OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్ సిరీస్- రియల్ గ్యాంగ్‌స్టర్ ఘటనలతో 3 వేర్వేరు సీజన్లు-తెలుగులో స్ట్రీమింగ్
Rangbaaz OTT Streaming In Telugu: ఓటీటీ ప్రియులను రంగబాజ్ వెబ్ సిరీస్ మూడు సీజన్లతో ఆకట్టుకుంటోంది. యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ రియల్ గ్యాంగ్‌స్టర్ క్రైమ్ థ్రిల్లర్ 3 వేర్వేరు సీజన్లు కలిపి ఐఎమ్‌డీబీలో 7.7 రేటింగ్ సంపాదించుకుంది. మరి రంగబాజ్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.
Rangbaaz OTT Release In Telugu: డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో రోజురోజుకూ క్రైమ్ థ్రిల్లర్లు, సస్పెన్స్ డ్రామాలకు ఆదరణ పెరుగుతోంది. కేవలం ఊహాజనిత కథలకంటే, నిజ జీవితంలో జరిగిన గ్యాంగ్స్టర్ల కథలకు ఓటీటీ ఆడియెన్స్ బ్రహ్మరథం పడుతున్నారు.

ఓటీటీని ఊపేస్తున్న సిరీస్
ఈ క్రమంలోనే ఓటీటీని ఊపేస్తున్న అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్ సిరీస్‌లలో 'రంగబాజ్' ఒకటి. రంగబాజ్ నుంచి ఇప్పటివరకు వచ్చిన మూడు సీజన్లు కూడా వేటికవే విభిన్నమైన కథాంశాలతో ఉత్కంఠ రేకెత్తించాయి. ప్రసిద్ధ ఐఎమ్‌డీబీ (IMDb) ప్లాట్‌ఫామ్‌పై 7.7 రేటింగ్ సాధించి ఈ ఓటీటీ సిరీస్ అత్యుత్తమ ఆదరణ సొంతం చేసుకుంది.
యుపీ గ్యాంగ్‌స్టర్ కథతో మొదటి సీజన్
మొదటి సీజన్ ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ నేపథ్యంతో రూపుదిద్దుకుంది. అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గ్యాంగ్‌స్టర్, హిట్ మ్యాన్ శ్రీ ప్రకాష్ శుక్లా నిజ జీవిత సంఘటనల ఆధారంగా దీనిని తెరకెక్కించారు. ఒక ఉపాధ్యాయ కుటుంబంలో పుట్టి, చదువుకునే వయసులో ఉన్న శివ్ ప్రకాష్ (సాకిబ్ సలీమ్) అనే యువకుడు, తన సోదరికి జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేక నేర ప్రపంచంలోకి అడుగుపెడతాడు.
చెల్లెలిపై అక్రమంగా చెయ్యేసిన వ్యక్తిని అంతం చేయడంతో ప్రారంభమైన అతడి ప్రయాణం, అనతి కాలంలోనే దేశంలోనే అత్యంత ప్రమాదకరమైన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా మార్చేస్తుంది. కేవలం 25 ఏళ్ల చిన్న వయసులోనే స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) ఎన్కౌంటర్లో అతడు ఎలా అంతమయ్యాడనేది ఈ సీజన్ ఉత్కంఠభరితంగా చూపిస్తుంది.
రాజస్థాన్ బ్యాక్‌డ్రాప్‌లో రెండవ సీజన్
రెండవ సీజన్ రాజస్థాన్‌ను ఒకప్పుడు గజగజలాడించిన గ్యాంగ్‌స్టర్ ఆనంద్ పాల్ సింగ్ జీవితం ఆధారంగా రూపుదిద్దుకుంది. ఇందులో అమర్ పాల్ సింగ్ పాత్రలో నటుడు జిమ్మీ షెర్గిల్ అద్భుతంగా నటించారు. కుల రాజకీయాల చట్రంలో చిక్కుకుని, వేరే దారి లేక నేర ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఒక సాధారణ యువకుడి ప్రయాణం ఇది.
అక్రమ మద్యం వ్యాపారం నుంచి మొదలై, రాష్ట్ర రాజకీయాలను, శాంతి భద్రతల వ్యవస్థను అతడు ఎలా శాసించాడనేది దర్శకుడు అత్యంత ప్రతిభావంతంగా తెరకెక్కించారు. అధికార యంత్రాంగంతో పోరాడుతూ అమర్ పాల్ నిర్మించిన నేర సామ్రాజ్యం వీక్షకులను కట్టిపడేస్తుంది.
బీహార్ రాజకీయాలు, నేర ప్రపంచంతో మూడో సీజన్
మూడో సీజన్ బీహార్‌కు చెందిన ప్రముఖ రాజకీయనాయకుడు, గ్యాంగ్‌స్టర్ మహమ్మద్ షహాబుద్దీన్ కథ ఆధారంగా రూపొందింది. వినీత్ కుమార్ సింగ్ 'హరూన్ షా అలీ బైగ్' అనే ప్రధాన పాత్రలో కనిపించారు.
ఒక గ్యాంగ్‌స్టర్‌గా ప్రయాణం ప్రారంభించి, రాజకీయాల్లోకి అడుగుపెట్టి అధికారాన్ని ఎలా దక్కించుకున్నాడనేది ఈ సీజన్ లోతుగా విశ్లేషిస్తుంది. బీహార్‌లోని కుల సమీకరణాలు, నేర ప్రపంచం, రాజకీయ అధికార దాహం మధ్య నడిచే సస్పెన్స్ డ్రామా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది.
రంగబాజ్ ఓటీటీ స్ట్రీమింగ్ తెలుగులో
యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందే క్రైమ్ థ్రిల్లర్లను ఇష్టపడేవారికి 'రంగబాజ్' ఒక పర్ఫెక్ట్ ఛాయిస్. మూడు సీజన్లు కూడా వేర్వేరు ప్రాంతాల గ్యాంగ్స్టర్ల జీవితాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తాయి. ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ 'జీ5' (ZEE5) వేదికగా రంగబాజ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
కేవలం హిందీలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా రంగబాజ్ ఓటీటీ రిలీజ్ అయింది. జీ5 ఓటీటీ ప్లాట్ఫామ్లో అందుబాటులో ఉన్న బయోగ్రాఫికల్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్.. థ్రిల్లర్ ప్రియులకు ఓటీటీలో చూసేందుకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


