Ramayana OTT Official: రిలీజ్‌కు ముందే రణ్‌బీర్, సాయి పల్లవి రామాయణ ఓటీటీ డీల్ ఫిక్స్- అధికారిక ప్రకటన- కానీ, అదే మైనస్!

Ramayana OTT Streaming Official: రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి నటించిన పౌరాణిక దృశ్య కావ్య చిత్రం రామాయణ ఓటీటీ విడుదలపై అధికారికంగా కీలక ప్రకటన వచ్చింది. థియేటర్లలో విడుదలైన తర్వాత ఓటీటీలోకి రామాయణ రైజ్ ఆఫ్ ది లెజెండ్ సినిమా తీసుకురానున్నారు. అయితే, ఆ ఒక్క విషయం మాత్రం మైనస్‌గా మారింది.

Published on: Oct 22, 2026, 05:56:45 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Ramayana Rise Of The Legend OTT Release Official: నమిత్ మల్హోత్రా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన దృశ్య కావ్యం 'రామాయణ: రైజ్ ఆఫ్ ది లెజెండ్' ఓటీటీ విడుదలపై సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత రామాయణ సినిమాను ఓటీటీలోకి, టీవీలోకి తీసుకొచ్చేందుకు రెండు భారీ సంస్థలు డీల్ కుదుర్చుకున్నాయి.

రిలీజ్‌కు ముందే రణ్‌బీర్, సాయి పల్లవి రామాయణ ఓటీటీ డీల్ ఫిక్స్- అధికారిక ప్రకటన- కానీ, అదే మైనస్!
రిలీజ్‌కు ముందే రణ్‌బీర్, సాయి పల్లవి రామాయణ ఓటీటీ డీల్ ఫిక్స్- అధికారిక ప్రకటన- కానీ, అదే మైనస్!

రామాయణ ఓటీటీ అఫీషియల్

అవే జియోహాట్‌స్టార్, ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్. అయితే సాధారణ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లో కాకుండా 'పే-పర్-వ్యూ' (Pay-Per-View) విధానంలో జియో హాట్‌స్టార్‌లో రామాయణం ఓటీటీ స్ట్రీమింగ్ చేయడానికి అందుబాటులోకి తేనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సబ్‌స్క్రైబర్స్ ఫ్రీగా చూసేలా కాకుండా అద్దె రూపంలో ఓటీటీ రిలీజ్ చేయడం ట్విస్టుతో పాటు మైనస్ అని చెప్పుకోవచ్చు.

పాన్ వరల్డ్ స్థాయిలో

2026 దీపావళి కానుకగా నవంబర్ 5న 'రామాయణ: రైజ్ ఆఫ్ ది లెజెండ్' చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఐమాక్స్ 3డీ (IMAX 3D) ఫార్మాట్‌లో అత్యంత భారీ స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా, భారత్‌తో పాటు అంతర్జాతీయంగా పాన్-వరల్డ్ స్థాయిలో అలరించనుంది.

తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి రామాయణం సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సౌత్ ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన సాయి పల్లవి సీతగా, కేజీఎఫ్ స్టార్ యశ్ రావణాసురుడిగా నటిస్తుండటంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ రామాయణ సినిమాపై అపారమైన భారీ నెలకొన్నాయి.

ప్రతీ ఇంటికీ రామాయణ విశిష్టత: నీతా అంబానీ

భారతీయ సంస్కృతికి ప్రతిరూపమైన ఈ కథను ప్రతీ ఇంటికీ చేర్చాలనే లక్ష్యంతోనే ఈ భాగస్వామ్యం కుదిరిందని జియోస్టార్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ తెలిపారు.

"రామాయణం మన నాగరికతకు అత్యంత విలువైన సంపద. శతాబ్దాలుగా మన ఆలోచనలను, జీవన విధానాన్ని ప్రభావితం చేసిన మహత్తర కావ్యమిది. అధునాతన సాంకేతికతను ఉపయోగించి ఈ కావ్యంలోని ధర్మం, ప్రేమ, ధైర్యం వంటి శాశ్వత విలువలను దేశంలోని ప్రతీ కుటుంబానికి, కొత్త తరం ప్రేక్షకులకు అందించడం మాకు లభించిన గౌరవంగా భావిస్తున్నాం" అని నీతా ఎం. అంబానీ పేర్కొన్నారు.

బిగ్ స్క్రీన్ అనుభూతి లేని వారి కోసం ఓటీటీ వేదిక

రామాయణ చిత్రాన్ని ఐమాక్స్ 3డీ తెరపై చూడటమే సరైన అనుభూతిని ఇస్తుందని, అయితే దేశంలో ప్రతిఒక్కరికీ అలాంటి థియేటర్ సౌకర్యాలు అందుబాటులో లేవని ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా అభిప్రాయపడ్డారు.

"రామాయణం భారతీయులందరి సొత్తు. అందుకే ప్రతి ఒక్కరికీ ఈ సినిమా అందుబాటులో ఉండాలి. ఐమాక్స్ వంటి బిగ్ స్క్రీన్స్‌పై ఈ చిత్రాన్ని చూడటం గొప్ప అనుభూతే అయినా, మన దేశంలో థియేటర్ మౌలిక సదుపాయాలు అందరికీ సమానంగా లేవు. క్రీడలు, వినోదం ద్వారా దేశాన్ని ఏకం చేసిన చరిత్ర జియోహాట్‌స్టార్‌కు ఉంది. థియేటర్ రన్ పూర్తయ్యాక ప్రతీ ఒక్కరి చేతుల్లోకి, హాల్లోకి రామాయణాన్ని తీసుకెళ్లేందుకు ఇది సరిగ్గా సరిపోతుంది" అని నమిత్ మల్హోత్రా తెలిపారు.

అంతర్జాతీయ స్థాయి సాంకేతిక నిపుణులు

రెండు భాగాలుగా వస్తున్న ఈ పౌరాణిక చిత్రానికి నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. ఆస్కార్ గ్రహీత డినెగ్ (DNEG), ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, యశ్‌కు చెందిన మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హాలీవుడ్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ హ్యాన్స్ జిమ్మర్, ఇండియన్ మ్యూజిక్ మైస్ట్రో ఏఆర్ రెహమాన్ కలిసి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండటం విశేషం.

ఎవరెవరు ఏ పాత్రలో

శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణాసురుడిగా యశ్, హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే నటించారు. అరుణ్ గోవిల్, లారా దత్తా, రకుల్ ప్రీత్ సింగ్, వివేక్ ఒబెరాయ్, కుణాల్ కపూర్, కాజల్ అగర్వాల్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. తొలి భాగం 2026 నవంబర్‌లో విడుదల కానుండగా, రెండో భాగం 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More