RGV: ఆ జంట అంటే ఇండస్ట్రీకి అసూయ, ఓడిపోవాలని ఎదురుచూస్తున్నారు- చీకటి కోణం బయటపెట్టిన రామ్ గోపాల్ వర్మ!

Ram Gopal Varma About Aditya Dhar Yami Gautam Success: దర్శకుడు ఆదిత్య ధర్ సృష్టించిన సంచలనం సినీ పరిశ్రమలో ప్రకంపనలు పుట్టిస్తోందని రామ్ గోపాల్ వర్మ విశ్లేషించారు. ఆదిత్య దెబ్బకు టాలీవుడ్‌లో బడ్జెట్లు పెరిగిపోతున్నాయని, అందుకే చాలామంది ఆయన పతనాన్ని కోరుకుంటున్నారని ఆర్జీవీ బాంబు పేల్చారు.

Published on: Mar 14, 2026, 09:15:54 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తనదైన శైలిలో హాట్ కామెంట్స్ చేశారు. స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’తో బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించిన దర్శకుడు ఆదిత్య ధర్‌పై ఆర్జీవీ ప్రశంసల వర్షం కురిపిస్తూనే, సినీ పరిశ్రమలోని చీకటి కోణాన్ని బయటపెట్టారు.

ఆ జంట అంటే ఇండస్ట్రీకి అసూయ, ఓడిపోవాలని ఎదురుచూస్తున్నారు- చీకటి కోణం బయటపెట్టిన రామ్ గోపాల్ వర్మ!
ఆ జంట అంటే ఇండస్ట్రీకి అసూయ, ఓడిపోవాలని ఎదురుచూస్తున్నారు- చీకటి కోణం బయటపెట్టిన రామ్ గోపాల్ వర్మ!

ఆదిత్య ధర్ ఎదుగుదల చూసి ఇండస్ట్రీలో చాలామంది అసూయతో రగిలిపోతున్నారని, ఆయన, అతని భార్య యామీ గౌతమ్ ఎప్పుడు ఫెయిల్ అవుతారా అని అందరూ కాచుకుని కూర్చున్నారని రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు.

"కథా గమనాన్ని మార్చేశారు.. అందుకే వారంటే ద్వేషం!"

ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆర్జీవీ మాట్లాడుతూ.. "ఆదిత్య ధర్ సినిమా బిజినెస్‌ను ఎంతలా ప్రభావితం చేశారో మీరు అర్థం చేసుకోవాలి. ఆయన వెండితెరపై కథ చెప్పే విధానాన్ని (గ్రామర్) పూర్తిగా మార్చేశారు" అని అన్నారు.

"హిందీలోనే కాదు, ఇకపై ఏ భాషలోనూ సినిమాలు పాత పద్ధతిలో ఉండవు. ఆదిత్య సృష్టించిన బెంచ్ మార్క్ చూసి తెలుగులో కూడా చాలా పెద్ద బడ్జెట్ యాక్షన్ సినిమాలు ప్రస్తుతం రీ-షూటింగ్ జరుపుకుంటున్నాయి. దీనివల్ల నిర్మాతలపై కోట్ల రూపాయల భారం పడుతోంది. అందుకే ఇండస్ట్రీకి ఆయనంటే కోపం. అందరినీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు లాగారు, దానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది" అని ఆర్జీవీ విశ్లేషించారు.

జంటగా జాగ్రత్తగా ఉండాలి!

ఆదిత్య భార్య, నటి, ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ యామీ గౌతమ్ గురించి కూడా వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘హక్’ సినిమాతో యామీ నటిగా తన విశ్వరూపం చూపించారని, ఆ దంపతులు ఇప్పుడు ఎంతో జాగ్రత్తగా అడుగులు వేయాలని సూచించారు రామ్ గోపాల్ వర్మ.

"ఆదిత్య ధర్, యామీ గౌతమ్ జంట ఇప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే, వారు ఎప్పుడు పొరపాటు చేస్తారా, ఎప్పుడు కింద పడతారా అని చిత్ర పరిశ్రమ మొత్తం వేచి చూస్తోంది" అని ఆర్జీవీ హెచ్చరించారు. అంటే దర్శకుడిగా ఆదిత్య ధర్, నటిగా యామీ గౌతమ్ ఇద్దరు మంచి సక్సెస్‌లో ఉన్నారు. వారెప్పుడు ఫెయిల్ అవుతారా అని అసూయతో ఇండస్ట్రీ వేచి చూస్తుందన్న అర్థంలో ఆర్జీవీ అలా కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది.

'ధురంధర్ 2' వర్సెస్ 'ఉస్తాద్ భగత్ సింగ్'

ఇదిలా ఉంటే, ఆదిత్య ధర్ రూపొందిస్తున్న ‘ధురంధర్ 2’ (ధురంధర్: ది రివెంజ్) కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రియులు కళ్లల్లో వత్తులు వేసుకుని చూస్తున్నారు. రణ్‌వీర్ సింగ్ గూఢచారిగా నటిస్తున్న ఈ సినిమా మొదటి భాగం ఏకంగా రూ. 1300 కోట్ల వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది.

మార్చి 19న విడుదల కానున్న ధురంధర్ 2 సినిమా సుమారు నాలుగు గంటల (3 గంటల 55 నిమిషాలు) నిడివితో విడుదల కానుంది. అయితే, ధురంధర్ ది రివేంజ్ సినిమాకు యశ్ మూవీ టాక్సిక్ నుంచి బాక్సాఫీస్ పోటీ తప్పింది. కానీ, ఇప్పుడు టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నుంచి మాత్రం ధురంధర్ 2కి గట్టి పోటీ ఎదురవుతోంది.

అసలైన యుద్ధం

హరీష్ శంకర్ దర్శకత్వంలో వహించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా అదే రోజున (మార్చి 19) థియేటర్లలోకి రానుంది. మార్చి 18 సాయంత్రమే ఈ రెండు సినిమాలకు పెయిడ్ ప్రివ్యూలు పడనుండటంతో బాక్సాఫీస్ వద్ద అసలైన యుద్ధం మొదలుకానుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More