Sai Pallavi: ఆ హాలీవుడ్ క్లాసిక్ గుర్తొచ్చింది.. అందుకే ఏక్ దిన్ చేశా.. సెట్ కాలేదు.. బాలీవుడ్ డెబ్యూపై సాయి పల్లవి
Sai Pallavi: సౌత్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న సాయి పల్లవి ఇప్పుడు బాలీవుడ్ లోనూ అడుగుపెట్టింది. రొమాంటిక్ డ్రామా ‘ఏక్ దిన్’తో హిందీలో డెబ్యూ చేసింది. తాజాగా ఈ మూవీ చేయడానికి గల కారణాన్ని సాయి పల్లవి వెల్లడించింది.
Sai Pallavi: నేచురల్ స్టార్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సౌత్ ఇండియాలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ స్టార్ హీరోయిన్.. తాజాగా 'ఏక్ దిన్' (Ek Din) సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. గత శుక్రవారమే (మే 1) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ రొమాంటిక్ డ్రామాకు బాక్సాఫీస్ దగ్గర మిక్స్ డ్ రియాక్షన్ వచ్చింది.

సాయి పల్లవి కామెంట్లు
ఏక్ దిన్ మూవీ చేయడంపై సాయి పల్లవి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది. మూవీలో తన కో-స్టార్ జునైద్ ఖాన్‌తో కలిసి జరిపిన చిట్ చాట్‌లో సాయి పల్లవి ఈ ప్రాజెక్ట్‌ను ఎందుకు ఎంచుకుందో వివరించింది. జునైద్ ఖాన్‌తో మాట్లాడిన వీడియోను 'అమీర్ ఖాన్ టాకీస్' యూట్యూబ్ ఛానెల్‌లో విడుదల చేశారు. ఇప్పటికే పలు భాషల్లో భారీ చిత్రాలు చేస్తున్న మీరు, ఈ చిన్న సినిమాకు ఎలా ఓకే చెప్పారు? అని జునైద్ అడగగా సాయి పల్లవి ఆసక్తికర సమాధానం ఇచ్చింది.
హాలీవుడ్ క్లాసిక్
"నేను ఎప్పుడూ సినిమా ఎంత భారీ స్థాయిలో ఉందనేది చూడను. ఆ సమయంలో నేను చాలా బరువైన ఎమోషనల్ కథలు చేస్తున్నా. అందుకే షూటింగ్ సమయంలోనూ, ఆ తర్వాత కూడా నాపై ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా ఉండేలా ఒక లైట్ హార్టెడ్ కథ చేయాలనుకున్నా.
ఈ స్క్రిప్ట్ వినగానే నాకు 1995 నాటి హాలీవుడ్ క్లాసిక్ 'బిఫోర్ సన్‌రైజ్' (Before Sunrise) గుర్తొచ్చింది. నాకు ఆ సినిమా అంటే చాలా ఇష్టం. ఈ కథ కూడా అదే జోనర్‌లో ఉంటుందని భావించి ఓకే చెప్పా" అని సాయి పల్లవి తెలిపింది.
మిస్‌కాస్ట్ అనుకున్నా
ఈ ఏక్ దిన్ ప్రాజెక్ట్‌లోకి రావడానికి ప్రధాన కారణం అమీర్ ఖాన్ అని సాయి పల్లవి స్పష్టం చేసింది. అమీర్ ఖాన్ ఎంచుకునే వైవిధ్యమైన సినిమాలు, ఆయన ప్రయాణాన్ని తాను ఎప్పుడూ ఫాలో అవుతుంటానని ఆమె తెలిపింది. అయితే మొదట్లో ఏక్ దిన్ లో పాత్రకు తాను సెట్ కానేమోనని సాయి పల్లవి భయపడ్డానని చెప్పింది.
"సినిమా ప్రీమియర్ చూశాక.. ఈ పాత్రకు నేను సరిపోనని, నన్ను మిస్‌కాస్ట్ చేశారని అమీర్ ఖాన్‌తో చెప్పా. కొంచెం ఫ్లంబాయన్స్ ఉన్న కొత్త వ్యక్తి చేసి ఉండాల్సింది" అని సాయి పల్లవి వెల్లడించింది. మూవీలో క్యారెక్టర్ కు సాయి పల్లవి సెట్ అయిందని జునైద్ చెప్పాడు.
ఏక్ దిన్ గురించి
'ఏక్ దిన్' 2016 నాటి థాయ్ చిత్రం 'వన్ డే'కి రీమేక్. ఇది తన సహోద్యోగిని ప్రేమించే ఒక యువకుడి కథ. కానీ తన ఫీలింగ్స్ ను బయటకు చెప్పేంత ధైర్యం ఉండదు. కానీ అనుకోకుండా హీరోయిన్ కు వచ్చిన ఒక సమస్య కారణంగా అతను ఒక రోజంతా ఆమెతో కలిసి ఉంటాడు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


