OTT True Crime Thriller: ఓటీటీలో ప్రకంపనలు సృష్టిస్తున్న ట్రూ క్రైమ్ థ్రిల్లర్- 7.6 ఐఎమ్‌డీబీ రేటింగ్- ఎక్కడ చూడాలంటే?

OTT Crime Thriller Hathras 16 Days Streaming: నిజ జీవిత ఘటన ఆధారంగా తెరకెక్కిన ట్రూ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ హత్రాస్ 16 డేస్ ఓటీటీలో అదరగొడుతోంది. 3 ఎపిసోడ్లతో సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌కు ఐఎమ్‌డీబీలో 7.6 రేటింగ్ ఉంది. మరి ఈ హత్రాస్ 16 డేస్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Oct 6, 2026, 14:00:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

OTT Crime Thriller Hathras 16 Days Release: ఓటీటీల్లో వచ్చే సైకో-థ్రిల్లర్లు, ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ కథలకు నేటి తరం డిజిటల్ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ లభిస్తోంది. కల్పిత కథల కంటే మన కళ్లముందే జరిగిన నిజ జీవిత దారుణాలను, సమాజంలోని చీకటి కోణాలను ఎత్తిచూపే కథనాలు చూసేవారిని తీవ్రంగా ఆలోచింపజేస్తాయి.

ఓటీటీలో ప్రకంపనలు సృష్టిస్తున్న ట్రూ క్రైమ్ థ్రిల్లర్- 7.6 ఐఎమ్‌డీబీ రేటింగ్- ఎక్కడ చూడాలంటే?
ఓటీటీలో ప్రకంపనలు సృష్టిస్తున్న ట్రూ క్రైమ్ థ్రిల్లర్- 7.6 ఐఎమ్‌డీబీ రేటింగ్- ఎక్కడ చూడాలంటే?

ఓటీటీలో హత్రాస్ 16 డేస్

ఆ కోవలోనే ప్రేక్షకుల వెన్నులో వణుకు పుట్టిస్తోన్న ట్రూ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సిరీస్ 'హత్రాస్: 16 డేస్' (Hathras: 16 Days) ఓటీటీలో ఇప్పటికీ ఆకట్టుకుంటోంది. అలాంటి హత్రాస్ 16 డేస్ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలపై ఓ లుక్కేద్దాం.

దేశాన్ని కుదిపేసిన దారుణం.. 16 రోజుల ఇన్వెస్టిగేషన్!

2020 సెప్టెంబర్ 14న ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో ఒక 19 ఏళ్ల దళిత యువతిపై కొందరు మృగాళ్లు అతికిరాతకంగా సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఆస్పత్రిలో మరణంతో పోరాడిన ఆ బాధితురాలు సెప్టెంబర్ 29న చికిత్స పొందుతూ కన్నుమూసింది.

ఆ తర్వాత బాధితురాలి మృతదేహానికి అర్ధరాత్రి వేళ పోలీసులే అంత్యక్రియలు నిర్వహించిన తీరు, బయటపడిన రాజకీయ ప్రమేయాలు దేశవ్యాప్తంగా పెను దుమారం రేపాయి. ఆ దారుణం జరిగిన తర్వాతి 16 రోజుల్లో అక్కడ అసలేం జరిగింది? అధికార యంత్రాంగం కేసును ఎలా తిప్పికొట్టే ప్రయత్నం చేసింది? అనే అంశాలను దర్శకుడు ప్యాట్రిక్ గ్రాహం ఎంతో ధైర్యంగా తెరకెక్కించారు.

రాజకీయం, కుల వివక్షల స్వరూపం.. గ్రౌండ్ రిపోర్టింగ్ మెరుపులు!

కేవలం ఒక నేరాన్ని చూపించడానికే పరిమితం కాకుండా, ఆ ఘటన వెనుక ఉన్న రాజకీయ లబ్ధి, సమాజంలో పేరుకుపోయిన కుల వివక్షను ఈ ఓటీటీ సిరీస్ నిష్పాక్షికంగా చూపించింది. ఆ సమయంలో క్షేత్రస్థాయిలో ప్రాణాలకు తెగించి వార్తలు కవర్ చేసిన జర్నలిస్టులు, ప్రత్యక్ష సాక్షుల ఇంటర్వ్యూలతో పాటు నాటి ఒరిజినల్ ఫుటేజ్‌‌ను పొందుపరిచారు.

జర్నలిస్టులు తనుశ్రీ పాండే, నిధి సురేష్, భీమ్ ఆర్మీ అధినేత చంద్రశేఖర్ ఆజాద్ 'రావణ్', సీనియర్ యాంకర్ రుబికా లియాకత్ వంటి ప్రముఖుల విశ్లేషణలు కథనానికి మరింత బలాన్నిచ్చాయి. అంజలి శివరామన్, పవేల్ గులాటీ, కుముద్ మిశ్రా తదితరులు కీలక పాత్రల్లో మెరిశారు. సమర్ ఖాన్, ఆదిత్య పిత్తి నిర్మించిన ఈ ఓటీటీ సిరీస్‌కు ప్రముఖ సంస్థ ఐఎమ్‌డీబీ (IMDb) 7.6/10 రేటింగ్ ఇచ్చింది.

కేవలం 3 ఎపిసోడ్లు.. నిమిష నిమిషం ఉత్కంఠ!

ఈ సిరీస్ నిడివి తక్కువగా ఉండటం ఓటీటీ ప్రేక్షకులకు పెద్ద ప్లస్ పాయింట్. మొత్తం మూడు ఎపిసోడ్లుగా దీనిని తీర్చిదిద్దారు. మొదటి ఎపిసోడ్ 33 నిమిషాలు, రెండో ఎపిసోడ్ 34 నిమిషాలు, మూడో ఎపిసోడ్ 28 నిమిషాల నిడివితో సాగుతాయి. ప్రతి ఎపిసోడ్ గడిచేకొద్దీ కేసులోని అసలు నిజాలు బయటపడుతూ ప్రేక్షకుడిని స్క్రీన్‌కు కట్టిపడేస్తాయి.

హత్రాస్ 16 డేస్ ఓటీటీ స్ట్రీమింగ్

సమాజంలో జరిగే అన్యాయాలు, వ్యవస్థలోని లోపాలను కళ్లకు కట్టినట్లు చూపే 'హత్రాస్: 16 డేస్' కేవలం వినోదం మాత్రమే కాకుండా, ఒక సామాజిక స్పృహను రగిలిస్తుంది. 'జీ5' (ZEE5)లో హత్రాస్ 16 డేస్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ధైర్యం చేసి చూడాలనుకునే క్రైమ్ థ్రిల్లర్ ప్రియులు ఈ సిరీస్‌ను జీ5 ఓటీటీలో ఎంచక్కా చూసేయొచ్చు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More