OTT Telugu: 25 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్‌తో సత్తా చాటిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్- ఓటీటీలో సరికొత్త రికార్డ్-ఎక్కడంటే?

Telugu Crime Thriller Panchanama OTT Streaming Minutes: సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా అలరిస్తున్న ఓటీటీ ఒరిజినల్ తెలుగు వెబ్ సిరీస్ ‘పంచనామా’ డిజిటల్ మీడియాలో అదరగొడుతోంది. భరత్ శ్రీనివాసన్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సిరీస్ ఓటీటీ రిలీజైన వారం రోజుల్లోనే 25 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ సాధించింది.

Published on: Sep 18, 2026, 20:31:12 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Telugu OTT Crime Thriller Panchanama Streaming Minutes: క్రైమ్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ జోనర్లకు ఓటీటీ వేదికలపై ఉన్న క్రేజ్ వేరు. రేసింగ్ స్క్రీన్ ప్లే, థ్రిల్లింగ్ టేకింగ్ సరిగ్గా కుదిరితే చాలు, ప్రేక్షకులు ఓటీటీల్లో ఆ సిరీస్‌ను బింజ్ వాచ్ చేయడానికి ఎంతో ఆసక్తి చూపిస్తారు. ఈ వరుసలోనే ఓ తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సిరీస్ ఓటీటీలో దూసుకుపోతోంది. ఆ ఓటీటీ సిరీస్ పంచనామా.

25 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్‌తో సత్తా చాటిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్- ఓటీటీలో సరికొత్త రికార్డ్-ఎక్కడంటే?
25 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్‌తో సత్తా చాటిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్- ఓటీటీలో సరికొత్త రికార్డ్-ఎక్కడంటే?

ఆకట్టుకుంటున్న ఇన్వెస్టిగేటివ్ కథనం

మొత్తం ఆరు ఎపిసోడ్లతో రూపుదిద్దుకున్న పంచనామా మొదటి సీజన్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. నగరంలో వరుసగా జరిగే మూడు హత్యలు, ఆ కేసును ఛేదించేందుకు రంగంలోకి దిగిన పోలీస్ బృందం, ఎంత వెతికినా ఒక్క చిన్న క్లూ కూడా దొరక్కపోవడం వంటి అంశాలతో కథ కథనాలు ఎంతో గ్రిప్పింగ్‌గా నడుస్తాయి.

హత్యల వెనుక దాగున్న సూత్రధారి ఎవరు?

ఆ హత్యల వెనుక దాగున్న అసలు సూత్రధారి ఎవరు?, దానికి గల కారణాలేంటి? అనే కోణంలో సాగే సన్నివేశాలు ప్రేక్షకులను స్క్రీన్‌కు కట్టిపడేస్తున్నాయి. యాంకర్, నటి ఉదయభాను నిర్మించి షో రన్నర్‌గా వ్యవహరించిన ఈ ఓటీటీ సిరీస్ పంచనామాను దర్శకుడు మోహన్ శ్రీవత్స ఎంతో ప్రతిభావంతంగా తెరకెక్కించారు.

పవర్‌ఫుల్ ఆఫీసర్‌గా భరత్ నటన

వైవిధ్యమైన పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు, హీరో భరత్ శ్రీనివాసన్ ఇందులో ఇన్వెస్టిగేషన్ అధికారిగా సరికొత్త కోణంలో కనిపించారు. తనదైన విచారణ శైలి, నటనతో పాత్రకు పూర్తి న్యాయం చేశారు. నరేష్ కుమారన్ అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాల్లోని తీవ్రతను రెట్టింపు చేసింది.

పాత్రల్లో ఒదిగిపోయి నటించిన నటీనటులు

అలాగే, సందీప్ కాంత్ కెమెరా పనితనం విజువల్స్‌ను రిచ్‌గా నిలబెట్టింది. మేధా రెడ్డి, సీనియర్ నటుడు శివాజీ రాజా, చరణ్ బాబు, రూపా లక్ష్మీ, రాధిక ప్రీతి, సూర్య, శ్రీజ తమ పాత్రల్లో ఒదిగిపోయి ఈ పంచనామా సిరీస్‌లో బలాన్ని పెంచారు.

పంచనామా ఓటీటీ స్ట్రీమింగ్

ఇకపోతే పంచనామా జీ5 ఓటీటీలో అందుబాటులో ఉంది. సెప్టెంబర్ 11 నుంచి జీ5లో పంచనామా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీ రిలీజ్ అయినప్పటి నుంచి ట్రెండ్ అవుతూ సత్తా చాటుతోంది ఈ సిరీస్. ఇప్పుడు ఏకంగా 25 మిలియన్ల డిజిటల్ స్ట్రీమింగ్ మినిట్స్ దక్కించుకుని రికార్డ్ స్థాయి వ్యూస్‌తో అదరగొడుతోంది.

పంచనామా ఓటీటీ వ్యూస్

ఓటీటీ రిలీజ్ అయిన వారం రోజుల్లోనే 25 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ సాధించి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సత్తా ఏంటో నిరూపిస్తోంది పంచనామా. ఇంతటి క్రేజ్ తెచ్చుకుంటోన్న పంచనామా వెబ్ సిరీస్ కథ ముగిసే సమయానికి వచ్చే క్లైమాక్స్ తర్వాతి సీజన్‌పై పెద్ద ట్విస్ట్ ఇచ్చింది.

సీజన్ 2పై పెరిగిన ఇంట్రెస్ట్

"ఈ ముగింపు ఒక అంతం కాదు, మరో పెద్ద కథకు ఆరంభం" అనేలా ముగించడంతో పంచనామా సీజన్ 2 ఎప్పుడు వస్తుందా అనే ఆసక్తి ఓటీటీ ఆడియెన్స్‌లో మొదలైంది. ఇన్వెస్టిగేటివ్ సస్పెన్స్ డ్రామాలను ఇష్టపడేవారికి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న తెలుగు క్రైమ్ థ్రిల్లర్ పంచనామా బెస్ట్ సెలక్షన్ అని చెప్పుకోవచ్చు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More