Mandadi: మండాడి పూర్తికాకముండే బిజినెస్ క్లోజ్ చేశాం, ఈ ఏడాదిలో మాకు ఇదో బిగ్గెస్ట్ హిట్: నిర్మాత మైత్రీ రవి కామెంట్స్

Mythri Ravi Comments On Mandaadi: సుహాస్, సూరి నటించి తెలుగు, తమిళ స్పోర్ట్స్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ మండాడి. సెప్టెంబర్ 10న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్ దక్కించుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా ఇవాళ నిర్వహించిన మండాడి సక్సెస్ సెలబ్రేషన్స్‌లో సుహాస్, సూరి, నిర్మాత రవి కామెంట్స్ చేశారు.

Published on: Sep 12, 2026, 20:20:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Mythri Ravi Comments On Mandaadi: తెలుగు యంగ్ హీరో సుహాస్ విలన్‌గా నటించిన లేటెస్ట్ తమిళ స్పోర్ట్స్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామా సినిమా మండాడి. తెలుగులోనూ విడుదలైన ఈ సినిమాలో హీరోగా కమెడియన్ కమ్ హీరో సూరి చేశాడు. ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్ మీద ఎల్రెడ్ కుమార్ నిర్మించారు.

మండాడి పూర్తికాకముండే బిజినెస్ క్లోజ్ చేశాం, ఈ ఏడాదిలో మాకు ఇదో బిగ్గెస్ట్ హిట్: నిర్మాత మైత్రీ రవి కామెంట్స్
మండాడి పూర్తికాకముండే బిజినెస్ క్లోజ్ చేశాం, ఈ ఏడాదిలో మాకు ఇదో బిగ్గెస్ట్ హిట్: నిర్మాత మైత్రీ రవి కామెంట్స్

ఏపీ, తెలంగాణలో మైత్రి డిస్ట్రిబ్యూటర్స్

మదిమారన్ పుగళేంది దర్శకత్వం వహించిన ఈ మండాడి సినిమాలో సుహాస్, సూరితోపాటు మహిమ నంబియార్, సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఏపీ, తెలంగాణలో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్‌పి సెప్టెంబర్ 10న రిలీజ్ చేశారు.

థియేటర్లలో విడుదలైన మండాడి మంచి విజయంతో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా మండాడి యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌ను శనివారం అంటే ఇవాళ (సెప్టెంబర్ 12) గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూరి, సుహాస్ తదితరులు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

రెండ్రోజుల ముందే చెప్పారు

సూరి మాట్లాడుతూ .. "‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్. మైత్రి నవీన్ గారు, రవి గారు ఓ రెండ్రోజుల ముందే ఈ మూవీని చూసి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ముందే చెప్పారు. అన్ని భాషల్లో ఈ సినిమాకి మంచి సక్సెస్ వచ్చింది. మదిమారన్ గారికి, ఎల్రెడ్ గారికి థాంక్స్" అని అన్నాడు.

"ఈ జర్నీలో సపోర్ట్ చేసిన నా తమ్ముడు సుహాస్ గారికి థాంక్స్. ‘మండాడి’కి తమిళంతో పాటుగా తెలుగులోనూ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. మాకు ఇక్కడ సపోర్ట్ చేసిన మైత్రి నవీన్ సార్‌కి, రవి సార్‌కి, శశి సార్‌కి థాంక్స్. మా మీద ప్రేమను చూపిస్తున్న తెలుగు ప్రేక్షకులకు థాంక్స్" అని సూరి తెలిపాడు.

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం

సుహాస్ మాట్లాడుతూ .. "‘మండాడి’ని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు, ఈ జర్నీలో సపోర్ట్ చేసిన మీడియాకి థాంక్స్. నవీన్ గారితో కలిసి ఈ మూవీని చూశాను. సినిమా చూసిన రోజే బ్లాక్ బస్టర్ అని నవీన్ గారు చెప్పారు. మేం పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చింది" అని పేర్కొన్నాడు.

"సూరి అన్న ఈ మూవీ కోసం ఎంతో కష్టపడ్డారు. మహిమ గారి గురించి, రవింద్ర గురించి అందరూ చెబుతున్నారు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన మదిమారన్ గారికి థాంక్స్. ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియెన్స్‌కి థాంక్స్" అని విలన్‌గా చేసిన హీరో సుహాస్ చెప్పుకొచ్చాడు.

8 నెలల క్రితమే

మైత్రీ రవి మాట్లాడుతూ .. "‘మండాడి’ సినిమాని ఎనిమిది నెలల క్రితం ఓ బిజినెస్ కట్ చూశాం. వెంటనే శశిని పంపించి బిజినెస్ క్లోజ్ చేశాం. అప్పటికి మూవీ ఇంకా పూర్తి కాలేదు. కానీ ఇప్పుడు మా నమ్మకం నిజమైంది. ప్రతీ చోటా హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. ఈ ఏడాదిలో మాకు ఇదొక బిగ్గెస్ట్ హిట్" అని అన్నారు.

"సుహాస్, సూరి సీన్లు, బోట్ సీక్వెన్స్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. టీం పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చింది. ఈ సినిమా మరింత విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను" అని ఆకాంక్షించారు నిర్మాత మైత్రీ రవి యెర్నేని.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More