OTT Crime: నాలుగేళ్ల తర్వాత ఓటీటీలోకి నేరుగా వస్తున్న మృణాల్ ఠాకూర్ క్రైమ్ థ్రిల్లర్- తెలుగు, తమిళంలోనూ- ఎక్కడ చూడాలంటే?
Mrunal Thakur Pooja Meri Jaan OTT Release: మృణాల్ ఠాకూర్, హుమా ఖురేషి ప్రధాన పాత్రల్లో నటించిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా 'పూజా మేరీ జాన్' ఎట్టకేలకు ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2 నుంచి నేరుగా పూజా మేరీ జాన్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. అదెక్కడో ఇక్కడ తెలుసుకుందాం.
Mrunal Thakur Pooja Meri Jaan OTT Streaming: 'సీతారామం', 'హాయ్ నాన్న' చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న బ్యూటిఫుల్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఆమె ప్రధాన పాత్రలో నటించిన బాలీవుడ్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా 'పూజా మేరీ జాన్'.

నాలుగేళ్ల నిరీక్షణకు తెర
ఈ సినిమా పూజా మేరీ జాన్ ఓటీటీలోకి వచ్చేందుకు ఎట్టకేలకు సిద్ధమైంది. షూటింగ్ పూర్తయి దాదాపు నాలుగేళ్లు గడుస్తున్నా రకరకాల కారణాలతో థియేటర్లలోకి రాకపోయిన పూజా మేరీ జాన్ సినిమాను నేరుగా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో విడుదల చేస్తున్నారు. ఈ విషయాన్ని పాపులర్ ఓటీటీ వేదిక జీ5 (ZEE5) అధికారికంగా తాజాగా వెల్లడించింది.
గాంధీ జయంతి కానుకగా స్ట్రీమింగ్
గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న జీ5లో పూజా మేరీ జాన్ ఓటీటీ రిలీజ్ కానుంది. హిందీతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ వంటి 4 భాషల్లో కూడా పూజా మేరీ జాన్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ.. "కొన్ని కథలు మీరు చూసేదాన్ని ప్రశ్నించేలా చేస్తాయి. మరికొన్ని మీరు నమ్మేదాన్ని నిలదీస్తాయి. ఈ సినిమా మాత్రం రెండింటి మధ్య ఉండే ప్రతీ విషయాన్ని ప్రశ్నించేలా చేస్తుంది" అని జీ ఓటీటీ సంస్థ పేర్కొంది.
కథేంటి?
'స్త్రీ', 'ముంజ్యా' వంటి వరుస బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాడాక్ ఫిల్మ్స్ అధినేత దినేష్ విజన్, అమర్ కౌశిక్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. నవజోత్ గులాటీ దర్శకుడిగా వ్యవహరించారు.
తీవ్రమైన మానసిక ఆరాటం (Obsession), అనుమానాలు, సమాజంలో ఉండే మూస ధోరణుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఒక్క వ్యక్తి చేసిన పనులు ఎలాంటి పర్యవసానాలకు దారితీశాయనే అంశాన్ని థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు.
మృణాల్ పాత్ర ఎలా ఉండబోతోంది?
ఇందులో పూజ అనే టైటిల్ పాత్రలో మృణాల్ ఠాకూర్ కనిపించనున్నారు. ఆమె ప్రేమికుడు అనికేత్ అనుమానాస్పద స్థితిలో మరణించడంతో, ఆ నింద పూజపై పడుతుంది. మరోవైపు, వీరిద్దరికీ ఆత్మీయ మిత్రురాలైన లాయర్ సనా పాత్రలో హుమా ఖురేషి నటించారు.
స్నేహితురాలికి మద్దతుగా నిలబడాలో లేదా మిత్రుడి మరణాన్ని తల్చుకుని బాధపడాలో తెలియక సనా సతమతమవుతుంది. ఈ ముక్కోణపు భావోద్వేగాల నడుమ కథ అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతుంది.
ఉత్కంఠ రేపే సస్పెన్స్ డ్రామా
తన పాత్ర గురించి మృణాల్ స్పందిస్తూ.. "ఈ కథలో అనేక కోణాలు ఉన్నాయి. ప్రతీ సన్నివేశం ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తూ, ఊహకందని మలుపులతో సాగుతుంది. వాస్తవానికి, మన ఆలోచనలకు మధ్య ఉన్న గీతను ఈ చిత్రం చెరిపేస్తుంది" అని తెలిపారు.
నవజోత్ గులాటీతో కలిసి కనిష్క ఈ చిత్రానికి కథ అందించగా, విశాల్ మిశ్రా సంగీతం సమకూర్చారు. విపాషా అరవింద్ సహ దర్శకురాలిగా వ్యవహరించారు. విజయ్ రాజ్, విక్రమ్ సింగ్ చౌహాన్ ఇతర కీలక పాత్రల్లో మెరవనున్నారు.
ఓటీటీ క్రైమ్ థ్రిల్లర్‌పై ఆసక్తి
దాదాపు రెండు గంటల నిడివి ఉన్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు 'A' (అడల్ట్) సర్టిఫికేట్ ఇచ్చింది. థియేటర్లలో విడుదల కాకుండా నేరుగా పూజా మేరీ జాన్ ఓటీటీలోకి వస్తుండటంతో ఈ క్రైమ్ థ్రిల్లర్‌పై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


