్రీరాముడిగా కనిపించనున్నారనే వార్తలు ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్నాయి.
భారీ తారాగణం.. ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్
ఇక వారణాసి చిత్రంలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్ 'మందాకిని' పాత్రలో హీరోయిన్‌గా మెరవనున్నారు. దాదాపు ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆమె మళ్లీ భారతీయ సినిమాలో నటిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం.
అలాగే, పవర్ ఫుల్ విలన్ 'కుంభ' పాత్రలో మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో నిర్మితమవుతున్న ఈ విజువల్ వండర్ 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


