RGV Satyadev: ఛార్మీ పక్కన హీరోగా బాగోలేడన్న ఆర్జీవీ- సత్యదేవ్ దగ్గరే తప్పు ఒప్పుకున్న రామ్ గోపాల్ వర్మ- మరోసారి ఇలా!

Ram Gopal Varma Sorry To Satyadev Over Rao Bahadur: హీరోయిన్ ఛార్మీ కౌర్ పక్కన హీరోగా బాగోలేడన్న ఆర్జీవీతోనే ప్రశంసలు కురిపించుకున్నాడు సత్యదేవ్. ఇటీవల విడుదలైన రావు బహదూర్ సినిమాతో మరోసారి రామ్ గోపాల్ వర్మతో పొగిడించుకున్న సత్యదేవ్ దగ్గర ఆర్జీవీ తప్పు ఒప్పుకున్న సంఘటనపై ఓ లుక్కేద్దాం.

Published on: Jul 5, 2026, 05:32:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Ram Gopal Varma Sorry To Satyadev Over Rao Bahadur: టాలీవుడ్ ది బెస్ట్ యాక్టర్స్‌లో సత్యదేవ్ ఒకరు.. అని తాజాగా విడుదలైన రావు బహదూర్ సినిమాతో మరోసారి నిరూపించుకున్నాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ముకుంద వంటి సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసిన సత్యదేవ్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన జ్యోతిలక్ష్మీ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

ఛార్మీ పక్కన హీరోగా బాగోలేడన్న ఆర్జీవీ- సత్యదేవ్ దగ్గరే తప్పు ఒప్పుకున్న రామ్ గోపాల్ వర్మ- మరోసారి ఇలా!
ఛార్మీ పక్కన హీరోగా బాగోలేడన్న ఆర్జీవీ- సత్యదేవ్ దగ్గరే తప్పు ఒప్పుకున్న రామ్ గోపాల్ వర్మ- మరోసారి ఇలా!

మరోసారి రావు బహదూర్ సినిమాతో

ఆ తర్వాత బ్లఫ్ మాస్టర్, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య తదితర సినిమాలతో తనలోని నటన ఏంటో నిరూపించుకున్నాడు సత్యదేవ్. హీరోగానే కాకుండా విలన్‌గా కూడా మెప్పిస్తూ దూసుకుపోతున్నాడు. ఇప్పుడు మరోసారి జూలై 3న విడుదలైన రావు బహదూర్ సినిమాతో మరోసారి తన నటనను అందరూ మెచ్చుకునేలా చేశాడు.

అయితే, సత్యదేవ్‌ను ముందుగా హీరోగా వద్దని, ఛార్మీ పక్కన అస్సలు బాగోలేడని ఒక స్టార్ డైరెక్టర్ అన్నారని ఓ ఇంటర్వ్యూలో సత్యదేవ్ చెప్పుకొచ్చాడు. ఆ సినిమా మరేదో కాదు సత్యదేవ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన జ్యోతి లక్ష్మీ సినిమా. అందులో ఛార్మీ మెయిన్ లీడ్ హీరోయిన్ కాగా సత్యదేవ్ సెకండ్ హీరోగా చేసినట్లు చెప్పుకోవచ్చు.

వీడు తప్పా

జ్యోతిలక్ష్మీ సినిమా షూటింగ్ సమయంలో ఒక పాటలో సత్యదేవ్‌ను ఆర్జీవీ చూశారు. ఆ తర్వాత డైరెక్టర్ పూరితో "అంతా బాగానే ఉంది. వీడు తప్పా. ఎందుకు తీసుకున్నావ్. నువ్వు అన్నీ ఇలాగే చేస్తావ్. నువ్వు ఇంకెవరినైనా తీసుకోవచ్చుగా అన్నారు. ఆ విషయం నాకు ఏడీ ద్వారా తెలిసింది. ఆ పెద్ద మనిషి ఇలా అన్నాడని" అని రామ్ గోపాల్ వర్మ అన్నట్లు సత్యదేవ్ తెలిపాడు.

"ఆ తర్వాత సినిమా స్క్రీనింగ్ అయిన తర్వాత ఆ పెద్ద మనిషి వచ్చి ఆ సినిమా చూశాడు. అప్పుడే చాలా బాధపడ్డాను. అరే సినిమా అంత చూల్లేదు. ఎందుకిలా మాట్లాడుతున్నారు అని" అని ఆర్జీవీ తన గురించి అలా అనడంపై చెప్పుకొచ్చాడు సత్యదేవ్.

నేను చాలా పెద్ద తప్పు చేశాను

"స్క్రీనింగ్ తర్వాత అంతా వెళ్లిపోయారు. ఆయన మాత్రం అలాగే నిల్చుని ఉండి ఇటు రా అని పిలిస్తే వెళ్లాను. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నీకు తెలుసో తెలియదో. నీది నేను ఓ బిట్టు చూసి నిన్ను తీసేయమని చెప్పాను. తీసి మళ్లీ రీషూట్ చేయమన్నాను లేకపోతే.. అని చెప్పాను. ఐ ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ నేను అలా చెప్పి ఉండకూడదు. నాకు తెలుసని ఆయనకు తెలియదు. యూ ఆర్ ది బెస్ట్ ఎంటైర్ అని పొగిడారు. ఆయనే రామ్ గోపాల్ వర్మ" అని సత్యదేవ్ వెల్లడించాడు.

అలా ఛార్మీ పక్కన హీరోగా సత్యదేవ్‌ను వద్దన్న ఆర్జీవీనే తర్వాత ఆయనతో తన తప్పు ఒప్పుకుని నటనను మెచ్చుకున్నారు. ఇప్పుడు మరోసారి రావు బహదూర్ సినిమాపై ప్రశంసలు కురిపించి సత్యదేవ్ నటనను ఆకాశానికెత్తేశారు రామ్ గోపాల్ వర్మ.

సత్యదేవ్‌పై ఆర్జీవీ ప్రశంసలు

రావు బహదూర్ సినిమాలో సత్యదేవ్ నటించలేదని, ఆ పాత్రలో పూర్తిగా లీనమైపోయాడని, అప్పుడప్పుడు సత్యదేవ్ మాయమైపోయాడని తన స్టైల్‌లో ప్రశంసలు కురిపించాడు రామ్ గోపాల్ వర్మ. అలాగే, మేకప్, కాస్ట్యూమ్స్, ప్రొడక్షన్ వాల్యూస్‌ గురించి కూడా పొగిడారు.

సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఉందని, 99 శాతం సినిమాలు పాత మూవీస్ నుంచి ఎంతో కొంత కాపీ కొడతాయని, రావు బహదూర్ మాత్రం ఫ్రెష్ మూవీ అన్నట్లుగా మెచ్చుకున్నారు ఆర్జీవీ. అలాగే, రావు బహదూర్ డైరెక్టర్ వెంకటేష్ మహాను సైతం ప్రశంసించారు రామ్ గోపాల్ వర్మ.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More