Suhas Mandadi: సుహాస్ ‘మండాడి’ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.. ఇంటెన్స్ లుక్‌లో యంగ్ హీరో

Suhas Mandadi: టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ నటిస్తున్న మండాడి మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజైంది. సుహాస్ బర్త్‌డే సందర్భంగా మేకర్స్ ఓ ఇంటెన్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో సుహాస్ సరికొత్తగా కనిపిస్తున్నారు.

Published on: Aug 19, 2026, 22:13:51 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Suhas Mandadi: వెరైటీ కాన్సెప్ట్ సినిమాలు, నేచురల్ పెర్ఫార్మెన్స్‌తో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో సుహాస్ బర్త్‌డే సందర్భంగా ఆయన లేటెస్ట్ మూవీ ‘మండాడి’ నుంచి బిగ్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ డ్రామాలో సుహాస్ మునుపెన్నడూ చూడని ఇంటెన్స్, మాస్ అవతార్‌లో కనిపిస్తుండగా, సినిమా గ్రాండ్ రిలీజ్ డేట్‌ను కూడా ఆఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.

Suhas Mandadi: సుహాస్ ‘మండాడి’ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.. ఇంటెన్స్ లుక్‌లో యంగ్ హీరో
Suhas Mandadi: సుహాస్ ‘మండాడి’ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.. ఇంటెన్స్ లుక్‌లో యంగ్ హీరో

RS ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్‌పై ఎల్రెడ్ కుమార్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని మతిమారన్ పుగళేంది డైరెక్ట్ చేస్తున్నారు. కోలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, కల్ట్ డైరెక్టర్ వెట్రిమారన్ ఈ ప్రాజెక్ట్‌కి క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తుండడం విశేషం.

బర్త్‌డే పోస్టర్‌లో సుహాస్ రఫ్ అండ్ రా లుక్

సుహాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన స్పెషల్ పోస్టర్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ పోస్టర్‌లో సుహాస్ ఒత్తయిన గడ్డం, చేతికి పెద్ద ఉంగరం, క్లాసిక్ వాచ్ ధరించి డిఫరెంట్ మేకోవర్‌లో కనిపించారు.

సుహాస్ ఈ ఇంటెన్స్ లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది. సుహాస్ మేకోవర్, చేతికి ఉన్న ఉంగరం, గడియారం ఇవన్నీ కూడా హైలెట్ అవుతున్నాయి. ఈ పోస్టర్‌లో కనిపించే సామాన్లు, సుహాస్ లుక్ చూస్తుంటే ఏదో యాక్షన్ సీక్వెన్స్‌కి రెడీ అవుతున్నట్టుగా కనిపిస్తోంది.

సెప్టెంబర్ 10న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్

‘మండాడి’ మూవీని సెప్టెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకువస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి ఈ సినిమా సందడి చేయనుంది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ బిగ్ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ LLP’ అత్యంత భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల చేస్తోంది. నటుడు సూరి, సుహాస్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

సముద్రంలో హై-వోల్టేజ్ యాక్షన్ సీన్లు

ఈ మండాడి సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలిచేవి యాక్షన్ సీక్వెన్సెస్ అని మూవీ టీమ్ ధీమా వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా బోట్లలో సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో చిత్రీకరించిన సీన్స్ ప్రేక్షకులను థ్రిల్ చేయడం ఖాయమని చెబుతున్నారు.

పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బరాయన్, మహేష్ మాథ్యూ లాంటి ముగ్గురు పవర్‌ఫుల్ ఫైట్ మాస్టర్లు ఈ సినిమా యాక్షన్ బ్లాక్స్‌ను కొరియోగ్రాఫ్ చేశారు. యాక్షన్ విజువల్స్, సస్పెన్స్ ఎలిమెంట్స్ థియేటర్లలో నెక్స్ట్ లెవెల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తాయని నిర్మాతలు తెలిపారు.

టాప్ టెక్నికల్ టీమ్.. బిగ్ స్టార్ క్యాస్టింగ్

ఈ సినిమాలో మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సీనియర్ నటుడు సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాలా శరవణన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అందిస్తుండగా, ఎస్.ఆర్. కతిర్ సినిమాటోగ్రఫీ పర్యవేక్షిస్తున్నారు. ప్రదీప్ ఇ. రాఘవ్ ఎడిటర్‌గా, డి.ఆర్.కె. కిరణ్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. కంటెంట్, టెక్నికల్ వేల్యూస్ పరంగా ‘మండాడి’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేసేలా కనిపిస్తోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More