This Week Ott: ఓటీటీలో ఈ వారం పండగే! విజయ్ సేతుపతి 'కాట్టాన్' నుంచి 'బీటీఎస్' వరకు-సినిమాలు, సిరీస్‌లపై ఓ లుక్కేయండి

This Week Ott: నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఈ వారం కొత్త షోలు, సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. షాహిద్ కపూర్ తాజా చిత్రం నుండి విజయ్ సేతుపతి మూవీ వరకు ఈ లిస్ట్ పై ఓ లుక్కేయండి. 

Published on: Mar 23, 2026, 12:46:48 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కొత్త వారం వచ్చేసింది. ఓటీటీలో కొత్త సందడి రాబోతుంది. ఈ వారం డిజిటల్ స్ట్రీమింగ్ కు కొన్ని క్రేజీ సినిమాలు, సిరీస్ లు రాబోతున్నాయి. డిఫరెంట్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో రాబోతున్న ఈ సినిమాలు, సిరీస్ లు ఏంటో ఇక్కడ తెలుసుకోండి.

ఈ వారం ఓటీటీ రిలీజ్ లు
ఈ వారం ఓటీటీ రిలీజ్ లు

విజయ్ సేతుపతి 'కాట్టాన్'

తమిళ వెర్సటైల్ నటుడు విజయ్ సేతుపతి నటించిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ 'కాట్టాన్' ఈ వారమే ఓటీటీలోకి వస్తోంది. ఒక పోలీస్ స్టేషన్ ను మూసేయాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడే ఒక మిస్టరీ కేసు వస్తుంది. ఈ కేసు చుట్టూ ఈ కథ తిరుగుతుంది. మార్చి 27 నుంచి జియోహాట్‌స్టార్‌లో ఈ ఉత్కంఠభరిత చిత్రం స్ట్రీమింగ్ కానుంది.

బీటీఎస్ - ది రిటర్న్

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులున్న కే-పాప్ బ్యాండ్ బీటీఎస్ గ్యాంగ్ మళ్లీ కలిశారు. ఆర్మీలో తమ సైనిక సేవ ముగిసిన తర్వాత వీళ్లు ‘అరిరాంగ్’ అనే ఆల్బమ్ రిలీజ్ చేశారు. ఈ ఆల్బమ్ రికార్డింగ్ కోసం వారు లాస్ ఏంజిల్స్‌లో చేసిన ప్రయాణమే ఈ డాక్యుమెంటరీ. నెట్‌ఫ్లిక్స్‌లో మార్చి 27 నుంచి ఈ ఆర్మీ సందడి మొదలవ్వబోతోంది.

షాహిద్ కపూర్ 'ఓ రోమియో'

ముంబై అండర్ వరల్డ్ నేపథ్యంలో సాగే రా అండ్ రస్టిక్ మూవీ 'ఓ రోమియో' అమెజాన్ ప్రైమ్‌లో సందడి చేయనుంది. ప్రతీకారం కోసం ఎదురుచూసే మహిళతో ఒక కిల్లర్ ప్రేమలో పడే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇందులో ఉంది. తృప్తి డిమ్రి, షాహిద్ కపూర్ కాంబోలో వచ్చే ఈ సినిమా మార్చి 27న రిలీజ్ అవుతోంది.

హారర్ థ్రిల్లర్స్ తో

నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వారం రెండు భిన్నమైన ఇంటర్నేషనల్ షోలు విడుదలవుతున్నాయి. 'సమ్ థింగ్ వెరీ బ్యాడ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్’ అనేది పెళ్లికి ముందు జరిగే భయంకరమైన సంఘటనల చుట్టూ తిరుగుతుంది. అలాగే ఓస్లోలో జరిగే వరుస హత్యల మిస్టరీని ఛేదించే 'డిటెక్టివ్ హోల్’ కూడా మార్చి 26న విడుదల కానుంది.

డేర్‌డెవిల్ సీజన్ 2 రెడీ

సూపర్ హీరో ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న 'డేర్‌డెవిల్: బార్న్ అగైన్' సీజన్ 2 వచ్చేస్తోంది. అవినీతి మేయర్ విల్సన్‌తో మాట్ చేసే పోరాటం ఈ సీజన్‌లో మరింత రసవత్తరంగా సాగనుంది. మార్చి 25 నుండి జియోహాట్‌స్టార్‌లో ఈ భారీ సిరీస్ అందుబాటులోకి రాబోతోంది.

వీటితో పాటు మరిన్ని సినిమాలు, సిరీస్ లు, రియాలిటీ షోలు డిజిటల్ స్ట్రీమింగ్ లో ఆడియన్స్ ఎంటర్ టైన్ చేసేందుకు ఈ వారం వచ్చేస్తున్నాయి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More