OTT: ఓటీటీలో రెండేళ్లుగా అదరగొడుతోన్న తెలుగు మైథలాజీ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్- పదేళ్లపాటు రాసిన కథ- వేదాలు, ట్విస్టులు
Aindham Vedham OTT Review And Streaming: పౌరాణిక రహస్యాలు, ఏఐ కాన్సెప్ట్‌తో రూపుదిద్దుకున్న సస్పెన్స్ మైండ్ బ్లాస్టింగ్ వెబ్ సిరీస్ ఐందం వేదం ఓటీటీలో రెండేళ్లుగా అదరగొడుతోంది. వేదాలు, సైన్స్, ట్విస్టులతో సాగే ఐందం వేదం తెలుగులోనూ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. మరి అదెక్కడో ఎక్కడ తెలుసుకుందాం.
Aindham Vedham OTT Review And Release: ఓటీటీ వేదికలపై క్రైమ్, కామెడీ, యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలకు కొదవలేదు. అయితే, ఆధ్యాత్మికతకు ఆధునిక సైన్స్‌ను జోడించి తీసే మిస్టరీ థ్రిల్లర్లకు ఉండే క్రేజే వేరు. ఇటీవల కాలంలో 'కార్తికేయ 2', 'కల్కి 2898 ఏడీ' వంటి చిత్రాలు దైవిక, పురాణ అంశాలకు శాస్త్రీయ దృక్పథాన్ని ముడిపెట్టి బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాయి.

వేదాలు, ఏఐ, మైథాలజీ అంశాలు
సరిగ్గా ఇదే తరహా కాన్సెప్ట్‌తో ఓటీటీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది 'ఐందం వేదం' (Aindham Vedham) వెబ్ సిరీస్. పురాణ గ్రంథాలు, వేదాలు, సైన్స్ ఫిక్షన్, ఏఐ, మిస్టరీ, థ్రిల్లర్ వంటి అంశాలతో తెరకెక్కిన ఐందం వేదం ఓటీటీలో రెండేళ్ల క్రితం నేరుగా రిలీజ్ అయింది. రెండేళ్లుగా ఓటీటీలో సూపర్ క్రేజ్ తెచ్చుకుంటూ ఇప్పటికీ అట్రాక్ట్ చేస్తోంది ఈ ఓటీటీ సిరీస్.
వారణాసి నుంచి మొదలైన ప్రాచీన మిస్టరీ
కథ విషయానికి వస్తే.. అను (సాయి ధన్షిక) అనే ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, తన తల్లి అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి ఆధ్యాత్మిక నగరమైన వారణాసికి వెళ్తుంది. అక్కడ ఆమెకు ఒక అపరిచితుడు పరిచయమై, పురాతన లోహపు పెట్టెను ఇస్తాడు.
తమిళనాడులోని అయనగరపురం అనే గ్రామంలో ఉన్న పూజారికి దానిని భద్రంగా అందించాలని కోరతాడు. అయితే అను ఆ పెట్టెను అక్కడకు చేర్చేలోపే ఆ పూజారి వింత పరిస్థితుల్లో మరణిస్తాడు. మరోవైపు సరిగ్గా వెయ్యి సంవత్సరాల తర్వాత ఖగోళంలో ఒకే సరళరేఖపైకి నాలుగు గ్రహాలు వచ్చే అరుదైన విరుద్ధ సంఘటన చోటుచేసుకుంటుంది.
ఈ మిస్టరీతో తనకు సంబంధం లేదని వెనక్కి తగ్గాలని అను భావించినప్పటికీ, పరిస్థితులు ఆమెను మరింత ఊబిలోకి నెడతాయి. అసలు ఆ పెట్టె వెనుకున్న రహస్యమేమిటి? గ్రహాల కదలికలకు, ఈ చావులకు ఉన్న సంబంధం ఏంటీ అనేది మిగతా కథ.
ప్రాచీన వేదాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మేళనం
సీనియర్ దర్శకుడు నాగా ఈ సిరీస్‌ను అత్యంత ఉత్కంఠభరితంగా మలిచారు. దాదాపు దశాబ్ద కాలం (పదేళ్లు) పాటు ఈ కథపై పరిశోధన చేసి, పురాతన కాలం నాటి శాస్త్రజ్ఞానం, నేటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను ముడిపెడుతూ స్క్రీన్‌ప్లే సిద్ధం చేశారు.
వారణాసి ఘాట్‌ల ఆధ్యాత్మిక వాతావరణం, తమిళనాడు ప్రాచీన ఆలయాల ప్రాంగణాలను కథతో మిళితం చేసిన విధానం కంటికి ఇంపుగా నిలుస్తుంది. ప్రతి ఎపిసోడ్‌లోనూ వచ్చే ఊహించని మలుపులు ప్రేక్షకులను చివరిదాకా కట్టిపడేస్తాయి. ప్రాచీన వేదజ్ఞానం, ఆధునిక సైన్స్ మధ్య నడిచే సైద్ధాంతిక చర్చలు ఆలోచింపజేస్తాయి.
తారాగణం నటన, నిర్మాణ విలువలు
'కబాలి' చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న సాయి ధన్షిక ఈ సిరీస్‌తో ఓటీటీలోకి అరంగేట్రం చేశారు. అను పాత్రలో ఆమె ఒదిగిపోయిన తీరు, ఇన్వెస్టిగేషన్ సీన్లలో కనబరిచిన పక్వత ఆకట్టుకుంటాయి. సంతోష్ ప్రతాప్, వివేక్ రాజగోపాల్, వై.జి. మహేంద్రన్, దేవదర్శిని, పొన్‌వణ్ణన్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
సినిమాటోగ్రఫీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ షాట్లు, పురాతన ప్రదేశాల మూడ్‌ను చాలా చక్కగా ఆవిష్కరించాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సీట్ ఎడ్జ్ థ్రిల్‌ను ఇవ్వడంలో కీలక పాత్ర పోషించింది. ఐఎమ్‌డీబీ (IMDb)లో 7.1/10 రేటింగ్ సాధించిన ఐందం వేదం ఓటీటీలో అదరగొడుతోంది.
ఎక్కడ చూడవచ్చు?
జీ5 (ZEE5) ప్లాట్‌ఫామ్‌లో ఐందం వేదం ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. మొత్తం 8 ఎపిసోడ్లుగా ఉన్న ఈ సిరీస్ తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో ఓటీటీ రిలీజ్ అయింది. ప్రతి ఎపిసోడ్ 40 నుంచి 50 నిమిషాల నిడివితో సాగుతుంది. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారు వీకెండ్‌లో ఓటీటీలో చూసేందుకు ఇదొక సూపర్ ఆప్షన్.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


