RGV Mohit Suri: గ్యాంగ్‌స్టర్ కర్రీతో వండిన లవ్ డిష్- మరో దర్శకుడితో రామ్ గోపాల్ వర్మ సినిమా- ఇక థియేటర్‌లో పూనకాలే!

Ram Gopal Varma Mohit Suri Movie Announcement: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, 'సయారా' ఫేమ్ మోహిత్ సూరిల కాంబోలో ఒక క్రేజీ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. వర్మ మార్క్ గ్యాంగ్‌స్టర్ డ్రామాకు, మోహిత్ సూరి ప్రేమకథను జోడిస్తూ కొత్త సినిమా ప్లాన్ చేస్తున్నట్లు ఆర్‌జీవీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Published on: Sep 13, 2026, 14:02:41 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Ram Gopal Varma Mohit Suri Movie Announcement: భారతీయ సినిమా రంగాన్ని తనదైన క్రైమ్, గ్యాంగ్‌స్టర్ డ్రామాలతో ఊపేసిన సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో ఆసక్తికరమైన కాంబినేషన్‌ను తెరపైకి తెచ్చారు. 'సయారా' (Saiyaara) సినిమాతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించిన దర్శకుడు మోహిత్ సూరితో కలిసి ఆయన ఒక కొత్త చిత్రాన్ని రూపొందించబోతున్నారు.

గ్యాంగ్‌స్టర్ కర్రీతో వండిన లవ్ డిష్- మరో దర్శకుడితో రామ్ గోపాల్ వర్మ సినిమా- ఇక థియేటర్‌లో పూనకాలే!
గ్యాంగ్‌స్టర్ కర్రీతో వండిన లవ్ డిష్- మరో దర్శకుడితో రామ్ గోపాల్ వర్మ సినిమా- ఇక థియేటర్‌లో పూనకాలే!

ఆర్‌జీవీ మార్క్ ట్వీట్.. పిక్ వైరల్!

ఆదివారం మోహిత్ సూరితో దిగిన సెల్ఫీని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పంచుకున్న రామ్ గోపాల్ వర్మ, తనదైన శైలిలో ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. "మోహిత్ సూరి తదుపరి చిత్రం కోసం మేమిద్దరం కలిసి పనిచేస్తున్నాం. గ్యాంగ్‌స్టర్ కర్రీతో కూడిన ఒక లవ్ డిష్‌ను సిద్ధం చేస్తున్నాం. ఈ ప్రాజెక్ట్ వివరాలను అతిత్వరలోనే మీ ముందుకు తెస్తాం" అని ఆర్జీవీ పోస్ట్ చేశారు.

గ్యాంగ్‌స్టర్ 2 లేదా ఆషికి 4

ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. రామ్ గోపాల్ వర్మ రా యాక్షన్, మోహిత్ సూరి మార్క్ రొమాంటిక్ మ్యూజిక్ కలగలిపి వస్తే థియేటర్లలో పూనకాలేనని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. 'గ్యాంగ్‌స్టర్ 2' లేదా 'ఆషికి 4' ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అని సినీ ప్రియులు చర్చించుకుంటున్నారు.

సయారా ప్రభంజనం.. మోహిత్ సూరి గ్రాండ్ విక్టరీ

అహాన్ పాండే, అనీత్ పడ్డా జంటగా మోహిత్ సూరి తెరకెక్కించిన 'సయారా' చిత్రం భారతీయ రొమాంటిక్ సినిమాల్లో సరికొత్త రికార్డులు నెలకొల్పింది. బాక్సాఫీస్ లెక్కల ప్రకారం ఈ చిత్రం దేశీయంగా రూ. 329.73 కోట్ల కలెక్షన్స్‌ను, ప్రపంచవ్యాప్తంగా రూ. 570.33 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.

కొన్నిసార్లు సినిమాలే మనల్ని తయారు చేస్తాయి

మోహిత్ సూరి దర్శకత్వ ప్రతిభపై గతంలోనే రామ్ గోపాల్ వర్మ ప్రశంసలు కురిపించారు. "మనం సినిమాలు తీయం, కొన్నిసార్లు సినిమాలే మనల్ని తయారు చేస్తాయి. వాటికి స్వయంప్రతిపత్తి ఉంటుంది. మనం అందులో భాగం మాత్రమే" అని 'సత్య' రీ-రిలీజ్ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించిన మాటలను మోహిత్ ఒక ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు.

రామ్ గోపాల్ వర్మ తదుపరి ప్రాజెక్ట్‌లు

ప్రస్తుతం ఆర్జీవీ వరుస ప్రాజెక్ట్‌లతో ఎంతో బిజీగా ఉన్నారు. మనోజ్ బాజ్‌పాయ్‌తో 'పోలీస్ స్టేషన్‌లో భూత్' అనే హారర్ కామెడీని తెరకెక్కిస్తున్నారు. ఇందులో జెనీలియా, రమ్యకృష్ణ, రాజ్‌పాల్ యాదవ్ నటిస్తున్నట్లు సమాచారం.

పోలీస్ కంపెనీ, సిండికేట్, షో మ్యాన్ సినిమాలు

అలాగే హర్షవర్ధన్ రాణే, ఫర్దీన్ ఖాన్‌లతో 'పోలీస్ కంపెనీ', బాలీవుడ్ చిత్రం 'ధురంధర్' ప్రేరణతో 'సిండికేట్' అనే సినిమాలు లైన్‌లో ఉన్నాయి. అంతేకాకుండా 'షోమ్యాన్' అనే చిత్రంలో రామ్ గోపాల్ వర్మ స్వయంగా ప్రధాన పాత్రలో నటించనుండటం విశేషం.

వర్మ, మోహిత్ సూరి కాంబినేషన్ మ్యాజిక్?

మరోవైపు యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై మోహిత్ సూరి మరో రొమాంటిక్ డ్రామాను ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్మ, మోహిత్ సూరి కాంబినేషన్ ఇండియన్ స్క్రీన్ పై ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More