Mohanlal: 50 ఏళ్ల కెరీర్‌లో ఇదే తొలిసారి, తప్పు నాదే- అభిమానులకు సారీ చెప్పిన సూపర్ స్టార్ మోహన్ లాల్- అసలు ఏమైందంటే?

Mohanlal Sorry To Fans: అభిమానలకు క్షమాపణలు చెప్పారు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్. సారీ చెబుతూ ఎమోషనల్ వీడియోను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఇప్పుడు మోహన్ లాల్ సారీ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. సూపర్ స్టార్ సారీ చెప్పడానికి గల కారణం ఏంటో చూద్దాం.

Published on: Aug 9, 2026, 19:45:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Mohanlal Sorry To Fans: భారతీయ సినీ రంగంలో ఎన్నో ఏళ్లుగా వెలుగుందుతున్న మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ఆస్ట్రేలియాలోని తన అభిమానులకు తీవ్ర విచారంతో ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

50 ఏళ్ల కెరీర్‌లో ఇదే తొలిసారి, తప్పు నాదే- అభిమానులకు సారీ చెప్పిన సూపర్ స్టార్ మోహన్ లాల్- అసలు ఏమైందంటే?
50 ఏళ్ల కెరీర్‌లో ఇదే తొలిసారి, తప్పు నాదే- అభిమానులకు సారీ చెప్పిన సూపర్ స్టార్ మోహన్ లాల్- అసలు ఏమైందంటే?

ఆస్ట్రేలియా వీసా లభించకపోవడంతో

సిడ్నీ నగరంలో వైభవంగా జరగాల్సిన భారీ స్టేజ్ షోకు మోహన్ లాల్ హాజరుకావాల్సి ఉండగా, చివరి నిమిషంలో ఆస్ట్రేలియా వీసా లభించకపోవడంతో ఆ కార్యక్రమం రద్దయింది. ప్రస్తుతం సింగపూర్‌లో ఉన్న మోహన్ లాల్ ఈ అనూహ్య పరిణామంపై స్పందిస్తూ అభిమానులకు క్షమాపణలు కోరారు.

50 ఏళ్ల కెరీర్‌లో ఇదే తొలిసారి!

సింగపూర్ నుంచి రికార్డ్ చేసిన వీడియో సందేశంలో మోహన్ లాల్ తన మనోవేదనను పంచుకున్నారు. సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి దాదాపు 50 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో, భారత్ నుంచి ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా స్టేజ్ షోలు చేసిన నటుడిగా తానొక్కడినే ఉంటానేమోనని ఆయన గుర్తు చేసుకున్నారు.

"నా భావోద్వేగాన్ని ఎలా వర్ణించాలో నాకు తెలియడం లేదు. ఎంతో బాధాకరమైన పరిస్థితిలో ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. నా జీవితంలో మొదటిసారి వీసా దొరక్కపోవడం వల్ల షోకి రాలేకపోయాను" అని మోహన్ లాల్ ఆవేదన వ్యక్తం చేశారు.

తెలియని కారణాలు

ఈ ఏడాదిలోనే అమెరికా, జర్మనీ, యూకే, ఐర్లాండ్ వంటి అనేక దేశాల్లో తన ప్రదర్శనలు విజయవంతంగా పూర్తి చేశానని, అయితే సిడ్నీ షో విషయంలో ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదని ఆయన తెలిపారు. సాంకేతిక లోపం వల్లనో, డాక్యుమెంటేషన్ తప్పుల వల్లనో లేదా నేటి ఏఐ (AI) వ్యవస్థల్లోని పొరపాట్ల వల్లనో వీసా ఆగిపోయి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.

నింద నాదే.. ఆర్గనైజర్లకు మోహన్‌లాల్ మద్దతు

ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు సాధారణంగా ఈవెంట్ నిర్వాహకులపై విమర్శలు వెల్లువెత్తుతుంటాయి. అయితే మోహన్ లాల్ ఈ విషయంలో చాలా ఉదారంగా స్పందిస్తూ, ఈవెంట్ నిర్వాహకులకు పూర్తి మద్దతుగా నిలిచారు. ప్రసిద్ధ గాయని కేఎస్ చిత్రతో సహా మిగిలిన సినిమా టీమ్ అంతా సిడ్నీకి చేరుకున్నారని, కేవలం తానొక్కడినే రాకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు.

తప్పు నాదే

"కార్యక్రమం విజయవంతం చేసేందుకు 'కాయల్ ఈవెంట్స్' విమల్, ఆయన టీమ్ శాయశక్తులా ప్రయత్నించారు. మానవ మాత్రంగా చేయగలిగిన ప్రతి ప్రయత్నం వారు చేశారు. అందుకే ఈ పొరపాటుకు పూర్తి బాధ్యత నాదేనని ఒప్పుకుంటున్నాను" అని మోహన్‌లాల్ స్పష్టం చేశారు.

మోహన్ లాల్ క్షమాపణలు

ఈ షో చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో సుదీర్ఘ ప్రయాణం చేసి వచ్చిన ప్రతి అభిమానికి మోహన్ లాల్ హృదయపూర్వక క్షమాపణలు చెప్పారు. భవిష్యత్తులో కచ్చితంగా ఇదే బృందంతో సిడ్నీకి వచ్చి అద్భుతమైన షో అందిస్తానని హామీ ఇచ్చారు.

మోహన్ లాల్ నిజాయితీపై ప్రశంసలు

గల్ఫ్ దేశాలతో పాటు ఆస్ట్రేలియా, యూరప్‌లలో భారీగా ఉండే మలయాళ, తెలుగు డయాస్పోరా (ప్రవాస భారతీయులు) ఈ వార్తతో తీవ్ర నిరాశకు గురైనప్పటికీ, మోహన్ లాల్ నిజాయితీని, బాధ్యతాయుత ప్రవర్తనను ప్రశంసిస్తున్నారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. మోహన్‌ లాల్ ఆస్ట్రేలియా స్టేజ్ షో ఎందుకు రద్దయింది?

సాంకేతిక లేదా డాక్యుమెంటేషన్ కారణాల వల్ల చివరి నిమిషంలో ఆస్ట్రేలియా వీసా లభించకపోవడంతో మోహన్‌ లాల్ సిడ్నీకి వెళ్లలేకపోయారు. దీంతో ఆ ఈవెంట్ రద్దయింది.

2. మోహన్‌ లాల్‌తో పాటు ఈ షోలో ఇంకా ఎవరు పాల్గొనాల్సింది?

ప్రసిద్ధ గాయని కేఎస్ చిత్రతో పాటు పలువురు ప్రముఖ మలయాళ సాంకేతిక నిపుణులు, కళాకారులు ఈ షోలో పాల్గొనేందుకు ఇప్పటికే సిడ్నీ చేరుకున్నారు.

3. వీసా రద్దుపై మోహన్‌ లాల్ ఎలా స్పందించారు?

పరిస్థితికి ఎవరినీ నిందించకుండా పూర్తి బాధ్యతను తనపైనే వేసుకున్నారు. సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చిన అభిమానులకు హృదయపూర్వక క్షమాపణలు చెబుతూ మళ్లీ షో నిర్వహిస్తానని హామీ ఇచ్చారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More