Irumudi Collection: చిరంజీవి రికార్డును బద్దలు కొట్టిన రవితేజ- తొలి రోజు ఇరుముడి కలెక్షన్స్ సునామీ- ఎక్కడెక్కడ ఎంతంటే?

Ravi Teja Irumudi Box Office Collection Day 1: మాస్ మహారాజా రవితేజ నటించిన నయా ఎమోషనల్ డ్రామా 'ఇరుముడి' తొలిరోజే బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా మొదటిరోజే కలెక్షన్ల సునామీ సృష్టించిన ఇరుముడి చిరంజీవి సినిమా రికార్డును బద్దలుకొట్టింది. ఇరుముడి ఓపెనింగ్ కలెక్షన్స్ చూద్దాం.

Published on: Aug 22, 2026, 09:06:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Ravi Teja Irumudi 1st Day Worldwide Box Office Collection: మాస్ మహారాజా రవితేజ హీరోగా వచ్చిన సరికొత్త తెలుగు రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా 'ఇరుముడి' బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే బోణీ కొట్టింది. నిన్న (ఆగస్ట్ 21) థియేటర్లలో విడుదలైన ఇరుముడి సినిమా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.

చిరంజీవి రికార్డును బద్దలు కొట్టిన రవితేజ- తొలి రోజు ఇరుముడి కలెక్షన్స్ సునామీ- ఎక్కడెక్కడ ఎంతంటే?
చిరంజీవి రికార్డును బద్దలు కొట్టిన రవితేజ- తొలి రోజు ఇరుముడి కలెక్షన్స్ సునామీ- ఎక్కడెక్కడ ఎంతంటే?

ఫాదర్-డాటర్ ఎమోషనల్ సెంటిమెంట్‌తో తెరకెక్కిన ఈ ఇరుముడి చిత్రం మొదటిరోజే ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ దక్కించుకుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రవితేజ మార్కెట్ బలాన్ని ఈ చిత్రం మరోసారి నిరూపించింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా తొలిరోజు కలెక్షన్ల వర్షం కురిపించింది.

ప్రపంచవ్యాప్తంగా రూ. 24 కోట్లకు పైగా గ్రాస్!

ప్రముఖ ట్రేడ్ నివేదికల ప్రకారం.. 'ఇరుముడి' చిత్రం భారత్ వ్యాప్తంగా మొదటిరోజు రూ. 14.80 కోట్ల నెట్ కలెక్షన్స్ నమోదు చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 2,673 షోలలో ప్రదర్శితమైన ఈ సినిమా, తొలిరోజే 76.9 శాతం థియేటర్ ఆక్యుపెన్సీని సాధించడం విశేషం.

గ్రాస్ పరంగా చూస్తే ఇండియాలో రూ. 17.20 కోట్లు వసూలు కాగా, ఓవర్సీస్ మార్కెట్ నుంచి రూ. 7 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో తొలిరోజే రవితేజ ఇరుముడి చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 24.20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు సృష్టించింది.

తెలుగు వెర్షన్ హవా.. నైట్ షోలకు హాట్ కేకుల్లా టికెట్లు!

ఇరుముడి సినిమా గ్రాండ్ ఓపెనింగ్‌లో సింహభాగం తెలుగు వెర్షన్ నుంచే వచ్చింది. భారత్‌లో సాధించిన మొత్తం నెట్ వసూళ్లలో ఒక్క తెలుగు వెర్షనే రూ. 14.78 కోట్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లోని 2,591 షోలకు గాను సగటున 79 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. తమిళ వెర్షన్ నుంచి 82 షోల ద్వారా రూ. 2 లక్షలు మాత్రమే వచ్చాయి.

తెలుగు షోలలో ముఖ్యంగా నైట్ షోలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. రాత్రి ఆటలకు ఏకంగా 88.08 శాతం థియేటర్లు నిండిపోగా, ఈవెనింగ్ షోలలో 78.69 శాతం, ఆఫ్టర్ నూన్ షోలలో 73.62 శాతం, మార్నింగ్ షోలలో 66.69 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.

తెలుగు రాష్ట్రాల నుంచే రూ. 15 కోట్ల గ్రాస్

రవితేజకు స్ట్రాంగ్ మార్కెట్ ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలే ఈ సినిమా రాబడికి ప్రధాన కేంద్రాలుగా నిలిచాయి. రెండు రాష్ట్రాల నుంచి కలిపి తొలిరోజే ఇరుముడి సినిమాకు రూ. 15 కోట్ల గ్రాస్ వసూలైంది. కర్ణాటక నుంచి రూ. 1.50 కోట్లు, తమిళనాడు నుంచి రూ. 34 లక్షలు రాగా.. కేరళ నుంచి రూ. 1 లక్ష, మిగిలిన భారతీయ ప్రాంతాల నుంచి రూ. 35 లక్షలు వసూలయ్యాయి.

చిరంజీవి రికార్డును బద్దలు కొట్టిన రవితేజ

అంతేకాకుండా బుక్ మై షోలో చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు సినిమా పేరిట ఉన్న ఆల్‌టైమ్ అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డును రవితేజ ఇరుముడి బద్దలుకొట్టేసింది. బుక్ మై షోలో ఒక్క గంటలో 31.6 వేల మన శంకర వరప్రసాద్ గారు సినిమా టికెట్స్ అమ్ముడుపోగా తాజాగా ఇరుముడి టికెట్స్ 32.25 వేలకుపైగా సేల్ అయ్యాయి.

అలా చిరంజీవి సినిమాను రవితేజ మూవీ బ్రేక్ చేసేసింది. పాన్ ఇండియా సినిమాలను పక్కనపెట్టి చూస్తే రీజనల్ మూవీస్‌లో ఇదే అత్యధిక టికెట్ సేల్స్ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

తండ్రీకూతుళ్ల బంధం.. కంటతడి పెట్టిస్తున్న ఎమోషన్!

కాగా, 'ఇరుముడి' చిత్రంలో రవితేజ 'త్రినాథ్' అనే భక్తి భావం కలిగిన అయ్యప్ప స్వామి భక్తుడిగా కనిపించారు. మద్యం వ్యసనం ఉన్న త్రినాథ్, తన కూతురు మణికంఠ (బేబీ నక్షత్ర) మధ్య ఉండే అనుబంధమే ఈ కథకు ప్రధాన బలం.

మరోవైపు సాయి కుమార్ 'గోపాల్ రాజు' అనే పాత్రలో, తన కూతురు గాయత్రిని పెంచే క్రమంలో భిన్నమైన ఆలోచనా ధోరణిని ప్రదర్శిస్తారు. వేర్వేరు మనస్తత్వాలు ఉన్న ఈ రెండు కుటుంబాల ప్రయాణం, పిల్లల పెంపకం, వారిపై చూపే ప్రేమ చుట్టూ తిరిగే భావోద్వేగ సన్నివేశాలు, పిల్లల మరణాలు, వాటి కారకులు, వారిని త్రినాథ్ కనిపెట్టిన తీరు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More