OTT Telugu: ఓటీటీలోకి తెలుగులో ఏకంగా 20 సినిమాలు- ఒకేదాంట్లో 5, ఇంట్రెస్టింగ్‌గా 4 టాప్- హారర్ టు క్రైమ్ థ్రిల్లర్!

OTT Release Movies Telugu: ఓటీటీలోకి గత వారం తెలుగులో 20 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో చూసేందుకు అన్నీ స్పెషల్‌గానే ఉండగా.. 4 మాత్రం మరింత ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. హారర్ టు క్రైమ్ థ్రిల్లర్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్ ఓటీటీల్లో రిలీజ్ అయిన ఆ సినిమాలు ఏంటో చూద్దాం.

Published on: Sep 14, 2026, 05:35:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Release Movies Telugu New: ఓటీటీలోకి గత వారం తెలుగులో ఏకంగా 20 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అమెజాన్ ప్రైమ్ నుంచి ఈటీవీ విన్ వరకు హారర్ టు క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీ ప్రీమియర్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఓటీటీలోకి తెలుగులో ఏకంగా 20 సినిమాలు- ఒకేదాంట్లో 5, ఇంట్రెస్టింగ్‌గా 4 టాప్- హారర్ టు క్రైమ్ థ్రిల్లర్!
ఓటీటీలోకి తెలుగులో ఏకంగా 20 సినిమాలు- ఒకేదాంట్లో 5, ఇంట్రెస్టింగ్‌గా 4 టాప్- హారర్ టు క్రైమ్ థ్రిల్లర్!

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

డ్రాన్ టుగెదర్ (తెలుగు డబ్బింగ్ స్పానిష్ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్)- సెప్టెంబర్ 9

మకుటం (తెలుగు డబ్బింగ్ తమిళ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ ఫ్యామిలీ థ్రిల్లర్ డ్రామా సినిమా)- సెప్టెంబర్ 11

మహారాజ హాస్టల్ (తెలుగు డబ్బింగ్ మలయాళ హారర్ కామెడీ మూవీ)- సెప్టెంబర్ 11 (ఆహా ఓటీటీలో కూడా)

సల్మోక్జి: విస్పరింగ్ వాటర్ (తెలుగు డబ్బింగ్ కొరియన్ ఫోక్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం)- సెప్టెంబర్ 11

ది రివల్యూషనరీస్ (తెలుగు డబ్బింగ్ హిందీ హిస్టారికల్ ఫిక్షన్ పీరియడ్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 11

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

వై డిడ్ గెట్ ఐ గెట్ మ్యారీడ్ ఎగెన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ రొమాంటిక్ డ్రామా మూవీ)- సెప్టెంబర్ 9

విశ్వనాథ్ అండ్ సన్స్ (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ ఎమోషనల్ డ్రామా సినిమా)- సెప్టెంబర్ 11

గో టీమ్ (తెలుగు డబ్బింగ్ స్పానిష్ వర్క్ ప్లేస్ డార్క్ కామెడీ మూవీ)- సెప్టెంబర్ 11

చుంబక్ (తెలుగు డబ్బింగ్ హిందీ ఫ్యామిలీ సిచ్యువేషనల్ కామెడీ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 11

జియో హాట్‌స్టార్ ఓటీటీ

అలీబాబా ఔర్ 40 భూత్ (తెలుగు డబ్బింగ్ హిందీ కామెడీ హారర్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 11

ప్రిన్స్ ఆఫ్ మాలీవుడ్ (తెలుగు డబ్బింగ్ మలయాళం ఫ్యామిలీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 11

జంగిల్ టేల్స్ విత్ మౌగ్లీ (తెలుగు డబ్బింగ్ హిందీ కార్టూన్ కిడ్స్ ఫ్యామిలీ అడ్వెంచర్ వెబ్ సిరీస్)- సెప్టెంబరు 12

జీ5 ఓటీటీ

వీరభద్రుని రహస్యం సీజన్ 1 పార్ట్ 2 (తెలుగు ఫోక్ హారర్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 9

పంచనామా (తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 11

ఆహా ఓటీటీ

కాట్టాలన్ (తెలుగు డబ్బింగ్ మలయాళ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- సెప్టెంబర్ 11

వరవు (తెలుగు డబ్బింగ్ మలయాళ రివేంజ్ యాక్షన్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ)- సెప్టెంబర్ 11

వెంజన్స్ (తెలుగు డబ్బింగ్ తమిళ పొలిటికల్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- సెప్టెంబర్ 11

లయన్స్ గేట్ ప్లే ఓటీటీ

హంగ్రీ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్ మూవీ)- సెప్టెంబర్ 11

ఈటీవీ విన్ ఓటీటీ

కొలవెరి (తెలుగు రొమాంటిక్ డ్రామా చిత్రం)- సెప్టెంబర్ 11

కాశీమజిలి (తెలుగు స్ప్రిచ్యువల్ రొమాంటిక్ ఫీల్ గుడ్ లవ్ డ్రామా సినిమా)- సెప్టెంబర్ 13

ఓటీటీలోకి తెలుగులో 20 సినిమాలు

ఇలా గత వారం (సెప్టెంబర్ 7 నుంచి 13 వరకు) తెలుగు భాషలో ఏకంగా 20 సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. వాటిలో చూసేందుకు అన్నీ సినిమాలు చాలా స్పెషల్‌గా ఓటీటీ రిలీజ్ అయ్యాయి.

4 మరింత ఇంట్రెస్టింగ్, ఒకేదానిలో 5

ఇందులోనూ తెలుగు స్ట్రయిట్ సినిమాలు అయిన 4 మరింత ఇంట్రెస్టింగ్‌గా, టాప్ మూవీస్‌గా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక ఒక్క అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోనే 5 సినిమాలు అందుబాటులో ఉండటం విశేషం.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More