Time travel secrets: వేదాలలో టైమ్ ట్రావెల్ రహస్యం.. ఐన్‌స్టీన్ కంటే ముందే మనకు తెలుసా?

Time travel secrets: వేల ఏళ్ల క్రితమే మన పురాణాల్లో టైమ్ ట్రావెల్ ప్రస్తావన ఉందంటే నమ్ముతారా? ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతానికి సరిగ్గా సరిపోయే రేవతి దేవి, రైవత కకుద్మి కథలోని అద్భుతమైన సైన్స్ విశేషాలు ఇక్కడ చూడండి.

Published on: May 16, 2026, 09:31:09 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టైం ట్రావెల్ అంటే మనకి హాలీవుడ్ సినిమాలు, ఐన్స్టీన్ వంటి శాస్త్రవేత్తలే గుర్తొస్తాయి. కానీ వేదాలలో కూడా టైం ట్రావెల్ రహస్యం ఉంది. వేల ఏళ్ల క్రితమే పురాణాల్లో టైం ట్రావెల్ గురించి ప్రస్తావన ఉంది. ఈ విషయాన్ని మీరు నమ్ముతారా? ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతానికి సరిపోయే రేవతి దేవి, కకుద్మి కథలో అద్భుతమైన సైన్స్ విషయాలు ఉన్నాయి. వాటి గురించి ఇక్కడ క్లుప్తంగా తెలుసుకోండి.

Time travel secrets: వేదాలలో టైమ్ ట్రావెల్ రహస్యం.. ఐన్‌స్టీన్ కంటే ముందే మనకు తెలుసా? (pinterest)
Time travel secrets: వేదాలలో టైమ్ ట్రావెల్ రహస్యం.. ఐన్‌స్టీన్ కంటే ముందే మనకు తెలుసా? (pinterest)

పురాణాల్లో కూడా

సైన్స్ ఫిక్షన్ అంటే నవలలు, ఆల్బర్ట్ ఐన్స్టీన్ లాంటి శాస్త్రవేత్తలు అందరికీ గుర్తొస్తారు. కానీ పురాణాలలో కూడా టైం ట్రావెల్ అనేది జరిగింది. సమయం ముందుకు పరిగెత్తడం లేదా వెనక్కి వెళ్లడం కేవలం ఆధునిక విజ్ఞాన శాస్త్రం కనుగొన్న అద్భుతం అని అందరూ భావిస్తారు. కానీ వేల ఏళ్ల క్రితం శ్రీమద్భాగవతం, విష్ణు పురాణం లాంటి గ్రంథాలలో టైం డైలేషన్ గురించి స్పష్టమైన వివరణలు ఉన్నాయి. రేవతి దేవి, తన తండ్రి అయిన కకుద్మి కథ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరి ఆ కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కకుద్మి, రేవతి

కుశస్థలి, ఇప్పటి ద్వారకా సామ్రాజ్యాన్ని కకుద్మి పరిపాలించేవాడు. వారి కుమార్తె రేవతి. ఆమె అద్భుతమైన రూపవతి మాత్రమే కాదు, విద్యల్లో కూడా ఆరితేరిన తెలివైన అమ్మాయి. తగిన వరుడుని వెతకడం కోసం భూలోకంలో చాలా మంది రాజులను పరిశీలించాడు. తన కుమార్తెకు సరిపడే వారు ఎవరూ కూడా ఆయనకు కనపడలేదు.

బ్రహ్మ వద్దకు వెళ్ళిన కకుద్మి

అప్పుడు రాజుకి ఒక ఆలోచన వచ్చింది. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడిని అడిగి తన సందేహాన్ని తీర్చుకుందాం అనుకుని, రేవతిని వెంటబెట్టుకుని బ్రహ్మలోకానికి వెళ్లాడు. బ్రహ్మలోకానికి చేరుకున్నప్పుడు బ్రహ్మదేవుడు గంధర్వ గానాన్ని వింటూ పరవశిస్తున్నాడు. సంగీతం ముగిసే వరకు రాజు కాసేపు ఎదురు చూసాడు. పాట ముగిశాక రాజు వినయంగా బ్రహ్మదేవునికి తాను తెచ్చిన వరుల జాబితాను వినిపించాడు. కూతురికి వీరిలో ఎవరు తగినవారో చెప్పమని అడిగాడు. రాజు మాటలు విన్న బ్రహ్మ గట్టిగా నవ్వుతూ ఆశ్చర్యపోయాడు.

అంతరించిపోయాయి..

“రాజా! నువ్వు ఎవరి పేర్లు అయితే చదువుతున్నావో, వారి కుమారులు, వారి మనవులు, చివరికి వారి వంశాలు కూడా భూమిపై ఎప్పుడో అంతరించిపోయాయి. ఇక్కడ నువ్వు గడిపింది కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే అవ్వచ్చు. కానీ ఇప్పుడు భూలోకంలో 27 చతుర్యుగాలు గడిచాయి. ఇప్పుడు అక్కడ కృత, త్రేతా యుగాలు ముగిసి ద్వాపరయుగం వచ్చేసింది,” అని బ్రహ్మ చెప్పాడు. నిజానికి ఇది వినడానికి పురాణ గాథలా ఉన్నా కూడా, ఆధునిక సైన్స్ చెప్పే టైం డైలేషన్‌కు ఉదాహరణగా భావిస్తారు.

ద్వాపరయుగం

బ్రహ్మ సూచన మేరకు తిరిగి రాజు భూలోకానికి వస్తాడు. అప్పుడు అతనికి అంతా కొత్తగా అనిపించింది. మనుషుల ఆకారం, ప్రవర్తన, ఎత్తు అన్నీ కూడా మారిపోయాయి. రేవతి దేవి సత్యయుగపు మనిషి అవ్వడంతో ఆమె ఎత్తు చాలా ఎక్కువగా ఉండేది. ద్వాపరయుగంలో మనుషుల ఎత్తు బాగా తగ్గిపోయింది. చివరికి బ్రహ్మదేవుడు ఆదేశంతో రేవతిని కృష్ణుడి అన్నయ్య అయిన బలరాముడికి వివాహం చేశారు. బలరాముడు నాగలితో రేవతి భుజాలను తాకగా, ఆమె ఎత్తు ఆ కాలపు మనుషులకు సరిపోయేలా తగ్గిందని పురాణాలు చెబుతున్నాయి.

ఈ కథని బట్టి మనకి అర్థమయ్యేది ఏమిటంటే, పురాణాలు కల్పిత కథలు కావు. ఖగోళ విజ్ఞానానికి, భౌతిక శాస్త్ర సూత్రాలకు నిదర్శనాలు కూడా. భారతీయులు కాలాన్ని యుగాల రూపంలో గణించారు. విశ్వంలో కాలం ఒకేలా ఉండదనే సత్యాన్ని ప్రపంచం మొత్తానికి చెప్పారు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More