OTT Friday Release: ఓటీటీలో ఫ్రైడే ధమాకా-రేపు ఒక్కరోజే చూడాల్సిన టాప్ 7 సినిమాలు- కీర్తి సురేష్ టు వరలక్ష్మి శరత్ కుమార్

Top 7 OTT Friday Releases: ఓటీటీలోకి అక్టోబర్ 23 శుక్రవారం సరికొత్త 7 సినిమాలు రిలీజ్ కానున్నాయి. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జీ5, హాట్‌స్టార్‌లలో క్రైమ్ థ్రిల్లర్ల నుంచి టైమ్-లూప్ కామెడీల వరకు అలరించేందుకు వస్తున్న టాప్ 7 ఇంట్రెస్టింగ్ క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌ల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

Published on: Oct 22, 2026, 13:07:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

OTT Release Movies Friday: ఈ వారాంతంలో ఓటీటీ వినోద ప్రియులకు పండగే అని చెప్పాలి. విభిన్న కథాంశాలతో రూపొందిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఒక్క అక్టోబర్ 23 శుక్రవారం నుంచి ప్రముఖ ఓటీటీల్లో స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి.

ఓటీటీలో ఫ్రైడే ధమాకా-రేపు ఒక్కరోజే చూడాల్సిన టాప్ 7 సినిమాలు- కీర్తి సురేష్ టు వరలక్ష్మి శరత్ కుమార్
ఓటీటీలో ఫ్రైడే ధమాకా-రేపు ఒక్కరోజే చూడాల్సిన టాప్ 7 సినిమాలు- కీర్తి సురేష్ టు వరలక్ష్మి శరత్ కుమార్

రేపు ఒక్కరోజే 7 ఇంట్రెస్టింగ్ సినిమాలు

హాలీవుడ్ స్థాయి యాక్షన్, సైకలాజికల్ థ్రిల్లర్లు, టైమ్ లూప్ కామెడీలు, స్ఫూర్తిదాయక బయోపిక్‌లు ప్రేక్షకులను అలరించేందుకు రేపు టాప్ 7 ఓటీటీ ఇంట్రెస్టింగ్ సినిమాలు వరుస కడుతున్నాయి. కీర్తి సురేష్, వరలక్ష్మి శరత్‌కుమార్, మనోజ్ బాజ్‌పాయ్ నటించిన సినిమాలు ఈ వీకెండ్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

కార్తీక్ సుబ్బరాజు డ్రామా 'డోరతి' - నెట్‌ఫ్లిక్స్

కోలీవుడ్ వర్సటైల్ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కించిన తమిళ పీరియాడికల్ డ్రామా 'డోరతి' నెట్‌ఫ్లిక్స్ వేదికగా రేపు ఓటీటీ రిలీజ్ అవుతోంది. 1980ల నేపథ్యంతో సాగే ఈ కథలో విజిల్‌ వీరయ్య అనుచరులుగా పెరిగిన సుబ్బు, కార్తీ అనే ఇద్దరు చిన్ననాటి మిత్రుల ప్రయాణాన్ని చూపించారు. సుబ్బు వదిన డోరతీ అనుమానాస్పద స్థితిలో మరణించడంతో కథ ఊహించని మలుపు తిరుగుతుంది. సుబ్బు తన జెండర్ ఐడెంటిటీని బయటపెట్టడంతో కుటుంబం ఆమెను వెలేస్తుంది. సుబ్బును అంతమొందించే బాధ్యతను వీరయ్య కార్తీకి అప్పగిస్తాడు. ప్రయాణంలో కార్తీకి కలిగే భావోద్వేగాలు, ఆంతరంగిక మథనం ఈ సినిమాకు ప్రధాన బలం. కీర్తి సురేష్, సనంత్, రిషికాంత్, రామచంద్రన్ దురైరాజ్ కీలక పాత్రలు పోషించారు.

మనోజ్ బాజ్‌పాయ్ 'గజబ్ రాత్'- నెట్‌ఫ్లిక్స్

నటనకు మారుపేరైన మనోజ్ బాజ్‌పాయ్ ప్రధాన పాత్రలో నటించిన ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ 'గజబ్ రాత్'. ఢిల్లీ పోలీసు విభాగంలో లంచగొండి అధికారి అజయ్ దీక్షిత్ పాత్రలో మనోజ్ కనిపించనున్నారు. వేగంగా వెళ్తున్న కారు నుంచి తీవ్రంగా గాయపడిన ఒక మహిళను రోడ్డుపై పడేయడంతో అజయ్ జీవితం మలుపు తిరుగుతుంది. కేసు విచారణ క్రమంలో పెద్ద పెద్ద రాజకీయ, వ్యాపార దిగ్గజాల కుట్రలు బయటపడతాయి. డబ్బు సంపాదన ప్రాధాన్యమా లేక వృత్తి ధర్మం ముఖ్యామా అనే వైరుధ్యంలో అజయ్ తీసుకున్న నిర్ణయం ఏంటో నెట్‌ఫ్లిక్స్‌లో చూడాల్సిందే.

వరలక్ష్మి 'సట్టముమ్ నీదియుమ్ 2' - జీ5

చట్టం, న్యాయం మధ్య నలిగే వ్యవస్థాగత అవినీతిని ప్రశ్నిస్తూ రూపొందిన తమిళ లీగల్ డ్రామా 'సట్టముమ్ నీదియుమ్' రెండో సీజన్ జీ5లో ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. న్యాయవాది సుందరమూర్తి సమాజంలో బలీయమైన శక్తులను ఎదుర్కొంటూ చేసే పోరాటం ఈ సీజన్‌లో మరింత ఉత్కంఠగా సాగనుంది. పవర్, నైతికత మధ్య సాగే ఈ పోరాటంలో వరలక్ష్మి శరత్‌కుమార్, శరవణన్, లావణ్య, ప్రేమ్ కుమార్ కీలక పాత్రల్లో మెరిశారు.

టైమ్ లూప్ కామెడీ 'ధూమకేతు' - నెట్‌ఫ్లిక్స్

మలయాళంలో సరికొత్త కాన్సెప్ట్‌లతో వచ్చే సినిమాలు ఎప్పుడూ ఆకట్టుకుంటాయి. సుధి మ్యాడిసన్ దర్శకత్వంలో వచ్చిన 'ధూమకేతు' ఒక వినూత్న టైమ్-లూప్ డార్క్ కామెడీ. 36 ఏళ్ల కుట్టన్ పెళ్లి రోజే ముసుగు దొంగలు దాడి చేసి అతని ప్రాణాలు తీసి నవవధువును కిడ్నాప్ చేస్తారు. అయితే, ప్రతీసారి చనిపోగానే కుట్టన్ మళ్లీ ఉదయం పెళ్లి ఘడియల్లోనే కళ్లు తెరుస్తాడు. ఒక అరుదైన తోకచుక్కతో ముడిపడి ఉన్న ఈ మిస్టరీని ఛేదించేందుకు అతను పడే పాట్లు నవ్వులు పూయిస్తాయి. సజిన్ గోపు, నిఖిలా విమల్, గణపతి ప్రధాన పాత్రల్లో నటించారు.

ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 7 - జియోహాట్‌స్టార్

ప్రసిద్ధ యానిమేషన్ ఓటీటీ సిరీస్ 'ది లెజెండ్ ఆఫ్ హనుమాన్' ఏడో సీజన్ జియోహాట్‌స్టార్‌లో రేపటి నుంచి అందుబాటులోకి రానుంది. లంక యుద్ధంలో రావణాసురుడు అత్యంత శక్తివంతమైన రూపాన్ని ధరించడంతో పోరాటం తీవ్రరూపం దాల్చుతుంది. ధర్మ పరిరక్షణ కోసం హనుమంతుడు కాల ప్రయాణం చేస్తూ శ్రీరాముడి గతం ద్వారా మృత్యు లోకం నుంచి శక్తివంతమైన దివ్యాస్త్రాన్ని సాధించే ఘట్టాలు ఇందులో అద్భుతంగా ఆవిష్కరించారు.

స్ఫూర్తిదాయక క్రీడా చిత్రం 'సుమో దీదీ' - జీ5

భారతదేశపు మొదటి, ఏకైక మహిళా సుమో రెజ్లర్ హేతల్ దవే వాస్తవ జీవిత ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'సుమో దీదీ'. మహిళల శరీరాకృతిపై సమాజంలో ఉండే అపోహలను పటాపంచలు చేస్తూ జపాన్‌లో కఠోర శిక్షణ పొంది జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించిన హేతల్ పోరాట పటిమను ఈ చిత్రం కళ్లకు కడుతుంది. జీ5 ఓటీటీలో ఈ స్ఫూర్తిదాయక చిత్రం అందుబాటులోకి రానుంది.

క్రైమ్ డ్రామా 'చార్ యార్' - ప్రైమ్ వీడియో

2000ల ప్రారంభంలోని ముంబై మహానగరం నేపథ్యంలో సాగే నలుగురు స్నేహితుల కథే 'చార్ యార్'. జై, టోనీ, సాహిల్, సమీర్ అనే నలుగురు మధ్యతరగతి యువకులు తమ కలలను నిజం చేసుకునే క్రమంలో ఒక అత్యవసర నిర్ణయం వల్ల నేర ప్రపంచంలోకి అడుగుపెడతారు. గ్యాంగ్‌స్టర్లు, పోలీసుల మధ్య చిక్కుకున్న వారి స్నేహం ఎలాంటి మలుపులు తిరిగింది అనేది అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడవచ్చు.

తెలుగులో 5 స్ట్రీమింగ్

ఇలా రేపు ఒక్కరోజే టాప్ 7 ఇంట్రెస్టింగ్ సినిమాలు ఓటీటీ రిలీజ్ కానున్నాయి. ఇందులో డోరతి, గజబ్ రాత్, ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 7, సట్టముమ్ నీదియుమ్ 2, ధూమకేతు వంటి ఐదు సినిమాలు తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవనున్నాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More