K Pop Festival: ఇండియాలో ప్రపంచంలోనే అతిపెద్ద కే పాప్ ఫెస్టివల్- ఒకే వేదికపై కొరియన్ స్టార్స్, టాప్ ఇండియన్ ఆర్టిస్టులు
K Pop Weverse Con Festival In India: ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన కే-పాప్ (K-pop) సంగీత ఉత్సవం 'వీవర్స్ కాన్ ఫెస్టివల్' భారత్‌లో జరగనుంది. కొరియన్ ఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజం 'హైబ్' (HYBE) 2027 మార్చిలో న్యూఢిల్లీ వేదికగా రెండు రోజుల పాటు ఈ భారీ సంగీత సంబరాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
K Pop Weverse Con Festival In India: భారతీయ సంగీత ప్రియులకు, కే-పాప్ (K-pop) అభిమానులకు ఇది నిజంగా పెద్ద పండగ లాంటి వార్త. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది యూత్‌ను ఊపేస్తున్న కొరియన్ సంగీత దిగ్గజం 'హైబ్' (HYBE) చరిత్రలోనే తొలిసారిగా తన ప్రతిష్టాత్మక 'వీవర్స్ కాన్ ఫెస్టివల్' (Weverse Con Festival)ను భారత్‌కు తీసుకొస్తోంది.

దక్షిణ కొరియా సరిహద్దులు దాటి
2027 మార్చి 27, 28 తేదీల్లో న్యూఢిల్లీ వేదికగా రెండు రోజుల పాటు ఈ గ్లోబల్ మ్యూజిక్ ఫెస్టివల్ అంగరంగ వైభవంగా జరగనుంది. దక్షిణ కొరియా సరిహద్దులు దాటి మరో దేశంలో ఈ ఫెస్టివల్ జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన బీటీఎస్ (BTS), సెవెంటీన్ (SEVENTEEN), లెస్సెరాఫిమ్ (LE SSERAFIM) వంటి గ్లోబల్ బ్యాండ్లతో అంతర్జాతీయ సంగీత రంగాన్ని ఏలుతున్న 'హైబ్' సంస్థ, భారతీయ మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి సారించింది.
తెలుగు రాష్ట్రాల్లో సహా భారతదేశమంతటా కే-పాప్ డ్యాన్స్, మ్యూజిక్‌కు విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఈ నేపథ్యంలో భారతీయ వేదికపై ఇటు ప్రముఖ కొరియన్ (కే-పాప్) స్టార్స్, అటు టాప్ ఇండియన్ ఆర్టిస్టులు ఒకే వేదికను పంచుకోబోతున్నారు.
కే-పాప్ ప్రేమికులకు పండగే.. లైవ్ షోల హంగామా!
సూపర్‌ఫ్యాన్ ప్లాట్‌ఫామ్ 'వీవర్స్' స్ఫూర్తితో రూపొందించిన ఈ ఫెస్టివల్ కేవలం స్టేజీ ప్రదర్శనలకే పరిమితం కాకుండా, అభిమానులకు సరికొత్త ఇంటరాక్టివ్ అనుభూతిని అందించనుంది. అభిమానులు నేరుగా తమకు ఇష్టమైన అంతర్జాతీయ, భారతీయ స్టార్లతో ముఖాముఖి కనెక్ట్ అయ్యేలా ప్రత్యేక జోన్లను ఏర్పాటు చేస్తున్నారు. విభిన్న సంస్కృతులను మేళవిస్తూ వినూత్న కొలాబరేషన్ ప్రదర్శనలు ప్లాన్ చేస్తున్నారు.
కొత్త అధ్యాయానికి నాంది
"వీవర్స్ కాన్ ఫెస్టివల్ ఇండియా మా 'మల్టీ-హోమ్, మల్టీ-జానర్' వ్యూహంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతోంది. భారత్‌ను గ్లోబల్ విస్తరణలో అత్యంత కీలకమైన మార్కెట్‌గా చూస్తున్నాం" అని హైబ్ సీఈఓ జేసన్ జైసాంగ్ లీ వెల్లడించారు.
"ప్రపంచంలోనే అత్యంత ఉత్సాహభరితమైన కే-పాప్ ఫ్యాన్ కమ్యూనిటీ ఉన్న భారతదేశానికి ఈ లైవ్ ఫెస్టివల్‌ను తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉంది" అని వీవర్స్ కంపెనీ ప్రెసిడెంట్ జూయిల్ యాంగ్ పేర్కొన్నారు.
టికెట్లు ఎక్కడ దొరుకుతాయి? భాగస్వాములు ఎవరు?
ఈ మెగా మ్యూజిక్ ఈవెంట్‌ను హైబ్, వీవర్స్‌లతో కలిసి 'బుక్‌మైషో లైవ్' (BookMyShow Live) సహ-నిర్మాణం చేస్తోంది. టికెట్లు కేవలం బుక్‌మైషో వేదికపై మాత్రమే లభిస్తాయి. కియా ఇండియా, మాస్టర్‌కార్డ్, ప్రాజెక్ట్ బి, శామ్‌సంగ్ ప్రెజెంటింగ్ పార్ట్‌నర్లుగా వ్యవహరిస్తుండగా, నాంగ్‌షిమ్ (NONGSHIM) అసోసియేట్ పార్ట్‌నర్‌గా నిలిచింది. మాస్టర్‌కార్డ్ వినియోగదారులకు టికెట్ల ప్రీ-సేల్‌లో ప్రత్యేక యాక్సెస్ లభిస్తుంది.
ముంబై కేంద్రంగా 'హైబ్ ఇండియా' విస్తరణ
కేవలం ఒక ఈవెంట్‌తో సరిపెట్టకుండా, భారతీయ సంగీత ప్రతిభను అంతర్జాతీయ వేదికలపైకి తీసుకెళ్లేందుకు 'హైబ్ ఇండియా' ముంబైలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ప్రణాళికలు సిద్ధం చేసింది. దేశవ్యాప్తంగా ఆడిషన్లు నిర్వహిస్తూ, స్థానిక కళాకారులను ప్రోత్సహించడం, కొత్త కంటెంట్‌ను రూపొందించడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. తద్వారా రాబోయే రోజుల్లో భారతీయ కే-పాప్ ప్రేమికులకు మరింత వినోదాన్ని పంచడానికి హైబ్ బలమైన పునాది వేస్తోంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


