Highest Paid Actor: ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటుడిగా తెలుగు హీరో- బాహుబలి 2 బడ్జెట్ కంటే ఎక్కువగా!

Highest Paid Indian Actor Remuneration: ప్రస్తుతం ఎంత స్టార్‌డమ్ పెరిగితే అంతలా రెమ్యూనరేషన్ పెంచేస్తున్నారు సౌత్, బాలీవుడ్ హీరోలు. అయితే, బాలీవుడ్ ఖాన్స్, సూపర్ స్టార్ రజనీకాంత్ వంటి దిగ్గజాలను వెనక్కి నెట్టేసి మరి ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా తెలుగు హీరోగా రికార్డు కొట్టాడు.

Published on: Jun 7, 2026, 15:49:57 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Highest Paid Indian Actor Remuneration:

ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటుడిగా తెలుగు హీరో- బాహుబలి 2 బడ్జెట్ కంటే ఎక్కువగా!
ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటుడిగా తెలుగు హీరో- బాహుబలి 2 బడ్జెట్ కంటే ఎక్కువగా!

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో నటీనటుల పారితోషికాల రేంజ్ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. 90స్ కాలంలో మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమాకు కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న మొదటి భారతీయ నటుడిగా రికార్డు సృష్టించారు.

మూడు దశబ్దాలుగా

అప్పటి నుంచి టాలీవుడ్, బాలీవుడ్‌లలో హీరోల ఫీజులు పెరుగుతూనే వచ్చాయి. గత మూడు దశాబ్దాలుగా అత్యధిక పారితోషికం తీసుకునే హీరోల జాబితాలో బాలీవుడ్ ఖాన్ల హవానే ఎక్కువగా నడిచింది. అయితే, ఇటీవలి కాలంలో దక్షిణాది నుంచి వస్తున్న పాన్ ఇండియా చిత్రాల జోరుతో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి.

టాలీవుడ్, కోలీవుడ్ స్టార్లు గ్లోబల్ మార్కెట్‌ను శాసిస్తూ బాలీవుడ్ ప్రముఖులను సైతం వెనక్కి నెడుతున్నారు. ఈ క్రమంలోనే మన తెలుగు హీరో ఒకరు ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే భారతీయ నటుడిగా అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నారు.

'పుష్ప 2' తో సరికొత్త చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన బ్లాక్‌బస్టర్ చిత్రం 'పుష్ప 2: ది రూల్' ద్వారా భారతీయ సినిమా చరిత్రలోనే ఒకే మూవీకి అత్యధిక వసూళ్లు అందుకున్న నటుడిగా రికార్డు నెలకొల్పారు. ఈ సీక్వెల్ కోసం అల్లు అర్జున్ ముందస్తు పారితోషికంతో పాటు లాభాల్లో వాటా (ప్రాఫిట్ షేర్) ఒప్పందం చేసుకున్నారు.

ఈ లాభాల వాటాయే ఆయనను సీనియర్ సూపర్ స్టార్ల కంటే చాలా ముందంజలో నిలబెట్టింది. 'పుష్ప 2' ప్రపంచవ్యాప్తంగా రూ. 1700 కోట్లకు పైగా వసూలు చేసి, దాదాపు రూ. 600 కోట్లకు పైగా నికర లాభాలను ఆర్జించింది. ఈ లాభాల్లో అల్లు అర్జున్ సింహభాగాన్ని దక్కించుకున్నారు.

300 కోట్లకుపైగానే

ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం.. ముందస్తు ఫీజు, లాభాల వాటా అన్నీ కలుపుకుని ఈ సినిమాకు అల్లు అర్జున్ అందుకున్న మొత్తం రెమ్యూనరేషన్ రూ. 300 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. ఈ మొత్తం ఎన్నో భారీ భారతీయ చిత్రాల బడ్జెట్ కంటే ఎక్కువ కావడం గమనార్హం. ఉదాహరణకు ఒకప్పుడు దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన 'బాహుబలి 2' చిత్ర టోటల్ బడ్జెట్ రూ. 250 కోట్ల లోపే కావడం విశేషం.

ఖాన్లు, రజినీకాంత్‌లను సైతం వెనక్కి నెట్టి..

గతంలో అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్‌ల కాలం తర్వాత మిడ్-90స్ నుంచి బాలీవుడ్‌ను శాసిస్తున్న షారుఖ్, అమీర్, సల్మాన్ ఖాన్లు వరుస విజయాలతో తమ రెమ్యూనరేషన్స్ భారీగా పెంచుకుంటూ వచ్చారు.

లీడ్ హీరోలలో మొదటిసారి లాభాల్లో వాటా తీసుకునే పద్ధతిని షారుఖ్ ఖాన్ ప్రారంభించగా, రూ. 100 కోట్ల క్లబ్ మార్కును అమీర్ ఖాన్ దాటేశారు. 2010 చివరి నాటికి ఈ ముగ్గురు ఖాన్లు సినిమాకు రూ. 100 కోట్లకు పైగా వసూలు చేసే స్థాయికి చేరారు. 2023లో వచ్చిన 'పఠాన్', 'జవాన్' చిత్రాల విజయాలతో షారుఖ్ ఖాన్ తన పారితోషికాన్ని రూ. 200 కోట్లకు పైగా పెంచేశారు.

70 ఏళ్ల వయసులో

అయితే, ఈ బాలీవుడ్ రికార్డులను తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ బద్దలు కొట్టారు. తన 70 ఏళ్ల వయసులోనూ 'జైలర్' సినిమా సాధించిన రికార్డ్ కలెక్షన్ల కారణంగా ఆయన రూ. 250 కోట్లకు పైగా పారితోషికం అందుకుని ఇండియాలోనే నెంబర్ వన్‌గా నిలిచారు. కానీ, ఆ రికార్డు ఎక్కువ కాలం నిలవలేదు. కొన్ని నెలల వ్యవధిలోనే అల్లు అర్జున్ రూ. 300 కోట్ల మార్కుతో రజినీకాంత్ రికార్డును కూడా దాటేశారు.

అల్లు అర్జున్ తదుపరి చిత్రం ఏంటి?

గత ఐదేళ్ల కాలంలో అల్లు అర్జున్ కేవలం 'పుష్ప' సిరీస్ చిత్రాలపైనే పూర్తి దృష్టి పెట్టారు. పుష్ప జోరు తర్వాత ఆయన నటించనున్న తదుపరి చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

పుష్ప 2 ది రూల్ సినిమాలో అల్లు అర్జున్ స్టిల్
పుష్ప 2 ది రూల్ సినిమాలో అల్లు అర్జున్ స్టిల్

దీపికా పదుకొణె హీరోయిన్‌గా

స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రానున్న యాక్షన్ అడ్వెంచర్ చిత్రం 'రాకా'లో అల్లు అర్జున్ నటించనున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ భారీ పాన్-ఇండియా చిత్రం రాకా 2027 డిసెంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More