OTT Trending: ఓటీటీ ట్రెండింగ్‌లో ఇవాళ టాప్ 10 సినిమాలు- మిస్ అవ్వకుండా చూడాల్సినవి 8- అన్నీ తెలుగులోనే-ఎందుకు చూడాలంటే?
Top 10 OTT Trending Movies In Amazon Prime Today: వారాంతంలో ఓటీటీలో చూసేందుకు మంచి సినిమాల కోసం వెతుకుతున్నారా? అయితే, అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇవాళ ఓటీటీ ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న టాప్ 10 సినిమాలు, అందులో చూడాల్సిన 8 మూవీస్, వాటి జోనర్లు, వాటిని ఎందుకు చూడాలి వంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
Today Top 10 OTT Trending Movies In Amazon Prime: వారాంతం వచ్చిందంటే చాలు ఓటీటీ ప్రియులు కొత్త సినిమాలు, ఆకట్టుకునే వెబ్ సిరీస్‌ల వేటలో పడతారు. ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో వందలాది ఆప్షన్లు ఉన్నప్పటికీ, ఏది చూడాలో తేల్చుకోవడం ఒక్కోసారి కష్టంగా మారుతుంది.

ఓటీటీ ట్రెండింగ్ సినిమాలు
అలాంటి వారి కోసం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇవాళ (సెప్టెంబర్ 18) అత్యధిక ఆదరణ పొందుతూ ఓటీటీ ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న టాప్ 10 సినిమాల గురించి జాబితాను ఇక్కడ అందిస్తున్నాం. యాక్షన్, డ్రామా, హారర్ వంటి విభిన్న జోనర్లలో ట్రెండ్ అవుతోన్న అమెజాన్ ప్రైమ్ ఓటీటీ సినిమాలు ఏంటో చూద్దాం.
యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్ల సందడి
వెయిటింగ్ హై: సబ్కీ టికెట్ కటేగి (Waiting Hai: Sabki Ticket Kategi):
పెద్ది విలన్ దివ్యేందు శర్మ ప్రధాన పాత్రలో నటించిన ఈ ఓటీటీ సిరీస్ దేశంలోనే అతిపెద్ద రైల్వే టికెట్ స్కామ్ నేపథ్యంతో తెరకెక్కింది. ఐఎమ్‌డీబీలో 8.2 రేటింగ్ పొందిన ఈ సిరీస్ సస్పెన్స్ ఎలిమెంట్లతో అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ట్రెండింగ్‌లో టాప్ 1 స్థానంలో దూసుకెళ్తోంది.
రీచర్ (Reacher):
అమెరికన్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ 'రీచర్' ప్రైమ్ వీడియో ట్రెండింగ్‌లో రెండో స్థానంలో నిలిచింది. ఐఎమ్‌డీబీ (IMDb)లో 8.0 రేటింగ్ సాధించిన ఈ ఓటీటీ సిరీస్ నాలుగో సీజన్ ఇటీవల అందుబాటులోకి వచ్చింది. ఇందులో మొత్తం 8 ఎపిసోడ్‌లు ఉన్నాయి.
నియలీ (Neagley):
అమెరికన్ యాక్షన్ క్రైమ్ సిరీస్ 'నియలీ' సెప్టెంబర్ 16న ప్రైమ్ వీడియోలో ఓటీటీ రిలీజ్ అయి ఆకట్టుకుంటోంది. దీనికి ఐఎమ్‌డీబీలో 7.6 రేటింగ్ ఉంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ట్రెండింగ్ జాబితాలో టాప్ 3 స్థానంలో నియలీ సత్తా చాటుతోంది.
ది రివాల్యూషనరీస్ (The Revolutionaries):
నిఖిల్ అద్వానీ దర్శకత్వం వహించిన ఈ పీరియాడిక్ ఓటీటీ సిరీస్‌లో భువన్ బామ్ (రాస్‌బిహారీ బోస్‌గా), రోహిత్ సరాఫ్, ప్రతిభా రాంటా కీలక పాత్రలు పోషించారు. భారత స్వాతంత్య్ర ఉద్యమ నేపథ్యంతో సాగే ఈ కథ 8 ఎపిసోడ్‌లుగా అలరిస్తోంది. ఓటీటీలో నాలుగో స్థానంలో టాప్‌లో ఉంది ఈ సిరీస్.
ప్రాంతీయ చిత్రాలు.. తెలుగు, తమిళ, మలయాళ వినోదం
మకుటం (Makutam):
తమిళ యాక్షన్ థ్రిల్లర్ 'మగుడం' ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉంది. విశాల్ దర్శకత్వం హీరోగా చేసిన ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది. తెలుగులో మకుటం టైటిల్‌తో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
హుషార్ పిట్టలు (Hushar Pittalu):
తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న రొమాంటిక్ డ్రామా 'హుషార్ పిట్టలు'. భిక్షు కోయాగుర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ఐఎమ్‌డీబీలో ఏకంగా 8.8 రేటింగ్ దక్కింది. 2 గంటల 23 నిమిషాల నిడివితో సాగే ఈ సినిమా యూత్‌కు బాగా నచ్చుతోంది. మంచి మెసేజ్‌తో రూపొందించిన హుషారు పిట్టలు సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో టాప్ 7 స్థానంలో ట్రెండ్ అవుతోంది.
మహారాజ హాస్టల్ (Maharaja Hostel):
మలయాళ హారర్-కామెడీ చిత్రం 'మహారాజ హాస్టల్' అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ట్రెండింగ్‌లో 9వ స్థానంలో ఉంది. చారూ వాకన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నిడివి 2 గంటల 8 నిమిషాలు. హాస్టల్‌లో జరిగే భయానక సంఘటనలతో ఈ సినిమాను తెరకెక్కించారు.
హారర్, డ్రామా, రియాలిటీ షోస్
మాన్‌స్టర్ ఐలాండ్ (Monster Island):
రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సాగే సర్వైవల్ హారర్ చిత్రం 'మాన్‌స్టర్ ఐలాండ్'. ఐఎమ్‌డీబీలో 5.2 రేటింగ్ సాధించిన ఈ సినిమా నిడివి 1 గంట 23 నిమిషాలు. ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో దేశవ్యాప్తంగా టాప్ 6 స్థానంలో ఓటీటీ ట్రెండింగ్ అవుతోంది.
బబితా సింగ్ రిపోర్టింగ్ (Babita Singh Reporting):
అంబికా పండిట్ దర్శకత్వంలో వచ్చిన హిందీ క్రైమ్ డ్రామా మూవీ 'బబితా సింగ్ రిపోర్టింగ్'. నిమిషా సజయన్, అన్షుమాన్ పుష్కర్, బరుణ్ సోబ్తీ నటించిన ఈ చిత్రానికి ఐఎమ్‌డీబీలో 6.3 రేటింగ్ ఉంది. బబితా సింగ్ రిపోర్టింగ్ ఓటీటీలో టాప్ 8 ప్లేసులో ట్రెండ్ అవుతోంది.
మీర్జాపూర్ సీజన్ 3 (Mirzapur Season 3):
ఓటీటీ ప్రపంచంలో సూపర్ హిట్ అయిన వెబ్ సిరీసుల్లో టాప్ ప్లేసులో మీర్జాపూర్ ఉంటుంది. ఐఎమ్‌డీబీలో 8.4 రేటింగ్ దక్కించుకున్న ఈ ఓటీటీ సిరీస్ సీజన్ 3 అమెజాన్ ప్రైమ్ వీడియోలో టాప్ 10 స్థానంలో నిలిచింది.
మిస్ అవకూడని టాప్ 8 సినిమాలు
ఇలా అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ట్రెండింగ్ టాప్ 10 సినిమాల జాబితా ఉంది. వీటిలో తెలుగులో రీచర్, మకుటం, హుషారు పిట్టలు, నియలీ, ది రివల్యూషనరీస్, మాన్‌స్టర్ ఐలాండ్, మీర్జాపూర్ 3, మహారాజ హాస్టల్ 8 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. కాబట్టి తెలుగు భాషలో చూసేందుకు ఇష్టపడే ఆడియెన్స్‌కు వీటిని మిస్ అవ్వకుండా చూడొచ్చు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


