Rajamouli: రాజమౌళి ఒక పాపను దత్తత తీసుకుని ఆ పేరు పెట్టారు- ఉపేంద్ర, ఆర్జీవీ, పూరి, నోలన్ అంటే ఇష్టం: దర్శకుడు శ్రీ తేజ్

Shree Tej SK About Rajamouli Adopted Daughter Name: డైరెక్టర్ శ్రీ తేజ్ ఎస్‌కేగా పేరు మార్చుకున్న నిర్మాత శ్రీకాంత్ కాండ్రేగుల. ఆయన తెరకెక్కించిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా మయూఖ. ఇటీవల రిలీజైన మయూఖ మూవీ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో. ఈ క్రమంలో డైరెక్టర్ శ్రీ తేజ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Published on: Oct 11, 2026, 05:29:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Shree Tej SK About Rajamouli Adopted Daughter Name: తెలుగులో తెరకెక్కిన లేటెస్ట్ సైకలాజికల్ సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా మయూఖ. ఈ సినిమాతో దర్శకుడిగా మారారు నిర్మాత శ్రీకాంత్ కాండ్రేగుల. అది కూడా శ్రీ తేజ్ ఎస్‌కె అనే పేరుతో డైరెక్టర్‌గా మారారు. ఈ సినిమాలో మయూఖగా హీరోయిన్ పాయల్ చెంగప్ప మెయిన్ లీడ్ రోల్ పోషించింది.

రాజమౌళి ఒక పాపను దత్తత తీసుకుని ఆ పేరు పెట్టారు- ఉపేంద్ర, ఆర్జీవీ, పూరి, నోలన్ అంటే ఇష్టం: దర్శకుడు శ్రీ తేజ్
రాజమౌళి ఒక పాపను దత్తత తీసుకుని ఆ పేరు పెట్టారు- ఉపేంద్ర, ఆర్జీవీ, పూరి, నోలన్ అంటే ఇష్టం: దర్శకుడు శ్రీ తేజ్

మయూఖ సినిమాకు మంచి రెస్పాన్స్

ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై శశిధర్ నల్ల నిర్మించారు. ఇటీవలే అక్టోబర్ 9న థియేటర్లలో విడుదలైన మయూఖ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులకు ఆడియెన్స్ థ్రిల్ ఫీల్ అవుతున్నారు. అయితే, సినిమా రిలీజ్‌కు ముందు ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ శ్రీతేజ్ మయూఖకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.

-మయూఖ అంటే ఆశాకిరణం. మా సినిమా చూస్తూ చివరకు వచ్చేసరికి మీకు మా మూవీ టైటిల్ జస్టిఫై అవుతుంది. నేను రూపొందించిన చివరి షార్ట్ ఫిల్మ్ పేరు మయూఖ. ఆ షార్ట్ ఫిల్మ్ కంప్లీట్ చేయకుండానే యూఎస్ వెళ్లాను. అప్పుడు రాజమౌళి గారు ఒక పాపను దత్తత తీసుకుని ఆమెకు మయూఖ అనే పేరు పెట్టారు.

చాలా జాగ్రత్తలు తీసుకున్నాం

-నా ప్రొఫెషనల్ కెరీర్‌లో కొనసాగుతున్న టైమ్‌లో ప్రొడ్యూసర్‌కు ఈ మయూఖ కథ చెబితే బాగుంది చేద్దామని అన్నారు. మనం ఎంత మంచి కథ రాసినా దాన్ని విజువల్‌గా, ఆడియో పరంగా అందంగా తెరకెక్కించాలి. అప్పుడే సినిమా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాకు విజువల్, సౌండ్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. క్వాలిటీగా చేశాం. శిబి మాత్యూ అలెక్స్ మంచి మ్యూజిక్ ఇచ్చారు.

-మన ఆడియెన్స్ కొరియన్, హాలీవుడ్ థ్రిల్లర్స్ చూసి మన వాళ్లు ఇలా ఎందుకు తీయరు అనుకుంటూ ఉంటారు. మనం అలాంటి ప్రాడక్ట్ ఇస్తే తప్పకుండా ఆదరిస్తారని నమ్ముతున్నాం. మా సినిమాలో ఎమోషన్ కంటే ఎక్కువగా ఎక్స్‌పీరియన్స్ ప్రేక్షకులకు ఇవ్వబోతున్నాం. సినిమా మేకింగ్‌లో మా ప్రొడ్యూసర్ శశిధర్ నల్ల నుంచి కంప్లీట్ సపోర్ట్ లభించింది.

20 ఏళ్ల క్రితం షార్ట్ ఫిల్మ్స్

-నేను దాదాపు ఇరవై ఏళ్ల క్రితం షార్ట్ ఫిల్మ్స్ రూపొందించాను. ఆ తర్వాత యూఎస్ వెళ్లాను అక్కడ న్యూయార్క్ ఫిల్మ్ అకాడెమీలో డైరెక్షన్ కోర్స్ చేశాను. దర్శకత్వం అనేది ఎప్పుడూ నా ప్రయారిటీగా ఉండేది. అయితే సినిమా మేకింగ్‌లో అనుభవం కోసం ప్రొడక్షన్ విషయాలపై కూడా అవగాహన పెంచుకున్నాను.

-తంత్రం, సూత్రవాక్యం అనే సినిమాలను తెలుగులో రిలీజ్ చేశాం. మా సినిమా బండి ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ఇప్పటిదాకా రెండు చిత్రాలు చేశాం. మరికొన్ని ప్రొడక్షన్ లో ఉన్నాయి. ఇవన్నీ కొత్త టీమ్ తో చేసినవే. మంచి కథలు ఉంటే తప్పకుండా న్యూ టాలెంట్‌కు సపోర్ట్ చేస్తాం.

ఉపేంద్ర, ఆర్జీవీ, పూరి అంటే ఇష్టం

-ఒక సినిమా హిట్ అయితే అదే జోనర్‌లో మూవీస్ వస్తుంటాయి. మనం ఆ జోనర్‌లో మూవీ చేసేలోపు ట్రెండ్ మారిపోతుంది. నేను లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చేయొచ్చు. కానీ, కొత్తగా ప్రయత్నిద్దామని మయూఖ రూపొందించాను.

-ఉపేంద్ర, రామ్ గోపాల్ వర్మ, పూరి జగన్నాథ్, జొనాథన్ నోలన్ వంటి దర్శకులను ఇష్టపడతా. నెక్ట్స్ నా దర్శకత్వంలో ఒక ఎమోషనల్ సైన్స్ ఫిక్షన్ మూవీ చేయబోతున్నా. అది క్లీన్ యూ సర్టిఫికెట్ సినిమా అవుతుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More