OTT: ఈ వారం ఓటీటీలో చూడాల్సిన టాప్ 6 ఇంట్రెస్టింగ్ సినిమాలు- అన్నీ తెలుగులోనే- రవితేజ ఇరుముడి నుంచి హారర్ థ్రిల్లర్ వరకు
Must Watch OTT Release Movies This Week In Telugu: ఓటీటీలో థ్రిల్లింగ్ వినోదం ఇచ్చేందుకు టాప్ 6 ఇంట్రెస్టింగ్ సినిమాలు స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యాయి. రవితేజ ‘ఇరుముడి’ నుంచి హర్ష ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, హారర్ థ్రిల్లర్ వరకు ఓటీటీలో తెలుగులో అలరించే టాప్ 6 సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
Must Watch OTT Release Movies This Week In Telugu: సినిమా ప్రియులకు ఈ వారం ఓటీటీ సంస్థలు భారీ వినోదాన్ని అందించనున్నాయి. విభిన్నమైన జోనర్లతో హారర్, థ్రిల్లర్స్, కామెడీ, యాక్షన్, డివోషనల్, ఆంథాలజీ కథలు డిజిటల్ వేదికలపై సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, ఈటీవీ విన్ వంటి ప్రముఖ ఓటీటీల్లో డిజిటల్ స్ట్రీమింగ్‌కు వస్తున్న కచ్చితంగా చూడాల్సిన టాప్ 6 సినిమాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

రవితేజ యాక్షన్ డ్రామా 'ఇరుముడి'
మాస్ మహారాజ్ రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్‌లో తెరకెక్కిన తెలుగు యాక్షన్ డ్రామా ఇరుముడి ఓటీటీలోకి వచ్చేస్తోంది. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. రవితేజ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్, కుటుంబ కథాంశంతో రూపుదిద్దుకున్న ఈ సినిమా డిజిటల్ వీక్షకులకు మంచి అనుభూతిని ఇస్తుంది.
హర్ష కామెడీ ఎంటర్‌టైనర్ 'లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'
కమెడియన్ హర్ష చెముడు హీరోగా తెరకెక్కిన న్యూ తెలుగు ఓటీటీ సిరీస్ 'లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'. పెళ్లి కోసం సరైన భాగస్వామిని వెతుక్కునే క్రమంలో ఒక యువకుడు ఎదుర్కొనే నవ్వుల ప్రయాణమే ఈ సిరీస్ కథాంశం. కుటుంబ సభ్యుల ఒత్తిళ్లు, పెళ్లి చూపుల్లో జరిగే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను విశేషంగా అలరించనున్నాయి. సెప్టెంబర్ 18న ఈటీవీ విన్ ప్లాట్‌ఫామ్‌లో లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఓటీటీ రిలీజ్ కానుంది.
ఉత్కంఠ రేపే ఆంథాలజీ 'లస్ట్ స్టోరీస్ 3'
బాలీవుడ్ పాపులర్ ఆంథాలజీ ఫ్రాంచైజీ 'లస్ట్ స్టోరీస్' నుంచి మూడో భాగం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రేమ, అనుబంధాలు, మానవ సంబంధాల చుట్టూ సాగే నాలుగు విభిన్న కథలతో ఈ సిరీస్ రూపొందింది. విక్రమాదిత్య మోత్వానే, కిరణ్ రావు, శకున్ బాత్రా, విశాల్ భరద్వాజ్ ఈ చిత్రాలకు దర్శకత్వం వహించారు.
ఈ ఓటీటీ బోల్డ్ అండ్ రొమాంటిక్ సిరీస్‌లో రాధికా ఆప్టే, కొంకణా సేన్ శర్మ, అదితి రావ్ హైదరీ, సిద్ధార్థ్, విజయ్ వర్మ, అలీ ఫజల్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషించారు. సెప్టెంబర్ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు భాషలో కూడా లస్ట్ స్టోరీస్ ఓటీటీ స్ట్రీమింగ్ అవనుంది.
మలయాళ థ్రిల్లర్ 'తుడక్కమ్'
జూడ్ ఆంథనీ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన మలయాళ యాక్షన్ సర్వైవల్ థ్రిల్లర్ డ్రామా తుడక్కమ్ ఓటీటీ వేదికపైకి వస్తోంది. విస్మయ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో ఆమె తండ్రి, సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రత్యేక పాత్రలో మెరిశారు.
సాయి కుమార్, మనోజ్ కె. జయన్ ఇతర పాత్రల్లో నటించారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 18 నుంచి జియోహాట్‌స్టార్‌లో తుడక్కమ్ అందుబాటులోకి రానుంది.
క్రైమ్ డ్రామా 'మ్యాంగో పచ్చ'
కన్నడ క్రైమ్ థ్రిల్లర్ 'మాంగో పచ్చ' సెప్టెంబర్ 14 నుంచే జియోహాట్‌స్టార్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవనుంది. సంచిత్ సంజీవ్ నటుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా క్రైమ్ జోనర్ ప్రియులను ఆకట్టుకుంటోంది. కన్నడతోపాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో ఇంకాసేపట్లో మ్యాంగో పచ్చ ఓటీటీ రిలీజ్ అవనుంది.
హారర్ థ్రిల్లర్ 'ది మమ్మీ'
లీ క్రోనిన్ దర్శకత్వం వహించిన హారర్ థ్రిల్లర్ మూవీ 'ది మమ్మీ' సెప్టెంబర్ 17 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్ ఓటీటీల్లో అందుబాటులోకి వస్తుంది. అది కూడా తెలుగు భాషలో ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఎనిమిదేళ్ల క్రితం ఎడారిలో అదృశ్యమైన ఒక చిన్నారి ఊహించని రీతిలో తిరిగి రావడంతో మొదలయ్యే భయానక పరిణామాల చుట్టూ ఈ కథ నడుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


