RGV: సెన్సార్ బోర్డును ఎత్తి అవతల పడేయండి.. ఓటు వేయడానికి లేని అభ్యంతరం సినిమా చూడటానికి ఎందుకు: ఆర్జీవీ సంచలన ట్వీట్
RGV: రామ్ గోపాల్ వర్మ మరోసారి సెన్సేషనల్ ట్వీట్ చేశాడు. సెన్సార్ బోర్డును ఎత్తి అవతల పారేయండి అని డిమాండ్ చేశాడు. 18 ఏళ్ల వయసులో ఓటేయడానికి లేని అభ్యంతరం.. సినిమా చూడటానికి ఎందుకని ప్రశ్నించాడు.
RGV: సెన్సార్ బోర్డును పూర్తిగా రద్దు చేయాలంటూ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. స్మార్ట్‌ఫోన్లు, గ్లోబల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ విరివిగా వాడుతున్న ఈ డిజిటల్ యుగంలో ప్రేక్షకులను పసిపిల్లల్లా భావించి సీన్లు కట్ చేయడం పెద్ద జోక్ అంటూ తన ఎక్స్ అకౌంట్‌లో సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

సెన్సార్ బోర్డుపై ఆర్జీవీ ఫైర్.. అసలు కారణాలు ఇవే
ఆర్జీవీ కెరీర్ మొదటి నుంచి సెన్సార్ బోర్డుతో వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. 'శివ', 'సత్య' కాలం నాటి రస్టిక్ వయొలెన్స్ నుంచి రీసెంట్ గా వచ్చిన పొలిటికల్ డ్రామాల వరకు ఆయన ప్రతి సినిమా సెన్సార్ కట్స్ ఎదుర్కొంది. అందుకే ఆయన ఈసారి ఏకంగా సెన్సార్ వ్యవస్థ ఉనికినే ప్రశ్నిస్తూ గట్టిగా మాట్లాడారు.
దేశ భవిష్యత్తును మార్చే లీడర్లను ఎన్నుకోవడానికి 18 ఏళ్ల వయసున్న యువతకు ఓటు హక్కు ఇస్తున్నప్పుడు, వాళ్లు ఏ సినిమా చూడాలో డిసైడ్ చేసే హక్కు ఎందుకు లేదని ఆర్జీవీ ప్రశ్నించారు. ఒక అడల్ట్ వ్యాపారాలు చేయగలడు, కుటుంబాన్ని నడపగలడు కానీ థియేటర్లలో ఏ సీన్ చూడాలో నిర్ణయించుకోలేడా అని ఎద్దేవా చేశారు. ఇది సమాజానికి రక్షణ కల్పించడం కాదు, ప్రజల తెలివితేటలను అవమానించడమేనని మండిపడ్డారు.
ఏది చూడాలో ఏది చూడకూడదో సెన్సార్ బోర్డులోని ఓ సభ్యుడు చెప్పాలా.. అయినా ఆ బోర్డులోని వాళ్లకు ఉన్న అర్హత ఏంటి అని కూడా ఆర్జీవీ ప్రశ్నించాడు.
టెక్నాలజీ యుగంలో కట్స్ విధించడం హాస్యాస్పదం
ప్రస్తుతం ఇంటర్నెట్ లో దారుణమైన క్రైమ్ న్యూస్, వైల్డ్ కంటెంట్ అందరికీ ఫ్రీగా దొరుకుతున్నప్పుడు కేవలం సినిమాలపైనే ఎందుకు నిషేధాలు విధిస్తున్నారని ఆర్జీవీ నిలదీశారు. థియేటర్లలో సీన్లు కట్ చేయడం వల్ల లాభం లేదని, ఎలాగూ అన్‌కట్ వెర్షన్స్ కొన్ని గంటల్లోనే టెలిగ్రామ్, టొరెంట్స్ లోకి వచ్చేస్తాయని గుర్తుచేశారు.
దీనికి ఉదాహరణగా 'అబ్సెషన్' (Obsession) సినిమాలో సెన్సార్ కట్ చేసిన హెడ్ బ్యాంగింగ్ సీన్‌ను ప్రస్తావించారు. థియేటర్లలో చూసిన వాళ్లకంటే ఆ సీన్‌ను ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో 10 రెట్లు ఎక్కువ మంది చూశారని వెల్లడించారు. సెన్సార్ వల్ల కంటెంట్ ఆగిపోదు, పైగా దానికి డిమాండ్ ఇంకా పెరుగుతుందని చెప్పారు.
ఇండస్ట్రీ అంతా ఒక్కటవ్వాలి
సినిమా అనేది మేకర్ పాయింట్ ఆఫ్ వ్యూ అని, దాన్ని చూసి నచ్చకపోతే తిరస్కరించే హక్కు ఆడియన్స్‌కు ఉందన్నారు. అంతే కానీ క్రియేటివిటీ తెలియని కొందరు అధికారుల ముందు ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు మోకాళ్లపై వంగి కాంప్రమైజ్ అవ్వొద్దని పిలుపునిచ్చారు. ఇలా ఇండస్ట్రీ లొంగిపోవడం వల్లే వాళ్లు మరింత రెచ్చిపోతున్నారని విమర్శించారు.
సెన్సార్ బోర్డును పూర్తిగా రద్దు చేసి, కేవలం సినిమా కంటెంట్ ఏంటో క్లియర్ రేటింగ్స్ ఇస్తే చాలని, చూడాలా వద్దా అనేది ఆడియన్స్ ఇష్టానికే వదిలేయాలని ఆర్జీవీ డిమాండ్ చేశారు. ఇండస్ట్రీ అంతా కలిసి దీనిపై కోర్టుకు వెళ్లాలని, పబ్లిక్ లో పెద్ద ఎత్తున చర్చ జరపాలని కోరారు. #BanTheCensor హాష్ ట్యాగ్ తో ఆయన చేసిన ఈ కామెంట్స్ పై ఇండస్ట్రీలో చర్చ మొదలైంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


