OTT Telugu Today: ఇవాళ లయ ఓటీటీ ఎంట్రీ- శాడిస్ట్ కోడలిగా సీనియర్ హీరోయిన్, లవర్ బాయ్‌గా సుబ్బరాజు- మనసుకు హత్తుకునే కథ!

Laya Subbaraju Ala Jarigindi OTT Streaming Today: సీనియర్ హీరోయిన్ లయ, నటుడు సుబ్బరాజు కలిసి జంటగా నటించిన లేటెస్ట్ తెలుగు ఫీల్ గుడ్ ఎమోషనల్ సినిమా 'అలా జరిగింది'. లయ శాడిస్ట్ కోడలిగా నటించిన అలా జరిగింది ఓటీటీలో నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మరి అలా జరిగింది ఓటీటీ రిలీజ్ ఎక్కడో తెలుసుకుందాం.

Published on: Sep 20, 2026, 12:57:56 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Laya Subbaraju Ala Jarigindi OTT Release Today: ఒకప్పుడు టాలీవుడ్ హోమ్లీ హీరోయిన్‌గా కుటుంబ కథా చిత్రాలతో ప్రేక్షకుల మనసు దోచుకున్న బ్యూటిఫుల్ నటి లయ మళ్లీ సరికొత్త డిజిటల్ ప్రయాణాన్ని ప్రారంభించింది.

ఇవాళ లయ ఓటీటీ ఎంట్రీ- శాడిస్ట్ కోడలిగా సీనియర్ హీరోయిన్, లవర్ బాయ్‌గా సుబ్బరాజు- మనసుకు హత్తుకునే కథ!
ఇవాళ లయ ఓటీటీ ఎంట్రీ- శాడిస్ట్ కోడలిగా సీనియర్ హీరోయిన్, లవర్ బాయ్‌గా సుబ్బరాజు- మనసుకు హత్తుకునే కథ!

ఓటీటీలోకి లయ ఎంట్రీ

ఇటీవల వెండితెరపై కమ్‌బ్యాక్ ఇచ్చిన లయ తాజాగా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. నితిన్ తమ్ముడు, బిగ్ బాస్ శివాజీ సాంప్రదాయని సుప్పిని సుద్ధపూసని, జగపతి బాబు వదలా సినిమాలతో సందడి చేసిన లయ టాలీవుడ్ సీనియర్ నటుడు సుబ్బరాజుతో జత కట్టిన ఓటీటీ సినిమా అలా జరిగింది.

డిఫరెంట్ వేరియేషన్స్‌తో హీరో హీరోయిన్

అలా జరిగింది సినిమాలో లయ శాడిస్ట్ కోడలిగా, స్కూల్ టీచర్‌గా, తల్లిగా డిఫరెంట్ వేరియేషన్స్‌తో కనిపించింది. నటుడు సుబ్బరాజు కూడా లయ వెంట పడే లవర్ బాయ్‌గా, బాధ్యతగల కొడుకుగా, తండ్రిగా విభిన్న షేడ్స్‌లో అలరించాడు.

అసలు కథేంటంటే?

సరిత (లయ) ఒక ఆత్మాభిమానం కలిగిన స్కూల్ టీచర్. ఆమె తన టీనేజ్ పిల్లలను మొదటిసారి ప్రేమించిన పార్క్‌కు తీసుకెళ్తుంది. పిల్లలకు ఎప్పుడూ తెలియని తన జీవితంలో జరిగిన ఒక సీక్రెట్ లవ్ స్టోరీ గురించి చెబుతుంది. ఒక విభిన్నమైన ప్రేమతో మొదలైన సరిత ప్రయాణం పెళ్లి, కుటుంబం, త్యాగం, గుండెకోత, నిలదొక్కుకునే మనోధైర్యం వైపు ఎలా సాగింది అనే అంశాలతో కథ నడుస్తుంది.

సుబ్బరాజు ఈ చిత్రంలో లయ భర్తగా కీలక పాత్రలో నటించారు. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఎమోషనల్‌గా సాగుతూ ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉన్నాయి. వినీష, నిఖితా రెడ్డి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు.

టెక్నికల్ అంశాలు- ఓటీటీ స్ట్రీమింగ్

అలా జరిగింది చిత్రానికి సంతోష్ అన్నాపర్తి దర్శకత్వం వహించడమే కాకుండా స్క్రీన్‌ప్లే, సంభాషణలు సమకూర్చారు. కొవెలకుడి సత్య సాయిబాబా, వేమూరి హేమంత్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరించారు. రవి నిడమర్తి అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాలలోని డెప్త్‌ను పెంచగా, సునీల్ కుమార్ నామా కెమెరా పనితనం విజువల్స్‌కు మరింత అందాన్ని తెచ్చింది.

అభినవ్ వి కునాపరెడ్డి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ఇలా మంచి ఫ్యామిలీ ఎమోషనల్ లవ్ స్టోరీ అంశాలతో సాగే అలా జరిగింది ఓటీటీలోకి ఇవాళ (సెప్టెంబర్ 20). ప్రముఖ తెలుగు డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్‌లో అలా జరిగింది ఓటీటీ రిలీజ్ అయింది. ఈటీవీ విన్ కథా సుధలో భాగంగా నేటి నుంచి ఈటీవీ విన్‌లో అలా జరిగింది ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

అలా జరిగింది ఓటీటీ రిలీజ్ ప్రకటన

"ప్రేమ, కుటుంబం, త్యాగం మేళవింపుగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ప్రతి గుండెను తాకుతుంది. 'అలా జరిగింది' చిత్రం సెప్టెంబర్ 20 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ప్రసారం కానుంది" అని చిత్ర బృందం చెప్పుకొచ్చింది.

ఓటీటీలో కుటుంబ కథల వెల్లువ

డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్ల హోరు ఎక్కువైన ఈ రోజుల్లో ఈటీవీ విన్ కుటుంబ సమేతంగా చూడదగ్గ స్వచ్ఛమైన కథలను అందిస్తోంది. 'కథా సుధ' వేదికపై వస్తున్న ఈ చిత్రం సైతం ప్రతి కుటుంబానికి కనెక్ట్ అయ్యే భావోద్వేగాలతో తెరకెక్కింది. సరితతో పాటు పిల్లల అనుబంధం, గతం తాలూకు జ్ఞాపకాలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసేలా రూపొందించారని తెలుస్తోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More