Mandaadi Teaser: మండాడి టీజర్ రిలీజ్- సుహాస్, సూరి పవర్‌ఫుల్ ఎంట్రీ- పడవ పందేల కథ- విజువల్స్, బోట్ సీక్వెన్స్ హైలెట్!

Suhas Suri Mandaadi Teaser Released: తెలుగు హీరో సుహాస్ నటించిన లేటెస్ట్ తమిళ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా సినిమా మండాడి. సూరి సైతం ప్రధాన పాత్ర పోషించిన మండాడి తెలుగు టీజర్‌ను తాజాగా విడుదల చేశారు. పడవ పందేల కథగా సాగనున్న మండాడి టీజర్‌లో విజువల్స్, బోట్ సీక్వెన్స్ హైలెట్‌గా నిలిచాయి.

Published on: Aug 26, 2026, 20:56:27 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Suhas Suri Mandaadi Teaser Released: తెలుగులో తనదైన స్టైల్‌లో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు హీరో సుహాస్. హీరోగానే కాకుండా విలన్‌గా, నటుడిగా కీలక పాత్రలు పోషిస్తూ మెప్పిస్తున్నాడు. అలాంటి సుహాస్ నటించిన లేటెస్ట్ తమిళ సినిమానే మండాడి. ఈ సినిమాలో సుహాస్‌తోపాటు హీరోగా మారిన కోలీవుడ్ కమెడియన్ సూరి మరో కీ రోల్ పోషిస్తున్నాడు.

మండాడి టీజర్ రిలీజ్- సుహాస్, సూరి పవర్‌ఫుల్ ఎంట్రీ- పడవ పందేల కథ- విజువల్స్, బోట్ సీక్వెన్స్ హైలెట్!
మండాడి టీజర్ రిలీజ్- సుహాస్, సూరి పవర్‌ఫుల్ ఎంట్రీ- పడవ పందేల కథ- విజువల్స్, బోట్ సీక్వెన్స్ హైలెట్!

సుహాస్, సూరి మెయిన్ లీడ్ రోల్స్‌లో

సుహాస్, సూరి మెయిన్ లీడ్ రోల్స్‌లో నటించిన మండాడి సినిమాను స్పోర్ట్స్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ సినిమాను ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్ మీద ఎల్రెడ్ కుమార్ నిర్మాతగా రూపొందించారు. ఈ మండాడి సినిమాకు మతిమారన్ పుగళేంది దర్శకత్వం వహించారు.

మండాడి నటీనటులు, విడుదల తేది

అలాగే, మండాడి సినిమాలో మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటించగా.. సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు ఇతర కీలక పాత్రలను పోషించారు. మండాడి మూవీని సెప్టెంబర్ 10న భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నారు.

మండాడి తెలుగు టీజర్ రిలీజ్

ఏపీ, తెలంగాణలో మండాడి చిత్రాన్ని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్‌పి భారీ ఎత్తున విడుదల చేయనుంది. ఈ క్రమంలో తాజాగా మండాడి తెలుగు టీజర్‌ను విడుదల చేశారు. మండాడి టీజర్ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో బాగా ఆకట్టుకుంటోంది.

అదిరిపోయిన డైలాగ్స్

మండాడి టీజర్‌లోకి వెళితే.. ‘పందెమే మనల్ని కాపాడుతుంది.. పందెన్నీ మనం కాపాడటం లేదు’, ‘బరిలోకి దిగే ప్లేయర్స్‌లో నిజాయితీ ఉంటే.. ఈ గాలి, సముద్రం మిమ్మల్ని ఎప్పటికీ ఒగ్గేయదు’ అనే డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.

హైలెట్‌గా విజువల్స్, బోట్ సీక్వెన్స్

అలాగే, మండాడి టీజర్‌లో చూపించిన విజువల్స్, బోట్ సీక్వెన్స్, పడవ పందెంలకు సంబంధించిన సీన్లు హైలెట్‌గా నిలుస్తున్నాయి. ఇక సుహాస్, సూరి పవర్ ఫుల్ ఎంట్రీలు, జీవీ ప్రకాష్ ఇచ్చిన బీజీఎమ్ నెక్ట్స్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎస్.ఆర్. కథిర్ సినిమాటోగ్రఫీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

ఒక్కసారిగా పెరిగిన అంచనాలు

మండాడి టీజర్‌తో ఒక్కసారిగా అంచనాలు రెట్టింపు అయ్యాయి. డైలాగ్స్, ఎమోషన్స్, యాక్షన్స్ ఇలా అన్ని రకాలుగా ‘మండాడి’ ఇంటెన్స్‌గా ఉండబోతోందని అర్థం అవుతోంది. ఈ సినిమాకి సంగీతాన్ని జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా, ఎస్.ఆర్. కథిర్ సినిమాటోగ్రఫర్‌గా పని చేశారు.

యాక్షన్ సన్నివేశాలకు పీటర్ హెయిన్

మండాడి సినిమాకు ప్రొడక్షన్ డిజైన్‌ను డి.ఆర్.కె. కిరణ్, ఎడిటింగ్‌ను ప్రదీప్ ఇ. రాఘవ్, యాక్షన్ సన్నివేశాలకు పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బురాయన్, మహేష్ మాథ్యూ కంపోజ్ చేశారు.

5 భాషల్లో మండాడి గ్రాండ్ రిలీజ్

మండాడి సినిమాను తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ వంటి ఐదు భాషల్లో సెప్టెంబర్ 10న చాలా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More