SaV3 Teaser: బిగ్ బాస్ డీమాన్ పవన్ హీరోగా సాV3 టీజర్ రిలీజ్- చిరంజీవి, మహేశ్ బాబు, నానిలా పేరు తెచ్చుకుంటాడని ప్రశంసలు

Bigg Boss Demon Pavan SaV3 Teaser Released: బిగ్ బాస్ ఫేమ్ డీమాన్ పవన్, నటుడు సామ్రాట్ హీరోలుగా లిఖిత హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ మూవీ సాV3. ఆదివారం సాV3 టీజర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాV3 టీజర్ లాంచ్ ఈవెంట్‌లో చిరంజీవి, మహేశ్ బాబు, నానిలా డీమాన్ పవన్ పేరు తెచ్చుకుంటాడని పొగిడారు.

Published on: Aug 17, 2026, 21:52:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Bigg Boss Demon Pavan SaV3 Teaser Released: తెలుగులో వస్తున్న లేటెస్ట్ మూవీ "సాV3". ఈ సినిమాలో సామ్రాట్, బిగ్ బాస్ తెలుగు 9 ఫైనలిస్ట్ డీమాన్ పవన్, లిఖిత (రాను బొంబాయికి రాను సాంగ్ ఫేమ్) హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

బిగ్ బాస్ డీమాన్ పవన్ హీరోగా సాV3 టీజర్ రిలీజ్- చిరంజీవి, మహేశ్ బాబు, నానిలా పేరు తెచ్చుకుంటాడని ప్రశంసలు
బిగ్ బాస్ డీమాన్ పవన్ హీరోగా సాV3 టీజర్ రిలీజ్- చిరంజీవి, మహేశ్ బాబు, నానిలా పేరు తెచ్చుకుంటాడని ప్రశంసలు

త్వరలోనే గ్రాండ్ రిలీజ్

ఈ చిత్రాన్ని లక్ష్మి కృష్ణ ఫిలింస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.2గా నిర్మాత వి. విజయ నిర్మిస్తున్నారు. నటుడు, దర్శకుడు కృష్ణ మాయ ఈ సాV3 సినిమాను రూపొందిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది.

సాV3 సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్

ఆదివారం (ఆగస్టు 16) సాయంత్రం హైదరాబాద్‌లో సాV3 సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు బిగ్ బాస్ సెలబ్రిటీలు పాల్గొని సందడి చేశారు.

బిగ్ బాస్ రాము రాథోడ్ కామెంట్స్

సింగర్, బిగ్ బాస్ ఫేమ్ రాము రాథోడ్ మాట్లాడుతూ.. "సాV3 సినిమా టీజర్ నాకు బాగా నచ్చింది. సామ్రాట్, లిఖిత, డీమాన్ పవన్ తమ నటనతో ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో వాళ్లు పోటా పోటీగా నటించారని అనిపిస్తోంది. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా" అని తెలిపారు.

చిరంజీవి, మహేశ్ బాబు, నానిలా పేరు

చెఫ్ సంజయ్ తుమ్మ మాట్లాడుతూ.. - "సాV3 సినిమా టీజర్ చాలా బాగుంది. డైరెక్టర్ కృష్ణ మాయ, ఇతర టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. నేను డీమాన్ పవన్ నటనకు అభిమానిని. ఆయన ఫ్యూచర్‌లో మంచి పేరు తెచ్చుకుంటారు. ఒక మెగాస్టార్ చిరంజీవి, మహేశ్ బాబు, నానిలా పేరు తెచ్చుకుంటాడని నమ్మకంగా చెప్పగలను" అని అన్నారు.

పొద్దుటి నుంచి రాత్రి వరకు

నటి హారిక మాట్లాడుతూ.. "ఈ సినిమాలో నేనొక ఇంపార్టెంట్ రోల్ చేశాను. నేను ఈ పాత్రలో మెప్పించగలను అని నమ్మి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ కృష్ణ మాయకి థ్యాంక్స్. ఆయనకు సినిమా అంటే చాలా ప్యాషన్. పొద్దుటి నుంచి రాత్రి వరకు అదే ప్యాషన్ తో ఎనర్జీతో వర్క్ చేస్తుంటారు" అని చెప్పారు.

జీవించారని చెప్పాలి

"సామ్రాట్ తన క్యారెక్టర్‌లో నటించారు అనేకంటే జీవించారు అని చెప్పాలి. మా సినిమా టీజర్ మీ అందరికీ నచ్చిందని నమ్ముతున్ననాను. త్వరలో రిలీజ్‌కు వస్తున్న సినిమాను కూడా సపోర్ట్ చేయాలని కోరుతున్నా" అని హారిక కోరారు.

టీజర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది

నటి, బిగ్ బాస్ బ్యూటీ రీతూ చౌదరి మాట్లాడుతూ.. "ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొనే అవకాశం రావడం సంతోషంగా ఉంది. "సాV3" సినిమా టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ టీజర్‌లో లవ్ అండ్ లైఫ్ గురించి చూపించారు" అని అన్నారు.

రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ

"నా దృష్టిలో లైఫ్‌లో ఎలా కష్టాలు ఉంటాయో లవ్‌లో కూడా ఉంటాయి. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ వెళ్తేనే హ్యాపీగా ఉంటాం. టీజర్ లాగే సినిమా కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకోవాలని టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. మా పవన్ ఈ చిత్రంతో మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నా" అని రీతూ చౌదరి ఆకాంక్షించారు.

మంచి చిత్రాలు ప్రొడ్యూస్ చేయాలని

"మా మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్‌కు అతిథులుగా వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. సుధావల్లి, నాగవర్థిని మాకు ఎంతో సపోర్ట్ చేశారు. మీ అందరి సపోర్ట్ తో ఇలాంటి మంచి చిత్రాలు మరిన్ని ప్రొడ్యూస్ చేయాలని కోరుకుంటున్నా" అని ప్రొడ్యూసర్ వి విజయ చెప్పుకొచ్చారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More