Madhavan Game Changers: మ్యాడీ ఈజ్ బ్యాక్- మళ్లీ హోస్ట్‌గా హీరో మాధవన్- బిజినెస్ గురించి చెప్పే గేమ్ ఛేంజర్స్ ఓటీటీ షో
R Madhavan Host To Business Reality Show Game Changers OTT: వర్ధమాన పారిశ్రామికవేత్తలకు గ్లోబల్ ప్లాట్‌ఫామ్ కల్పించే భారీ బిజినెస్ రియాలిటీ షో 'గేమ్ ఛేంజర్స్'తో నటుడు ఆర్. మాధవన్ మళ్లీ బుల్లితెరపై సందడి చేయనున్నారు. దుబాయ్ వేదికగా తెరకెక్కే ఈ అంతర్జాతీయ ఓటీటీ షో వివరాలు ఇవే.
R Madhavan Host To Business Reality Show Game Changers OTT: టాలెంటెడ్, పాన్-ఇండియా స్టార్ ఆర్. మాధవన్ సరికొత్త అవతారంలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. వెండితెరపై విభిన్న పాత్రలతో మెప్పించడమే కాకుండా, తనదైన వ్యాఖ్యానంతో గతంలో బుల్లితెర ప్రేక్షకులను కట్టిపడేసిన మాధవన్.. త్వరలోనే ఒక అంతర్జాతీయ బిజినెస్ ఓటీటీ రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.

వ్యాపార ప్రపంచంలో వినూత్న సంచలనం
‘గేమ్ ఛేంజర్స్’ పేరుతో రానున్న ఈ కార్యక్రమం వ్యాపార ప్రపంచంలో వినూత్న సంచలనానికి శ్రీకారం చుట్టబోతోంది. హైదరాబాద్ వంటి నగరాల్లో నేడు స్టార్టప్ విప్లవం కొనసాగుతోంది. కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చే యువ పారిశ్రామికవేత్తలకు సరైన పెట్టుబడులు, మార్గదర్శకత్వం ఎంత అవసరమో అందరికీ తెలిసిన విషయమే.
దుబాయ్ వేదికగా అంతర్జాతీయ షో!
ఇలాంటి తరుణంలో, ప్రపంచ స్థాయి వేదికపై పారిశ్రామికవేత్తలను నిలబెట్టి వారి ఆశయాలకు ఊపిరిపోసే ప్రయోగానికి మాధవన్ సారథ్యం వహించడం విశేషం. ప్రముఖ నిర్మాణ సంస్థ 'ఆప్టిమిస్టిక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా లిమిటెడ్' ఈ 'గేమ్ ఛేంజర్స్' షోను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తోంది.
మిడిల్ ఈస్ట్ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ స్థాయి ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని దుబాయ్‌లో ఈ కార్యక్రమాన్ని చిత్రీకరించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రకరకాల స్టార్టప్ వ్యవస్థాపకులు ఈ వేదికపై తమ బిజినెస్ ఐడియాలను ప్రెజెంట్ చేస్తారు.
అంతర్జాతీయ ఇన్వెస్టర్లు ప్యానెల్‌గా
దుబాయ్, లండన్, రష్యా, అమెరికా వంటి దేశాలకు చెందిన ప్రముఖ అంతర్జాతీయ ఇన్వెస్టర్లు ప్యానెల్‌గా వ్యవహరించి, ప్రతిభ ఉన్న స్టార్టప్‌లలో పెట్టుబడులు పెడతారు. కేవలం వ్యాపార ప్రతిపాదనలకే పరిమితం కాకుండా, ఒక కంపెనీని సున్నా నుంచి ఏ స్థాయికి తీసుకెళ్లవచ్చో, నేటి పోటీ ప్రపంచంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా అధిగమించాలో ఈ షో ద్వారా వీక్షకులకు ప్రత్యక్షంగా చూపించనున్నారు.
"గేమ్ ఛేంజర్స్ అనేది కేవలం ఒక టీవీ కార్యక్రమం మాత్రమే కాదు. భవిష్యత్తులో గ్లోబల్ వినోద రంగాన్ని ఏలే సామర్థ్యం ఉన్న బ్రాండ్. పారిశ్రామికవేత్తల ఆలోచనలు, ఇన్వెస్ట్‌మెంట్ల చుట్టూ తిరిగే ఈ కాన్సెప్ట్ అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది" అని ఆప్టిమిస్టిక్స్ సంస్థ ఛైర్మన్ విపుల్ డి షా ఆశాభావం వ్యక్తం చేశారు.
బిజినెస్ వెనుకున్న కష్టం, ఆశయం
"సాధారణ పిచ్ షోల కంటే ఇది పూర్తి విభిన్నంగా ఉంటుంది. ఒక బిజినెస్ వెనుక ఉన్న కష్టం, ఆశయం, వ్యూహాలను ఆవిష్కరిస్తూ ప్రేక్షకులకు గ్లోబల్ ఎకానమీపై స్పష్టమైన అవగాహన కల్పిస్తుంది" అని సంస్థ సీఈఓ రాజేష్ బాల్ పేర్కొన్నారు.
యాంకర్‌గా మాధవన్ అనుభవం..
మాధవన్‌కు టీవీ హోస్టింగ్ కొత్తేమీ కాదు. 1997లోనే 'తొల్ మోల్ కే బోల్' అనే గేమ్ షోతో తన యాంకరింగ్ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 2005లో వచ్చిన పాపులర్ షో 'డీల్ ఆర్ నో డీల్' ద్వారా బుల్లితెరపై నభూతో అనే స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నారు. 2010లో 'బిగ్ మనీ' కార్యక్రమానికి కూడా ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
సినిమా విశేషాలు
ఇక మాధవన్ సినిమాల విషయానికొస్తే, ఇటీవలే ఆయన జి.డి.నాయుడు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'జీడీ నాయుడు' అనే తమిళ బయోపిక్‌లో అలరించారు. త్వరలోనే ప్రముఖ దర్శకుడు ఆర్ బాల్కీ తెరకెక్కించనున్న తమిళ చిత్రంలో విద్యా బాలన్‌తో కలిసి నటించనున్నారని సమాచారం.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


