OTT Malayalam: ఓటీటీలో చూడాల్సిన ది బెస్ట్ 7 మలయాళ థ్రిల్లర్స్- అన్నీ తెలుగులోనే- ఒక్కోటి ఒక్కోరం- హాట్‌స్టార్ టు ప్రైమ్
Must Watch Best 7 OTT Malayalam Thrillers In Telugu: వైవిధ్యమైన కథనాలు, ఊహించని సస్పెన్స్‌తో మలయాళ చిత్ర పరిశ్రమ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ ఏడాది ఐఎమ్‌డీబీ (IMDb)లో అగ్రస్థానంలో నిలిచి, వీక్షకులను మంత్రముగ్ధులను చేసిన ది బెస్ట్ 7 ఓటీటీ మలయాళ థ్రిల్లర్ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
Must Watch Best 7 OTT Malayalam Thrillers In Telugu: మలయాళ చిత్ర పరిశ్రమ పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికీ గుర్తుకువచ్చేది వినూత్న కథలు, ఊహకందని సస్పెన్స్ ఎలిమెంట్స్. భారీ బడ్జెట్ హంగామా కంటే కథలోని బలాన్నే నమ్ముకునే మాలీవుడ్ సినిమాలు మన తెలుగు ఓటీటీ ప్రేక్షకులను కూడా విపరీతంగా అలరిస్తున్నాయి.

ది బెస్ట్ 7 మలయాళ థ్రిల్లర్స్
డిజిటల్ విప్లవం పుణ్యమా అని ఓటీటీ స్ట్రీమింగ్ వేదికల ద్వారా కేరళ సినిమాలు నేరుగా మన ఇళ్లల్లోకి వచ్చేస్తున్నాయి. ఈ ఏడాది అంటే 2026లో విడుదలైన చిత్రాల్లో ఐఎమ్‌డీబీ (IMDb) వేదికగా అత్యుత్తమ రేటింగ్ సాధించి, ప్రశంసలు అందుకుని, ఓటీటీలో చూడాల్సిన ది బెస్ట్ 7 మలయాళ థ్రిల్లర్ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.
భావోద్వేగాల మేళవింపు, ఊహకందని సస్పెన్స్ థ్రిల్లర్లు
1. బాలన్ ది బాయ్ (IMDb Rating: 8.1)
జైల్లో జన్మించిన ఒక చిన్నారి కథ ఇది. తల్లితో కలిసి బయటకు వచ్చాక కొత్త పేరుతో, కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన ఆ బాలుడు ఊహించని రీతిలో తల్లికి దూరమవుతాడు. కంటిపాపలా చూసుకోవాల్సిన వయసులో ఆ పసివాడు పడే వేదన, క్లైమాక్స్ సన్నివేశాలు ప్రతి ఒక్కరి చేత కన్నీళ్లు పెట్టిస్తాయి. ఈ ఏడాది అత్యంత ఎమోషనల్, సస్పెన్స్, మిస్టరీ చిత్రంగా నిలిచిన ది బాలన్ జీ5 (ZEE5) ఓటీటీలో తెలుగులో కూడా అందుబాటులో ఉంది.
2. భరతనాట్యం 2 (IMDb Rating: 7.6)
తొలి భాగానికి లభించిన ఆదరణతో రూపుదిద్దుకున్న భరతనాట్యం సీక్వెల్ సినిమా కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇద్దరు భార్యలున్న ఒక వ్యక్తి మరణం తర్వాత కుటుంబంలో బయటపడే రహస్యాలు, ఆస్తి వివాదాలు కథకు ప్రధాన బలం. ఒక హత్యను కప్పిపుచ్చేందుకు చేసే ప్రయత్నాలు నవ్వులు పూయిస్తూనే, తీవ్రమైన సస్పెన్స్‌కు గురిచేస్తాయి. నెట్‌ఫ్లిక్స్‌లో భరతనాట్యం 2 ఓటీటీ రిలీజ్ అయింది. తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.
3. సంభవం అధ్యాయం ఒన్ను (IMDb Rating: 7.3)
ఒక వింతైన అడవి నేపథ్యంతో తెరకెక్కిన సస్పెన్స్ మిస్టరీ సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. ఆ అడవిలోకి వెళ్లిన పోలీసులు, ప్రజలు కాలంలో వెనక్కి వెళ్లడం లేదా శాశ్వతంగా మాయమైపోవడమనే థ్రిల్లింగ్ కథగా ఈ సినిమా సాగుతుంది. చివరికి వెలుగు చూసే సత్యాలు విస్తుపోయేలా చేస్తాయి. మిస్టరీ డ్రామాలను ఇష్టపడేవారు జియోహాట్‌స్టార్‌లో ఈ చిత్రాన్ని తెలుగులో చూడవచ్చు.
ఇన్వెస్టిగేషన్ డ్రామాలు, పవర్‌ఫుల్ యాక్షన్ చిత్రాలు
4. దృఢం (IMDb Rating: 7.0)
మలయాళంలో వచ్చిన అత్యుత్తమ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్లలో ఇది ఒకటి. ఒక నేరం వెనుక ఉన్న కుట్రను ఛేదించడానికి ఓ పోలీస్ అధికారి చేసే పోరాటమే ఈ సినిమా కథ. ప్రణాళికాబద్ధంగా సాగే కథనం వీక్షకులను చివరివరకు కట్టిపడేస్తుంది. ఈ సినిమా జియోహాట్‌స్టార్ వేదికగా తెలుగులోనూ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
5. నారివెట్ట (IMDb Rating: 8.1)
రాజకీయ పరిణామాలు, పోలీస్ వ్యవస్థ చుట్టూ తిరిగే పవర్‌ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. సమాజంలోని అన్యాయాలను ఎండగట్టే అధికారి పాత్రతో ఈ సినిమా కథ సాగుతుంది. మాస్ ఎలిమెంట్స్‌తో పాటు చక్కని కథనం ఉన్న ఈ చిత్రాన్ని సోనీ లివ్ (SonyLIV) ఓటీటీలో తెలుగులోనూ చూడవచ్చు.
6. చిన్న చిన్న ఆశై (IMDb Rating: 6.7)
రక్తపాతం, క్రైమ్ థ్రిల్లర్లకు దూరంగా మనసును తాకే ఫీల్ గుడ్ చిత్రమిది. సీనియర్ హీరోయిన్ మధుబాల ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా జీవితంలో చిన్న చిన్న సంతోషాల విలువను గుర్తుచేస్తుంది. మనసుకు ఆహ్లాదాన్ని ఇచ్చే ఈ చిత్రాన్ని జియోహాట్‌స్టార్‌లో తెలుగులో ఓటీటీ రిలీజ్ అయింది.
ఫ్రాంచైజీ, సైకలాజికల్ డ్రామా
7. దృశ్యం 3 (IMDb Rating: 6.6)
మోహన్ లాల్ ఐకానిక్ ఫ్రాంచైజీ 'దృశ్యం' మూడో భాగం థ్రిల్లింగ్ అనుభూతిని ఇస్తుంది. మునుపటి భాగాలతో పోలిస్తే ఐఎమ్‌డీబీలో కాస్త తక్కువ రేటింగ్ వచ్చినప్పటికీ, జార్జ్‌కుట్టి తెలివితో చేసే ప్లానింగ్ అభిమానులను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
వీకెండ్‌కి డిఫరెంట్ థ్రిల్
కథా బలమున్న సినిమాలను ఆదరించే తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రాలు మంచి వినోదాన్ని అందిస్తాయి. వీకెండ్‌లో డిఫరెంట్ సినిమా అనుభూతిని పొందాలనుకుంటే తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతోన్న ఈ టాప్ 7 మలయాళ థ్రిల్లర్స్‌ను ఎంచక్కా చూడొచ్చు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


