OTT: నా తమిళ సినిమాలకు ఎంతో సపోర్ట్ ఇచ్చిన ఓటీటీ ఇది, ఉదయభానుపై నమ్మకం కలగలేదు.. హీరో ప్రేమిస్తే భరత్ కామెంట్స్

Premisthe Bharath About OTT And Udayabhanu: హీరో ప్రేమిస్తే భరత్ మెయిన్ లీడ్ రోల్‌లో నటించిన లేటెస్ట్ తెలుగు మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పంచనామా. ఇవాళ పంచనామా ఓటీటీ స్ట్రీమింగ్ అవనున్న సందర్భంగా రెండ్రోజుల క్రితం జరిగిన ప్రివ్యూ ఈవెంట్‌లో ప్రేమిస్తే భరత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Published on: Sep 11, 2026, 09:50:19 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Premisthe Bharath About OTT And Udayabhanu: తెలుగు ప్రేక్షకులను అలరించేలా విభిన్నమైన, ఆసక్తికరమైన కథాంశాలతో ముందుకు సాగుతున్న జీ5 ఓటీటీ మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేసింది. అదే తెలుగు మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'పంచనామా'.

నా తమిళ సినిమాలకు ఎంతో సపోర్ట్ ఇచ్చిన ఓటీటీ ఇది, ఉదయభానుపై నమ్మకం కలగలేదు.. హీరో ప్రేమిస్తే భరత్ కామెంట్స్
నా తమిళ సినిమాలకు ఎంతో సపోర్ట్ ఇచ్చిన ఓటీటీ ఇది, ఉదయభానుపై నమ్మకం కలగలేదు.. హీరో ప్రేమిస్తే భరత్ కామెంట్స్

జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్

ప్రముఖ నటుడు భరత్ శ్రీనివాసన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సెప్టెంబర్ 11 అంటే నేటి నుంచి జీ5లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌‌లో 6 ఎపిసోడ్స్‌ ఉండనున్నాయి. హైదరాబాద్‌లో రెండు రోజుల క్రితం పంచనామా ఓటీటీ ప్రివ్యూ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు.

కెరీర్ కాస్తా డౌన్‌లో ఉన్నప్పుడు

ఈ ఈవెంట్‌లో హీరో ప్రేమిస్తే భరత్ మాట్లాడుతూ.. "నా కెరీర్‌లో 'జీ5' యాప్ చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. నా తమిళ సినిమాలకు ఎంతో సపోర్ట్ ఇచ్చింది. ముఖ్యంగా 2019లో నేను పోలీస్ ఆఫీసర్‌గా నటించిన నా మొదటి సినిమా 'కాళిదాస్' విడుదలకు ముందే, నా కెరీర్ కాస్త డౌన్‌లో ఉన్న సమయంలో జీ వాళ్లు ఆ కంటెంట్‌ను నమ్మి తీసుకున్నారు. ఆ సినిమా తమిళంలో పెద్ద హిట్ అయింది, అక్కడి నుంచి నా కెరీర్ మళ్లీ ఊపందుకుంది" అని అన్నారు.

నా 24 ఏళ్ల కెరీర్‌లో

"ఇప్పుడు జీ5 తెలుగు టీమ్ 'పంచనామా'ను అనుకున్న విధంగా తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా 24 ఏళ్ల కెరీర్‌లో ఇంత తక్కువ సమయంలో ఇంత స్పష్టతతో, ఎంతో ప్యాషన్‌తో చేసిన ఏకైక ప్రాజెక్ట్ ఇది" అని ప్రేమిస్తే భరత్ చెప్పారు.

ఉదయభానుపై నమ్మకం కలగలేదు

"నిజం చెప్పాలంటే ఉదయభాను గారు.. మొదట్లో ఈ ప్రాజెక్ట్‌ను 22-25 రోజుల్లో ఎలా పూర్తి చేస్తారోనని నాకు అస్సలు నమ్మకం కలగలేదు. ఇలాంటి జోనర్‌లో స్క్రీన్‌ప్లే చాలా పక్కాగా ఉండాలి, ప్రేక్షకులకు ఆరు ఎపిసోడ్లు బోర్ కొట్టకుండా బింజ్ వాచ్ చేసేలా ఉండాలి. కానీ సెట్‌కి వచ్చిన రెండు మూడు రోజుల్లోనే దర్శకుడు మోహన్ గారి క్లారిటీ చూశాక నా ఆలోచన మారింది" అని హీరో భరత్ పేర్కొన్నారు.

అది ఇద్దరిలో చూశాను

"యాక్టర్లను ఎలా హ్యాండిల్ చేయాలో తెలిసిన దర్శకుడు ఆయన. హీరోయిన్ మేధాకు, తోటి నటీనటులందరికీ ఆల్ ది బెస్ట్. చేసే పనిపై ప్రేమ, సినిమా పట్ల ఉన్న ప్యాషన్ ప్రొడక్షన్ అంటే.. అది నేను భానుజీ, విజయ్ సర్ ఇద్దరిలో చూశాను" అని ప్రేమిస్తే భరత్ వెల్లడించారు.

మొదటి రెండు ఎపిసోడ్స్ చూసిన తర్వాత

"తక్కువ సమయంలో క్వాలిటీ వస్తుందా లేదా అని భాను గారు చాలా టెన్షన్ పడ్డారు. కానీ మొదటి రెండు ఎపిసోడ్లు చూసిన తర్వాత చెబుతున్నాను.. ఒక క్రైమ్ థ్రిల్లర్‌కు కావాల్సిన అన్ని అంశాలు, పవర్‌ఫుల్ పాయింట్లు ఇందులో ఉన్నాయి" అని పంచనామా గురించి భరత్ చెప్పారు.

కంటెంట్ ఈజ్ కింగ్

"కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారు. ప్రస్తుతం కంటెంట్ ఈజ్ కింగ్. కొత్త టాలెంట్‌ను ఇలాగే ప్రోత్సహించండి. ఇకపై తెలుగులో మరిన్ని మంచి సినిమాలు, వెబ్ సిరీస్‌లతో మీ ముందుకు వస్తా" అని ప్రేమిస్తే భరత్ హామీ ఇచ్చారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More