RGV Urmila: రామ్ గోపాల్ వర్మ, హీరోయిన్ ఊర్మిళ పెళ్లి చేసుకున్నారు, నాకు చిరంజీవి చెప్పారు: సీనియర్ జర్నలిస్ట్ కామెంట్స్
Journalist Jyoti Venkatesh On Ram Gopal Varma Urmila Marriage: రామ్ గోపాల్ వర్మ, బాలీవుడ్ హీరోయిన్ ఊర్మిళ మటోండ్కర్‌ను రహస్యంగా పెళ్లి చేసుకున్నారంటూ సీనియర్ జర్నలిస్ట్ జ్యోతి వెంకటేష్ సంచలన విషయాలు బయటపెట్టారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఒక ఆలయంలో వీరి వివాహం జరిగిందని, అది ఆయకు చిరంజీవి చెప్పారన్నారు.
Journalist Jyoti Venkatesh On Ram Gopal Varma Urmila Marriage: ఇండియన్ సినిమాలో తన మార్క్ ట్రెండ్ సెట్ చేసిన సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తుంటారు. అయితే తాజాగా వర్మ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా హల్‌చల్ చేస్తోంది.

హీరోయిన్ ఊర్మిళతో పెళ్లి
ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఊర్మిళ మటోండ్కర్‌ను ఆర్జీవీ రహస్యంగా వివాహం చేసుకున్నారంటూ సీనియర్ జర్నలిస్ట్ జ్యోతి వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. బాలీవుడ్‌కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ జ్యోతి వెంకటేష్ ఇటీవల ప్రముఖ యాంకర్ సిద్ధార్థ్ కన్నన్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నారు.
ఆలయంలో రహస్య వివాహం.. అసలు ఏం జరిగింది?
ఈ సందర్భంగా ఆర్జీవీ, ఊర్మిళల అనుబంధంపై ఆయన సంచలన విషయాలు పంచుకున్నారు జర్నలిస్ట్ జ్యోతి వెంకటేష్. చిరంజీవి నాతో అన్నారు. "హేయ్ జ్యోతి.. నువ్వు అన్ని రాస్తావు కానీ ఊర్మిళను రామ్ గోపాల్ వర్మ పెళ్లి చేసుకుంది రాయలేదు అన్నారు. వాళ్లకు ఎఫైర్ ఉందని నాకు తెలుసు. కానీ, పెళ్లి ఎప్పుడు జరిగిందని నేను అడిగా, ఆయన జరిగిందన్నారు" అని జ్యోతి వెంకటేష్ చెప్పారు.
"తెలంగాణలోనో.. ఆంధ్రప్రదేశ్‌లోనో.. అప్పుడు ఆ సమయంలో ఆంధ్రప్రదేశే.. ఒక ప్రముఖ ఆలయానికి ఊర్మిళను తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నారు అన్నారు. మీ దగ్గర ఫ్రూఫ్ ఏంటని అడిగా. ఆ పెళ్లి చేసిన పూజారి నెంబర్ ఇచ్చారు. నేను ఆర్టికల్ రాయడానికి ముందు ఊర్మిళకు కాల్ చేసి అడిగాను. తను ఏడవడం మొదలుపెట్టింది. నా గురించి మీరు అలా ఎలా రాస్తారు. నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి నా గురించి మీకు తెలుసు కదా అన్నారు" అని జ్యోతి వెంకటేష్ తెలిపారు.
నో కామెంట్ అన్నారు
"ఇదే విషయంపై రామ్ గోపాల్ వర్మకు కాల్ చేసి అడిగాను. అతను కేవలం నో కామెంట్ అన్నారు. నేను ఆయనతో అన్నాను. ఈ వయసులో ఒక నటితో మీకు ఇదంతా అవసరమా అని. ఆమె హెల్త్ ఎఫెక్ట్ చేయాలని లేకుంటే ఇలా చేయరు అన్నా. నాకు మీతో మాట్లాడాలని లేదు అని కాల్ కట్ చేశారు. అప్పుడు నేను ఇద్దరి సైడ్ నుంచి స్టోరీ రాశాను" అని జర్నలిస్ట్ జ్యోతి వెంకటేష్ వివరించారు.
విడిపోవడానికి కారణం అదేనా?
ఈ సీక్రెట్ పెళ్లి తర్వాత ఆర్జీవీ, ఊర్మిళ మధ్య విభేదాలు రావడానికి గల కారణాన్ని కూడా జ్యోతి వెంకటేష్ బయటపెట్టారు. ఊర్మిళ తనతో చట్టబద్ధంగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలని వర్మను కోరారంట. అయితే వర్మ అందుకు ఒప్పుకోకపోవడంతోనే ఇద్దరి మధ్య దూరం పెరిగి, చివరకు విడిపోయారని పేర్కొన్నారు.
ఒకానొక దశలో ఊర్మిళను వర్మ తన డ్రీమ్ గర్ల్‌గా భావించేవారు. ఆ తర్వాత వీరి కాంబినేషన్‌లో సినిమాలు రాకపోవడానికి వీరి మధ్య ఉన్న విభేదాలే కారణమని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇప్పుడు సీనియర్ జర్నలిస్ట్ చేసిన ఈ వ్యాఖ్యలతో ఆ పాత పుకార్లకు మళ్లీ బలం చేకూరినట్లయింది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


