OTT Telugu: ఓటీటీలోకి తెలుగులో ఏకంగా 17 సినిమాలు- చూసేందుకు అన్నీ చాలా స్పెషల్, ఒకేదాంట్లో 6- 5 మరింత ఇంట్రెస్టింగ్!

OTT Release Movies Telugu New: ఓటీటీలోకి గత వారం తెలుగులో 17 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో చూసేందుకు అన్నీ స్పెషల్‌గా ఉంటే 5 మాత్రం మరింత ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, ఈటీవీ విన్ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో చూద్దాం.

Published on: Sep 21, 2026, 05:34:52 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Release Movies Telugu New: గత వారం తెలుగు భాషలో ఏకంగా 17 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. హారర్, సైకలాజికల్, మిస్టరీ, ఫాంటసీ, యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ, ఎమోషనల్ డ్రామా వంటి అన్ని రకాల జోనర్లలో ఓటీటీలో రిలీజ్ అయిన ఆ తెలుగు సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఓటీటీలోకి తెలుగులో ఏకంగా 17 సినిమాలు- చూసేందుకు అన్నీ చాలా స్పెషల్, ఒకేదాంట్లో 6- 5 మరింత ఇంట్రెస్టింగ్!
ఓటీటీలోకి తెలుగులో ఏకంగా 17 సినిమాలు- చూసేందుకు అన్నీ చాలా స్పెషల్, ఒకేదాంట్లో 6- 5 మరింత ఇంట్రెస్టింగ్!

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

స్ట్రేంజర్ థింగ్స్- టేల్స్ ఫ్రమ్ 85 సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యానిమేషన్ సైన్స్ ఫిక్షన్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- సెప్టెంబరు 17

మాన్‌స్టర్: ది లిజి బోర్డెన్‌ స్టోరీ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ బయోగ్రాఫికల్ హారర్ క్రైమ్ సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- సెప్టెంబరు 17

ఇరుముడి (తెలుగు ఫ్యామిలీ యాక్షన్ డ్రామా సినిమా)- సెప్టెంబరు 18

లస్ట్ స్టోరీస్ 3 (తెలుగు డబ్బింగ్ హిందీ అంథాలజీ బోల్డ్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- సెప్టెంబరు 18

బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ (తెలుగు డబ్బింగ్ మూవీ)- సెప్టెంబరు 18

మొదరాత్రి (తెలుగు డబ్బింగ్ టీన్ రొమాంటిక్ కామెడీ డ్రామా చిత్రం) - సెప్టెంబరు 18

జియో హాట్‌స్టార్ ఓటీటీ

మ్యాంగో పచ్చ (తెలుగు డబ్బింగ్ కన్నడ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- సెప్టెంబరు 14

లీ క్రోనిన్స్ ద మమ్మీ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ బాడీ హారర్ థ్రిల్లర్ మిస్టరీ మూవీ)- సెప్టెంబరు 17

తుడక్కమ్ (తెలుగు డబ్బింగ్ మలయాళ సర్వైవల్ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ ఫిల్మ్)- సెప్టెంబరు 18

కర్మాఖ్య (తెలుగు హారర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా)- సెప్టెంబరు 19

ది అవేకనింగ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యాక్షన్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ ఫిల్మ్)- సెప్టెంబరు 19

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

నియలీ (తెలుగు డబ్బింగ్ క్రైమ్ యాక్షన్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- సెప్టెంబరు 16

సుల్తానా (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ మ్యూజికల్ డ్రామా ఫిల్మ్)- సెప్టెంబరు 17

రామ్ అండ్ లీలా (తెలుగు డబ్బింగ్ తమిళ సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ సినిమా)- సెప్టెంబరు 18

ఈటీవీ విన్ ఓటీటీ

తోలు బొమ్మలు (తెలుగు ఫ్యామిలీ కామెడీ డ్రామా చిత్రం)- సెప్టెంబరు 17

లీస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ (తెలుగు రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్)- సెప్టెంబరు 18

అలా జరిగింది (తెలుగు ఎమోషనల్ ఫ్యామిలీ రొమాంటిక్ డ్రామా సినిమా)- సెప్టెంబరు 20

ఓటీటీలోకి తెలుగులో 17 సినిమాలు

ఇలా గత వారం (సెప్టెంబర్ 14 నుంచి 20 వరకు) తెలుగులో ఏకంగా 17 సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. వాటిలో చూసేందుకు అన్నీ సినిమాలు చాలా స్పెషల్‌గానే ఉన్నాయి.

మరింత ఇంట్రెస్టింగ్‌గా 5 మూవీస్

అయితే, ఇందులో తెలుగు స్ట్రయిట్ సినిమాలు అయిన రవితేజ ఇరుముడి, లయ అలా జరిగింది, తోలు బొమ్మలు, హర్ష చెముడు లీస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్, సముద్రఖని కర్మాఖ్య 5 మరింత ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక ఒక్క నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోనే ఏకంగా 6 సినిమాలు అందుబాటులో ఉన్నాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More