Sign in

RGV Satluj Review: ఇది సినిమా కాదు.. ఎప్పటికీ మానని గాయం.. అతనిలాగా ఈ మూవీని చంపకండి: ఆర్జీవీ సట్లెజ్ మూవీ రివ్యూ

RGV Satluj Review: ఓటీటీలోకి అడుగుపెట్టిన 48 గంటల్లోనే నిషేధానికి గురైన సట్లెజ్ మూవీపై రామ్ గోపాల్ వర్మ ఇచ్చిన రివ్యూ సంచలనం రేపుతోంది. ఇది సినిమా కాదు ఎప్పటికీ మానని గాయం అంటూ ప్రశంసించిన అతడు.. ఇది అందరూ చూసి తెలుసుకోవాల్సిన సినిమా అని అన్నాడు.

Published on: Jul 7, 2026, 14:03:25 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

RGV Satluj Review: సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (RGV) ఎవరినైనా పొగిడాడంటే అందులో కచ్చితంగా ఏదో మ్యాటర్ ఉంటుంది. రీసెంట్ గా జీ5 (ZEE5) ఓటీటీలో రిలీజై రెండు రోజులకే బ్యాన్ అయిన దిల్జిత్ దోసాంజ్ 'సట్లెజ్' (Satluj) మూవీపై ఆర్జీవీ చేసిన రివ్యూ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సినిమాను ఎన్ కౌంటర్ చేయొద్దంటూ ఆయన చేసిన అప్పీల్ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

RGV Satluj Review: ఇది సినిమా కాదు.. ఎప్పటికీ మానని గాయం.. అతనికి జరిగిందే ఈ మూవీకి చేయకండి: ఆర్జీవీ సట్లెజ్ మూవీ రివ్యూ
RGV Satluj Review: ఇది సినిమా కాదు.. ఎప్పటికీ మానని గాయం.. అతనికి జరిగిందే ఈ మూవీకి చేయకండి: ఆర్జీవీ సట్లెజ్ మూవీ రివ్యూ

125 కట్స్ నుంచి ఓటీటీ బ్యాన్ వరకు

పంజాబ్ లో జరిగిన రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా డైరెక్టర్ హనీ ట్రెహాన్ తెరకెక్కించిన ఈ సట్లెజ్ మూవీ ముందుగా 'పంజాబ్ 95' టైటిల్ తో అనౌన్స్ అయింది. సెన్సార్ బోర్డ్ (CBFC) ఏకంగా 125 కట్స్ చెప్పడంతో థియేట్రికల్ రిలీజ్ వదిలేసి, 'సట్లెజ్' పేరుతో గత శుక్రవారం జీ5 ఓటీటీలోకి సైలెంట్ గా తెచ్చారు. కానీ ఆదివారం సాయంత్రానికే ఈ మూవీని ఇండియాలో బ్యాన్ చేసి యాప్ నుంచి తొలగించడంతో పెద్ద వివాదం మొదలైంది.

మంగళవారం (జులై 7) నాడు తన ఎక్స్ అకౌంట్ లో ఈ సినిమాపై రామ్ గోపాల్ వర్మ ఒక రేంజ్ లో రివ్యూ ఇచ్చాడు. "సట్లెజ్ ఒక సినిమా కాదు.. ఎప్పటికీ మానని ఒక లోతైన గాయం. మన దేశ చరిత్రలో జరిగిన ఒక చీకటి అధ్యాయంలోని నిజాలను ఇది తవ్వి తీసింది" అని వర్మ ఎమోషనల్ అయ్యాడు.

దిల్జిత్ యాక్టింగ్ అదుర్స్..

దిల్జిత్ నటన గురించి చెబుతూ.. ఎలాంటి ఓవర్ బిల్డప్, ఓవరాక్షన్ హీరోయిజం లేకుండా చాలా సైలెంట్ గా క్యారెక్టర్ లోని తీవ్రతను చూపించాడని పొగిడాడు. కేవలం ఒక లెడ్జర్, తన మనస్సాక్షినే ఆయుధాలుగా చేసుకుని దిల్జిత్ అదరగొట్టాడన్నాడు. ఇక అర్జున్ రాంపాల్ క్యారెక్టర్ లోని నైతిక పతనం, వ్యవస్థాగత రాజకీయాలు చాలా రియలిస్టిక్ గా ఉన్నాయంటూ వర్మ కితాబిచ్చాడు.

ఎక్కడా ఓవర్ గా సెన్సేషనలైజ్ చేయకుండా డైరెక్టర్ హనీ ఈ మూవీని ఒక స్లో బర్న్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లా నడిపించిన విధానం సూపర్ అని మెచ్చుకున్నాడు. ప్రభుత్వ ఫైల్స్, శ్మశానవాటిక రికార్డుల ఆధారంగా నిజాలను చాలా బలంగా చూపించాడని, డైరెక్టర్ సంయమనం వల్లే ఆ క్రూరత్వం ఆడియన్స్ ను అంత గట్టిగా తాకుతుందని వర్మ విశ్లేషించాడు.

జస్వంత్ సింగ్ ఖాల్రాలాగా సినిమాను చంపేయకండి

ఒక ప్రజాస్వామ్య దేశం తన సొంత ప్రజలనే ఎలా నాశనం చేస్తుంది, ఆ తర్వాత సాక్ష్యాలను ఎలా చెరిపేస్తుంది అనే పాయింట్ ను కళ్లకు కట్టినట్లు చూపించారని వర్మ అన్నాడు. అధికారంలో ఉన్నవాళ్లను ఇబ్బంది పెట్టినప్పుడే ఒక నిజమైన కళకు సార్థకత దక్కుతుందని, సట్లెజ్ ఆ పని కరెక్ట్ గా చేసిందన్నాడు.

మెయిన్ స్ట్రీమ్ సినిమా అంతా పాప్ కార్న్ ఎంటర్టైన్మెంట్ వెంట పడుతున్న ఈ రోజుల్లో సట్లెజ్ లాంటి నిజాయితీ ఉన్న సినిమాలు రావడం గ్రేట్ అన్నాడు వర్మ. "సినిమాలోని బాధితుల లాగా ఈ సినిమాను ఎన్ కౌంటర్ చేయకండి. జస్వంత్ సింగ్ ఖాల్రాకు పట్టిన గతే ఈ సట్లెజ్ కు పట్టనివ్వకండి" అని పవర్ లో ఉన్నవాళ్లకు వర్మ రిక్వెస్ట్ చేశాడు.

"నిజాలను దాచాలని చూసినప్పుడే అవి మరింత బలంగా తాకుతాయి" అంటూ అయాన్ రాండ్ కోట్ ను తన ట్వీట్ కు యాడ్ చేశాడు. పంజాబ్ లో 25 వేల మందికి పైగా అక్రమంగా దహనం చేశారని బయటపెట్టిన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ జస్వంత్ సింగ్ ఖాల్రా కథే ఈ సట్లెజ్. ప్రస్తుతం ఈ మూవీ ఇండియాలో స్ట్రీమింగ్ కావడం లేదు కానీ.. విదేశాల్లోని జీ5 యాప్ లో అందుబాటులో ఉంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More