RGV: 7 కోట్ల బడ్జెట్, 1400 కోట్ల కలెక్షన్స్- హారర్ థ్రిల్లర్‌పై ఆర్జీవీ ప్రశంసలు- 70 లక్షలతో తీయొచ్చు- ప్రతి మగాడు అంటూ!
Ram Gopal Varma Review On Obsession Movie: అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి కోట్ల కలెక్షన్స్ రాబడుతున్న హాలీవుడ్ హారర్ మూవీ అబ్సెషన్‌పై రామ్ గోపాల్ వర్మ రివ్యూ ఇస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సాంకేతిక హంగులు లేకుండానే ఈ సినిమా సాధించిన విజయం, సినిమా ఎడిటింగ్ సూత్రాలను ఎలా మార్చేసిందో విశ్లేషించారు.
Ram Gopal Varma Review On Obsession Movie: ఇటీవల కాలంలో భారీ తారాగణం, వందల కోట్ల బడ్జెట్, కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్ (VFX) ఉంటేనే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారనే నమ్మకాన్ని ఒక చిన్న హారర్ సినిమా ముక్కలు చేసేసింది.

7 కోట్ల బడ్జెట్
కేవలం 750,000 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ. 7 కోట్లు) అత్యల్ప బడ్జెట్‌తో రూపొందిన హాలీవుడ్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ 'అబ్సెషన్' (Obsession) ప్రపంచవ్యాప్తంగా ఏకంగా $170 మిలియన్లు (దాదాపు రూ. 1400 కోట్లకు పైగా) కలెక్షన్స్ వసూలు చేసి అంతర్జాతీయంగా ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.
అబ్సెషన్ సినిమా సృష్టించిన సంచలనంపై ఇండియన్ సినిమా ఫిల్మ్ మేకర్ రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తనకు ఈ సినిమా విపరీతంగా నచ్చేసిందని చెప్తూ, ఈ చిత్రం గ్లోబల్ ఆడియన్స్‌కు ఎలా కనెక్ట్ అయిందో విశ్లేషించారు.
ప్రతి మహిళలోనూ 'నిక్కీ' ఉంటుంది: ఆర్జీవీ థియరీ
సినిమా కథ విషయానికి వస్తే.. మ్యూజిక్ స్టోర్‌లో పనిచేసే బేర్ (మైఖేల్ జాన్‌స్టన్) అనే యువకుడు, తన చిన్ననాటి స్నేహితురాలు నిక్కీ (ఇండే నవరెట్) తన ప్రేమలో పడాలని ఒక శక్తులున్న మాయా బొమ్మను కోరుకుంటాడు. అయితే ఆ కోరిక తీరిన తర్వాత ఎలాంటి భయంకరమైన పరిణామాలు ఎదురయ్యాయనేదే ఈ చిత్రం.
దీనిపై ఆర్జీవీ ఎక్స్ (X) లో రాస్తూ, "అబ్సెషన్ సినిమా సాధించిన అద్భుత విజయానికి నాదొక చిన్న థియరీ ఉంది. ప్రతి మహిళలోనూ కొద్దిగా 'నిక్కీ' అనే క్యారెక్టర్ దాగి ఉంటుంది, ఆ విషయం ఆమెకు కూడా తెలుసు. అలాగే ప్రతి మగాడు తన భాగస్వామిలో ఆ నిక్కీని చూస్తాడు. అందుకే ఈ సినిమా ప్రేక్షకులకు అంతలా కనెక్ట్ అయింది" అని పేర్కొన్నారు.
సాంప్రదాయ ఎడిటింగ్ రూల్స్‌ను బద్దలు కొట్టారు
ఈ చిత్రానికి కర్రీ బార్కర్ దర్శకత్వం వహించడంతో పాటు కథ, ఎడిటింగ్ బాధ్యతలను కూడా ఆయనే చూసుకున్నారు. దర్శకుడి మేకింగ్ స్టైల్‌ను మెచ్చుకుంటూ వర్మ మరో పోస్ట్ పెట్టారు.
"నేను ఈ సినిమాతో పూర్తిగా ప్రేమలో పడ్డాను. పెద్ద స్టార్లు, భారీ బడ్జెట్ ఉంటేనే జనాలు థియేటర్లకు వస్తారనే భ్రమను ఈ సినిమా తుడిచేసింది. ఇందులో పెద్ద నటులు లేరు, విదేశీ లోకేషన్లు లేవు. టెక్నికల్ ఫీజులు తీసేస్తే కేవలం రూ. 70 లక్షల మేకింగ్ కాస్ట్‌తో ఈ సినిమా తీయవచ్చని అర్థమవుతోంది. కేవలం రెండు గదులున్న ఇల్లు, ఒక కారు, ఒక చిన్న స్టోర్.. ఈ మూడు లోకేషన్లలోనే సినిమా అంతా పూర్తి చేశారు" అని ఆర్జీవీ రాసుకొచ్చారు.
ఊపిరాడనంత టెన్షన్ పెట్టారు
దర్శకుడి ఎడిటింగ్ నైపుణ్యాన్ని కొనియాడుతూ, "ఆయన ఎడిటింగ్‌ను ఒక సాంకేతిక ప్రక్రియలా కాకుండా మానసిక ఆయుధంగా వాడుకున్నారు. సాధారణంగా హారర్ సినిమాల్లో వాడే జంప్ స్కేర్స్ కాకుండా, ఇంటర్వెల్ సీన్‌లో నిక్కీ ముఖాన్ని చాలా సేపు ఒకే షాట్‌లో చూపించడం వంటి లాంగ్ టేక్స్ ద్వారా ప్రేక్షకుల్లో ఊపిరాడనంత టెన్షన్ బిల్డ్ చేశారు" రామ్ గోపాల్ వర్మ చెప్పారు.
"సాంప్రదాయ ఎడిటింగ్ సూత్రాలను పక్కనబెట్టి, ప్రేక్షకుడు కూడా ఆ పాత్రలాగే అస్థిరంగా ఫీల్ అయ్యేలా సౌండ్ డిజైన్‌ను అద్భుతంగా ఉపయోగించారు" అని రామ్ గోపాల్ వర్మ విశ్లేషించారు. ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు డేవిడ్ ఫించర్ తరహాలో సింగిల్-సోర్స్ లైటింగ్‌ను ఈ సినిమాలో చాలా ఎఫెక్టివ్‌గా వాడారని ప్రశంసించారు.
ఆర్జీవీ వ్యాఖ్యలపై నెటిజన్ల ఫైర్
అయితే, ప్రతి మహిళలోనూ నిక్కీ ఉంటుంది అంటూ ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. సినిమాలో హీరో తన స్వార్థం కోసం ఒక శక్తి ఆధారిత బొమ్మ ద్వారా హీరోయిన్ ఇష్టంతో సంబంధం లేకుండా తన ప్రేమలో పడేలా బంధిస్తాడు. అంటే ఇక్కడ హీరోయిన్ బాధితురాలు. ఈ నేపథ్యం సరిగ్గా అర్థం చేసుకోకుండా వర్మ ట్వీట్ చేశారని నెటిజన్లు కౌంటర్లు ఇస్తున్నారు.
"అసలు ఈ సినిమా కథ నిక్కీ గురించి కాదు, థియేటర్‌లోకి వెళ్లేముందు మీరేం తాగారు రాము గారూ?" అని ఒకరు ప్రశ్నించగా.. "అంటే ప్రతి మగాడు ఆ సైకో హీరోలాగే ఉంటాడని మీ ఉద్దేశమా?" అని మరొకరు వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు.
ఇండస్ట్రీ పెద్దలను సైతం
నెటిజన్ల నుంచి విమర్శలు వస్తున్నప్పటికీ, హాలీవుడ్‌లో ఈ చిన్న చిత్రం సాధిస్తున్న కలెక్షన్ల సునామీ మాత్రం ఇండస్ట్రీ పెద్దలను సైతం ఆలోచనలో పడేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


