AK47 Trailer: కామెడీ టు క్రైమ్ థ్రిల్లర్- అదిరిపోయిన వెంకటేష్ ఆదర్శ కుటుంబం ట్రైలర్- నవ్వించడమే కాదు రక్తపాతం కూడా!
Aadarsha Kutumbam Trailer Released: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న 'ఆదర్శ కుటుంబం - హౌస్ నెం. 47' ట్రైలర్ తాజాగా విడుదలయ్యింది. కామెడీ, ఫ్యామిలీ డ్రామాతో పాటు థ్రిల్లింగ్ క్రైమ్ ఎలిమెంట్స్, రక్తపాతంతో కూడిన ఏకే 47 ట్రైలర్ అదిరిపోయింది.
Venkatesh Trivikram Aadarsha Kutumbam Trailer Released: టాలీవుడ్ ప్రేక్షకులకు కుటుంబ కథా చిత్రాలు అనగానే ముందుగా గుర్తుకువచ్చే కాంబినేషన్లలో విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల జోడీ ఒకటి. 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' వంటి ఆల్‌టైమ్ క్లాసిక్ సినిమాల తర్వాత దాదాపు ఇరవై ఏళ్లకు వీరిద్దరి కాంబో మళ్లీ పట్టాలెక్కింది.

ఏకే 47 ట్రైలర్ రిలీజ్
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చిన్నబాబు) నిర్మాణంలో తెరకెక్కిన 'ఆదర్శ కుటుంబం - హౌస్ నెం. 47' చిత్రంపై మొదటి నుంచీ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలను మరింత పెంచేసేలా ఇవాళ ఆదర్శ కుటుంబం ట్రైలర్ విడుదలైంది. ఈ ఏకే 47 ట్రైలర్ సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది.
ఫ్యామిలీ డ్రామాకు తోడైన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్
ఆదర్శ కుటుంబం ట్రైలర్‌ను పరిశీలిస్తే, కేవలం సాధారణ కుటుంబ కథ మాత్రమే కాకుండా అందులో అంతర్లీనంగా ఒక బలమైన క్రైమ్ థ్రిల్లర్ ఎలిమెంట్ దాగి ఉందనే విషయం తెలుస్తోంది. వెంకటేష్ తన మార్కు టైమింగ్‌తో కూడిన కామెడీతో నవ్విస్తూనే.. రఫ్ అండ్ టఫ్ యాక్షన్ అవతార్‌లో కనిపించి రక్తపాతం సృష్టించాడు.
"కుటుంబం అంటే కేవలం నవ్వులే కాదు, కష్టం వస్తే ఒకరికొకరు నిలబడటమే అసలైన బంధం" అనే రీతిలో సాగే త్రివిక్రమ్ మార్క్ సంభాషణలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కథలోని మలుపులు, ఉత్కంఠ రేపే సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.
ఇదే కాకుండా వెంకటేష్, శ్రీనిధి శెట్టి ఏజ్ గ్యాప్ గురించి చెబుతూ "బొబ్బిలి రాజా సమయంలో నేను పడితే తను రాజా టైమ్‌లో పుట్టింది", "బొబ్బిలి రాజా టు రాజా చాలా గ్యాప్ ఉంది కదయ్యా" అంటూ వచ్చే డైలాగ్స్ నవ్వించాయి. మిడిల్ క్లాస్ కుటుంబం గురించే చెప్పే డైలాగ్ కూడా ఆకట్టుకునేలా ఉంది.
థమన్ మ్యూజిక్, సత్య-వెన్నెల కిషోర్ కామెడీ హంగామా
ఇప్పటికే విడుదలైన పాటలకు శ్రోతల నుంచి అద్భుతమైన స్పందన లభించగా, ట్రైలర్‌లో ఎస్.ఎస్. తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రతీ సీన్‌ను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లింది. యాక్షన్, సస్పెన్స్ సన్నివేశాల్లో తమన్ ఇచ్చిన ఆర్‌ఆర్ థ్రిల్లింగ్ అనుభూతిని కలిగిస్తోంది.
శ్రీనిధి శెట్టి, నివేథా పేతురాజ్ హీరోయిన్స్‌గా నటిస్తుండగా, నారా రోహిత్ ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెరిసి సర్‌ప్రైజ్ చేశారు. రావు రమేష్ సీరియస్ లుక్‌తో అలరించారు. సత్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, రఘుబాబు వంటి అనుభవజ్ఞులైన నటీనటులు ఉండటంతో వినోదానికి కొదవలేదని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
అక్టోబర్ 30న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్
కామెడీ ట్రాక్ నుంచి సడెన్‌గా క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌కు షిఫ్డ్ అవ్వడం, నవ్వించడంతోపాటు వయోలెంట్ యాక్షన్ సీన్లతో ట్రైలర్‌లో రక్తపాతం చూపించారు. అయితే, కుటుంబ సమేతంగా చూడదగ్గ క్లీన్ ఎంటర్‌టైనర్లను అందించడంలో వెంకటేష్, త్రివిక్రమ్‌లకు ప్రత్యేకమైన ట్రాక్ రికార్డ్ ఉంది.
రెండు తెలుగు రాష్ట్రాల బాక్సాఫీస్ వద్ద కుటుంబ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో ఈ కాంబినేషన్‌కు తిరుగులేదు. అదే నమ్మకంతో నిర్మించిన 'ఆదర్శ కుటుంబం - హౌస్ నెం. 47' అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. 20 ఏళ్ల తర్వాత వస్తున్న ఈ ఐకానిక్ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


